Go to full page →

సంభాషణ COLTel 282

శక్తిమంతమైన భాషణ జాగ్రత్తగా వృద్ధిపర్చుకోవలసిన తలాంతు, దేవుడిచ్చే వరాలన్నిటిలోను దేనికన్నా ఎక్కువ ఆశీర్వాదకరమైన వనం మరొకటి లేదు. స్వరంతో మనం నమ్మకం పుట్టించి ఒప్పింపజేస్తాం. దానితోనే మనం ప్రార్ధించి దేవుని మహిమపర్చుతాం. స్వరంతోనే మనం విమోచకుని ప్రేమను గురించి చెబుతాం. అందును బట్టి దాన్ని మేలు చేసేందుకు అది సమర్ధంగా పనిచేసుటట్లు తర్బీతు చెయ్యటం ఎంత ప్రాముఖ్యం! COLTel 282.2

స్వర సంస్కరణ సద్వినియోగాన్ని జ్ఞానం గల వ్యక్తులు, క్రైస్తవ ఉద్యమ కర్తలు సయిత నిర్లక్ష్యం చెయ్యటం జరుగుత్నుది. తాము చదువుతున్నది ఏలక మాట్లాడుతున్నది నెమ్మదిగానో అతివేగంగానో ఉన్నందున అనేకులికి చదివేది లేక మాట్లాడేది అర్ధం కాకుండా పోతుంది. కొందరి ఉచ్చారణ మందంగా అస్పష్టంగా ఉటుంది. ఇతరులు హెచ్చు స్థాయిలో వాడికి గల కీచు గొంతుతో మాట్లాడతారు. ఆ మాటలు వినేవారి చెవులకు అతి భాధాకరంగా ఉంటాయి. బహిరంగ సభలు సమావేశాలు ముందు సమర్పించే వాక్య భాగాలు, కీర్తనలు, నివేదికలు, ఇతర పత్రాలు కొన్నిసార్లు అర్ధం కాని విధముగా చదవటం, తరుచుగా వాటి శక్తిని ప్రభవాన్ని నాశనం చెయ్యటం జరుగుతుంటుంది. COLTel 282.3

ఇది జరగకూడదని అనర్ధం దీన్ని సరిదిద్దలి. ఈ విసయమై బైబిలు ఉపదేశం ఇస్తున్నది. ఎజ్రా దినాల్లో ప్రజలకు లేఖనాలు చదివి వినిపించిన లేవియుల్ని గూర్చి ఇలా అంది. “వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, జనులు బాగుగా గ్రహించునుట దానికి అర్ధము చెప్పిరి” నెహ 8:8 COLTel 282.4

పట్టుదలతో కూడిన కృషి ద్వారా చక్కగా స్పష్టంగా చదవటానికి, సంపూర్ణమైన, స్పష్టమైన స్వరంతో, స్పష్టంగా ప్రభావంతంగా మాట్లాడానికి అందరూ శక్తిని పొందవచ్చు. ఇలా చేయటం ద్వారా క్రీస్తు సేవకులుగా మనం మన సామర్ధ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు. COLTel 283.1

ప్రతీ క్రైస్తవుడు శోధింపశక్యముకాని క్రీస్తు ఐశ్వర్యాన్ని గూర్చి ఇతురులికి వెల్లడించల్సి ఉన్నాడు కాబట్టి తన భాషా వినియోగంలో అతడు సంపూర్ణతను సాధించాలి. వినేవారు మెచ్చు విధంగా అతడు శ్రోతలకు దైవ వాక్యాన్ని సమర్పించాలి. తన మానవ ప్రతినిధులు, సంస్కారం లేని వారై ఉండాలన్నది దేవుని సంకల్పం కాదు. తన ద్వారా లోకానికి ప్రవహించే పరలోక విద్యుత్తును మనుషుడు చులకన చెయ్యటం గాని భ్రష్టపర్చటం గాని జరగకూడదన్నది దేవుని చిత్తం. COLTel 283.2

మనం పరిపూర్ణ అదర్శం అయిన యేసుని చూడాల్సి ఉంది. మనం పరిశుద్దాత్మ సహయం కోసం ప్రార్థించాలి. ఆయన శక్తితో ప్రతీ అవయవాన్ని పరిపూర్ణల సేవ నిమిత్తం తర్బీతు చెయ్యటానికి ప్రయత్నించాలి. COLTel 283.3

మరి ముఖ్యంగా ప్రజాసేవకు పిలుపు పొందిన వారి విషయంలో ఇది వాస్తవం. ప్రతీ బోధకుడు ప్రతీ ఉపదేశకుడు నిత్యజీవానికి సంబంధించిన వర్తమానాన్ని తాను ప్రజలకు అందిస్తున్నానని మనసులో ఉంచుకోవాలి. బోధిపంబడ్డ సత్యం చివరి తీర్పు జరిగే ఆ మహా దినాన వారికి తీర్పు తీర్చుతుంది. కొందరి విషయంలో ఆ వర్తమనాన్ని బోధించే తీరును బట్టి దాన్ని స్వీకరించటమో విసర్జించటమో నిర్ణయించుకోవటం జరుగుతుంది. కనుక అవగాహనకు సాయపడి హృదయాన్ని ఆకట్టుకునే రీతిగా వాక్యాన్ని మెల్లగా, స్పష్టంగా, గంభీరంగా అయినా దాని ప్రామఖ్యం కోరే చిత్తశుద్ధితో ఉచ్చరించాలి. COLTel 283.4

