Go to full page →

8—దాచబడ్డ ధనం COLTel 73

ఆధారం : మత్తయి 13::44

“పరలోక రాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దానికనుగొని దాచి పెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినందంతయు అమ్మి ఆ పొలమును కొనెను”. COLTel 73.1

పూర్వము మనుష్యులు తమ ధనాన్ని భూమిలో దాచి పెట్టేవారు. దొంగతనాలు దోపిడీలు ఎక్కువగా ఉండేవి. పాలనాధికారం చేతులు మారినప్పుడల్లా ఎక్కువ ధనమున్నవారు పెద్దమొత్తంలో పన్ను చెల్లించాల్సి వచ్చేది. అదీగాక బందిపోటు దొంగల దాడుల వల్ల దేశం నిత్యం అపాయాన్ని ఎదుర్కుంటూ ఉండేది. పర్యవసానంగా భాగ్యవంతులు తమ ధనాన్ని దాచి పెట్టేవారు. ధనం దాచుకోవటానికి భూమిని సురక్షిత సాధనంగా పరిగణించేవారు. అయితే ధనం దాచుకున్న స్థలాన్ని మరిచిపోవడం తరుచుగా జరుగుతుండేది. సొంతదారుడు మరణించడం ఖైదుకి వెళ్లడం లేక దేశ బహిష్కారానికి గూరి అయి కుటుంబాన్ని విడిచి పెట్టడం జరిగేది. అతడు దాచి పెట్టిన ధనం ఇలా ఎవరు కనుగొంటారో వారికి మిగిలి ఉండేది. క్రీస్తు దినాల్లో నిర్లక్ష్యానికి గురి అయిన భూమిలో పాత నాణేలు వెండి బంగారు ఆభరణాలు దొరకటం సామాన్యంగా జరిగేది. COLTel 73.2

సేద్యం చెయ్యటానికి మనుష్యులు నేలను అద్దెకు తీసుకుంటారు., ఎడ్లు నేలను దున్నేటప్పుడు భూమిలో కప్పబడి ఉన్న ధనం వెలుపలికి వస్తుంది. ధనమున్నట్లు తెలుసుకున్న ఆ వ్యక్తి తన ముంగిట్లో అదృష్టం ఉన్నట్లు చూస్తాడు. ఇంటికి వచ్చి ధనమున్న ఆ నేలను కొనటానికి తనకున్న దంతా అమ్ముతాడు. అతడు పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నాడని తన ఇంటి వారు ఇరుగుపొరుగువారు తలస్తారు. ఆ భూమిని చూసి పనికి మాలిన ఆ నేల ఏమి విలువ లేనిదని పెదవి విరుస్తారు. కాని తానేమి చేస్తున్నాడో ఆ వ్యక్తికి తెలుసు. ఆ పొలానికి హక్కుదారుడైనప్పుడు తాను సంపాదించిన పొలంలో దనం ఎక్కడ ఉన్నదో కననుగొనటానికి పొలమంతా వెదకుతాడు. COLTel 73.3

పరలోక సంబంధమైన ధనం విలువను దాన్ని సంపాదించటానికి చెయ్యాల్సిన కృషిని ఈ ఉపమానం ఉదాహరిస్తుంది. పొలంలో ధనాన్ని కనుగొన్న వ్యక్తి దాన్ని సొంతం చేసుకోవటానికి తనకున్నందంతా విడిచి పెట్టుకోవడానికి నిర్విరామంగా శ్రమించటానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే పరలోక భాగ్యాన్ని కనుగొన్నవాడు సత్యమనే ధనాన్ని పొందటానికి ఎలాంటి శ్రమ భారమైంది కాదని ఎలాంటి త్యాగం చేయలేనిది కాదని భావిస్తాడు. ఉపమానంలోని దాచబడ్డ ధనమున్న పొలం పరిశుద్ధ లేఖనాల్ని సూచిస్తుంది. ఆ ధనం సువార్త దైవ వాక్యంలో దాగి ఉన్న బంగారపు సిరులు వాటితో పాటు ప్రశస్తమైన విషయాలు ఈ పృద్విలో లేవు. COLTel 74.1