Go to full page →

సూర్యరశ్మి, వాయు ప్రసరణ, ఉష్ణోగ్రతలు MHTel 183

రోగి కోలుకోవటానిక మిక్కిలి అనుకూలమైన పరిస్థితులు కల్పించ టానికి రోగి ఉండే గది పెద్దది, వెలుతురు గలది, ఉత్సాహన్నిచ్చేది వాయు ప్రసరణ సమృద్ధిగా ఉన్నది అయి వుండాలి. ఈ అవసరాలన్నీ ఉన్న గదిని ఇంటిలోని అనారోగ్య గదిగా కేటాయించాలి. అనేక గృహాల్లో సరియైన వాయు ప్రసరణ ప్రత్యేక ఏర్పాట్లు లేవు. సవ్యమైన వాయు ప్రసరణ లబించటం కష్టమౌతుంది.అయితే అనారోగ్య గదికి రాత్రింబగళ్ళు తాజా వాయు ప్రసరణ ఉండేటట్లు ఏర్పాట్లు చేయ్యాలి. MHTel 183.2

అనారోగ్య గదిలో సాధ్యమైనంత మేరకు సమ ఉష్ణోగ్రత ఉండేటట్లు ఏర్పాటు చేయ్యాలి. ఉష్ణమానిని ఉపయోగించాలి. రోగులకు సేవ చేసేవారికి తరుచు నిద్ర ఎక్కువ ఉండదు. గనుక లేక రోగులకు పరిచర్య చెయ్యటానికి రాత్రలో లేవాల్సి వస్తుంది గనుక చలికి అలవాటుపడతారు. వారికి ఆరోగ్యవంతమైన ఉష్ణోగ్రతను నిర్ణయించటానికి సమర్ధత ఉండదు. MHTel 183.3