క్రైస్తవ సేవ ప్రతీ విభాగంలోను సరి అయిన భాషణ దాని వినియోగం అసవరం. అది గృహ జీవితంలోకి ఇతరులతో మన సంబంధాలన్నటిలలోకి ప్రవేశిస్తుంది. చక్కని స్వరంతో స్వచ్చమైన నిర్దుష్టమైన భాషతో దయగల మాటలు, మర్యాదగా మాట్లాడాలి. మధురమైన, దయగల మాటలు మంచులా, మల్లెగా పడే వానలా, ఆత్మకు హాయినిస్తాయి. “అలసినవానిని మాటల చేత ఊరడించు జ్ఞానము.... కలుగునట్లు” ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నదని క్రీస్తును గురించి లేఖనం చెబుతున్నది. యెష 50:4 కీర్త 45:2 “వినువారికి మేలు కలుగునుట్ల” మీ సంభాషణ... ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండ నియ్యుడి”. (ఎఫె 4:29;కొలొ 4:6) COLTel 283.5

ఇతరుల్ని సరిదిద్దటానికి లేక సంస్కరించటానికి ప్రయత్నించేటప్పుడు మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మందలించేటప్పుడు లేదా సలహాలిచ్చేటప్పుడు అనేకుల గొంతు కీచుగా కర్కశంగా మారుతుంది. వారు పలికే మాటలు గాయడప ఆత్మను బాగచేసేవి కావు. ఇలాంటి అపసవ్య పదాలు పదబంధాల వలన ఆత్మ ఆయాసపడుతుంది. తప్పిదస్తులు తిరుబాటుకు పూనుకుంటారు. సత్య సూత్రాల్ని ప్రబోధించే వారందరు దైవ ప్రేమాతైలాన్ని పొందాలి. అన్ని పరిస్తితుల్లోనూ మందలింపు ప్రేమతో జరగాలి. అప్పుడు మన మాటలు దిద్దుబాటు కలిగిస్తాయి. ఆవేశాన్ని రెచ్చగొట్టవు. క్రీస్తు తన పరిశుద్దాత్మ ద్వారా మా మాటలకు బలాన్ని శక్తిని చేకూర్చుతాడు ఇది యాయన పని. COLTel 284.1

ఒక్కమాట కూడా ఆనాలోచితంగా పలకకడూదు. క్రీస్తును వెంబడించే వ్యక్తి పెదవుల నుంచి ఒక్క నిరర్థక సంభాషణ. ఒక్క దు:ఖ స్వరం లేదా ఒక్క చెడ్డ సూచన వెలువడకూడదు. పరిశుద్ధాత్మ ఆవేశంతో రాస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు. “క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుబడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి”. ఎఫె 4:29 దుర్భాష అంటే చెడ్డమాటలు మాత్రమే కాదు. పరిశుద్ధ నియమాలకు విరుద్ధమైన ఎలాంటి బాష అయినా అని; పరిశుద్ద అయిన, అపవిత్రం కాని మతమని దీని భావం, అపవిత్ర సూచనలు, దుష్టతను సూచించే ప్రచ్చన్న సూచనలు ఈ దుర్బాషలో భాగమే. వీటిని తక్షణమ ప్రతిఘటించకపోతే అవి ఘోర పాపానికి దారి తీస్తాయి. COLTel 284.2

దుర్బాషకు అడ్డుకట్ట వెయ్యాల్సిన బాధ్యత ప్రతీ కుటుంబము పైన, ప్రతీ వ్యక్తిగత క్రైస్తవుడి మీద ఉన్నది. బుద్దిహీనంగా మాటాల్‌ ఏ మనుషులతో ఉన్నప్పుడు సాధ్యమైతే ఆ సంభాషణాంశాన్ని మార్చటం మన బాధ్యత. దేవుని కృప ద్వారా మనం నెమ్మదిగా మాటలాడి లేక కొత్త అంశాన్ని ప్రవేశ పెట్ట ఆ ప్రస్తావనను ఉపయోగకరంఆ మలుపు తిప్పవచ్చును. COLTel 284.3

