Go to full page →

10—వల COLTel 91

ఆధారం మత్తయి 13:47-50

“పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి, కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్ని గుండ ములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును”. COLTel 91.1

వల వేయటం సువార్తను ప్రకటించటం. ఇది మంచివారిని చెడ్డవారిని సంఘములోకి చేర్చుతుంది. సువార్త కర్తవ్యం ముగిసినప్పుడు తీర్పు వేర్పాటు పనిని ముగిస్తుంది. సంఘంలో అబద్ద విశ్వాసులనుండి సత్యమార్గాన్ని ఎలా చెడగొడారో క్రీస్తు చూసాడు. అబద్ద విశ్వాసుల తప్పుడు నడత వల్ల లోకం సువార్తను ఎగతాళి చేస్తుంది. COLTel 91.2

క్రీస్తు నామం ధరించిన అనేకులు పరిశుద్దాత్మ అదుపులో లేకపోవటం చూసి మంచి క్రైస్తవులు సహితము పడిపోతారు. ఈ దుష్టులు సంఘంలో ఉన్నారు. గనుక వారి పాపాల్ని దేవుడు పట్టించుకోవటం లేదని మనుషులు భావించే ప్రమాదముంది. అందుచేత క్రీస్తు భవిష్యత్తు తెరను పైకి లేపి మానవుడి భవిష్యత్తును నిర్ణయించేది అతడి ప్రర్తన గాని అతడి హెూదా కాదని అందరూ గ్రహించాల్సిందని ప్రకటిస్తున్నాడు. COLTel 91.3

గురుగుల ఉపమానం వల ఉపమానం రెండూ దుర్మార్గులందరూ దేవుని తట్టు తిరిగే సమయం ఎప్పుడు రాదని భోధిస్తున్నాయి. గోధుమలు గురుగుల కోత సమయం వరకు కలసి పెరుగుతాయి. చేపలు మంచివీ చెడ్డవీ రెండు చివరి వేర్పాటుకు ఒడ్డుకు చేర్చబడతాయి. COLTel 91.4

తీర్పు అనంతరము కృప అనేది ఉండదని ఈ రెండు ఉపమానాలు బోధిస్తున్నాయి. సువార్త సేవ సమాప్తమైనప్పుడు మంచి వారి నుండి చెడ్డవారిని ఏరివేత మొదలై ప్రతీవారి భవిష్యత్తు నిరంతరంగా నిర్ణయ మవుతుంది. ఎవరు నశించటం దేవునికి ఇష్టం లేదు. “నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషముకలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనస్సు త్రిప్పుకొనుడి. మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు” యె హె 33:11 COLTel 92.1

నిత్య జీవ వరాన్ని అంగీకరించమంటూ కృప కాలం పొడవునా మనుష్యులతో దేవుని ఆత్మ విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనను తోసిపుచ్చేవాడు మాత్రమే నశించటానికి మిగిలి ఉంటారు. విశ్వాన్ని నాశనం చేసే పాపం నాశనమవ్వాలని దేవుడు ప్రకటించాడు. పాపాన్ని విడిచి పెట్టనివారు దానితో పాటు నశిస్తారు. COLTel 92.2