పిల్లలు సవినయంగా మర్యాదగా మాట్లేడట్టుల వారిని తర్బీతు చెయ్యటం తల్లితండ్రుల కర్తవ్యం. ఈ సంస్క్కతి నేర్పటానికి అత్యుత్తమ పాఠశాల గృహ జీవితమే,. పిల్లలు తల్లితండ్రులతోను తమతో తాము మర్యాదగా ప్రేమగా మాట్లాడటానికి వారికి పసితనం నుంచే నేర్పాలి. తమ నోటి వెంట మెత్తని మాటలు, సత్యవచనాలు, స్వచ్ఛత గల పలుకులు మాత్రమే రావాలని వారికి నేర్పించాలి. తల్లితండ్రులు తామే అనుదినం క్రీస్తు పాఠశాలలో నేర్చుకోవాలి. అప్పుడు వారు మాట ద్వారాను ఆదర్శనం ద్వారాను తమ బిడ్డలకు “మాన్యమైన.... నిరాక్షేపమైన” “ఉపదేశము” నేర్పగలుగుతారు ( తీతుకు 208) వారి అత్యుతన్న తమైన మిక్కిలి బాధ్యతయుతమైన విధుల్లో ఇది ఒకటి. COLTel 285.1

క్రీస్తు అనుచరులమైన మనం క్రైస్తవ జీవితంలో పరస్పరం సహాయం ప్రోత్సాహం అందించుకునే మాటలు మాట్లాడుకోవాలి. మన అనుబవంలోని ప్రశస్త అధ్యాయల గురించి మరెక్కువ ప్రస్తావిచు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని కృప గురించి ఆయన ప్రేమానురాగాల గురించి రక్షకుని నిరుపమైన మమతను గురించి మనం మాట్లాడాలి. మనం మాట్లాడే మాటు స్తుతి వాక్కులు వందనార్పణ వచనాలు అయివుండాలి. మన మనసు, హృదయం దేవుని ప్రేమతో నిండి ఉంటే అది మన సంభాషణలో వెల్లడువుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలోకి ఏది ప్రవేశిస్తుందో దాన్ని విశదీకరించటం కష్టమైన విషయం కాదు. గొప్ప ఆలోచనలు, ఉదాత్తమైన ఆకాంక్షలు, సత్యాన్ని గూర్చిన స్పష్టమైన అభిప్రాయాలు, స్వార్ధరహిత ఉద్దేశాలు, భక్తి పరిశుద్ధతల కోసం తపన హృదయంలో ఉన్న ఐశ్వర్యం స్వభావాన్ని తెలియపర్చే మాటల్లో ఫలాలు ఫలిస్తాయి. మన మాటల్లో క్రీస్తు ఇలా వెల్లడైనప్పుడు ఆత్మల్ని ఆయన వద్దకు నడిపించే శక్తి వాటికుటుంది. COLTel 285.2

క్రీస్తుని ఎరుగని వారితో ఆయన్ని గూర్చి మనం మాటాడాలి. క్రీస్తు పనిచేసినట్లు మనం పని చెయ్యాలి. సమాజ మందిరంలో మార్గం పక్క, తీరం నుంచి కొద్దిగా నీటిలోకి లాగిన పడవలో, పరిసయ్యుడి విందులో లేక సుంకరి భోజంన బల్ల వద్ద - ఆయన ఎక్కడ ఉన్నా ఉన్నత జీవితానికి సంబంధించిన విషయాల్ని గూర్చి మనషులతో మాట్లాడాడు. తాను బోధించిన సత్యంతో ప్రకృతి విషయాల్ని జీవితంలోని అనుదిన ఘటనల్ని ఆయన అనుబంధ పర్చేవాడు. శ్రోతల హృదయాలు ఆయనకు ఆకర్షితమయ్యేవి. ఎందుకంటే వారిలోని వ్యాధిగ్రస్తుల్ని ఆయన బాగు చేసాడు. వారిలో దు:ఖించే వారిని ఓదార్చాడు. వారి పిల్లల్ని చేతుల్లోకి తీసుకొని ఆశీర్వదించాడు. ఆయన మాట్లాడటానికి నోరు విప్పినప్పుడు వారి గమనం ఆయన మీద నిలిచేది. ఆయన పలికి ప్రతీ మాట ఏదో ఆత్మకు రక్షణార్ధమైన రక్షణ వాసనగా పరిగణమించేది. COLTel 286.1

ఆయన మాటలు మనకు కూడా అలాగే ఉండాలి. మనం ఎక్కడున్నా రక్షకుణ్ణి గురించి ఇతరులికి చెప్పటానికి అవకాశాల కోసం కని పెట్టాలి. మేలు చెయ్యటంలో క్రీస్తు ఆదర్శాన్ని మనం అవలంభించినట్లయితే శ్రోతలు ఆయనకు స్పందించినట్లు మనకు స్పందిస్తారు. అర్ధాంతంగా గాక దైవ ప్రేమ వల్ల కలిగిన నేర్పుతో ” పదివేలమంది పరుషులలో.. గుర్తింపు” గలిగినవాడు'అతికాంక్షణీయుడు’ (పరమగీ 5:10,16) ఆయిన ప్రభువుని గూర్చి మనం వారికి చెప్పవచ్చు. మన భాషణ వరాన్ని వినియోగించగల అత్యున్నత సేవ ఇదే. పాప క్షమాపణను అనుగ్రహించే రక్షకుడుగా క్రీస్తుని సమర్పించటానికి ఈ వరాన్ని దేవుడు మనకిచ్చాడు. COLTel 286.2