Go to full page →

మనసు పై మనసు నియంత్రణ MHTel 202

ఏమైనా ఓ రకమైన మానసిక స్వస్థత ఉన్నది. అది దుర్మార్గతకు అతి శక్తిమంతమైన సాధనం. విజ్ఞాన శాస్త్రంగా పిలువబడే దీని ద్వారా ఒకరి మనసు ఇంకొకరి మనసు నియంత్రణ కిందకు తేవటం జరుగుతుంది ఇందులో బలహీనమైన వ్యక్తి వ్యక్తిత్వం బలవంతుడి వ్యక్తిత్వంతో మిళితమ వుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మనసును నియంత్రిస్తాడు. రోగి రోగాన్ని ప్రతిఘటించి జయించేందుకు ఆరోగ్యాన్నిచ్చే భావోద్వేగానికి అందించి ఇలా తలంపుల అన్వయం సాధించవచ్చుని దీని ప్రబోధకులు చెప్పటం జరుగుతున్నది. MHTel 202.5

దీని నిజ స్వభావం ఉద్దేశం తెలియని వ్యక్తులు రోగులకు మేలు జరగుతుందని ఈ స్వస్థత పద్దతిని నమ్మి ఉపయోగించారు. అయితే విజ్ఞాన శాస్త్రంగా పిలిచే ఇది తప్పుడు సూత్రాల పై ఆధారితమై ఉంది. అది క్రీస్తు స్వభావానికి స్ఫూర్తికి విరుద్ధం. అది ఎవరు జీవము రక్షణో ఆ ప్రభువు వద్దకు నడిపించదు. మనసులను తన వద్దకు ఆకర్షించే వ్యక్తి వాటిని తన బలానికి యదార్ధ మూలనుంచి వేరుచేస్తాడు. MHTel 203.1

ఏ మనషుడూ తన మనసును ఇంకొకమనిషి నియంత్రణకు అప్పగించి అతడి చేతిలో విధేయమైన సాధనంగా ఉండాలని దేవుడు ఉద్దేశించలేదు. ఏ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మరో వ్యక్తి వ్యక్తిత్వంతో మమేకం చెయ్యకూడదు. స్వస్థతకు మూలంగా అతడు ఏ మానవుడి మీద ఆధార పడకూడదు. దేవుని మీద ఆధారపడాలి. తనకు దేవుడిచ్చిన పురుషత్వపు గౌరవంతో అతడు ఏ మానవుడి ప్రజ్ఞకూగాక దేవుని నియంత్రణకు లోబడి ఉండాలి. MHTel 203.2

మనుషులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మానవులతో తన వ్యవహరణలన్నిటిలో వ్యక్తిత బాధ్యత సూత్రాన్ని ఆయన గుర్తిస్తున్నాడు. వ్యక్తిగతంగా ఆధారపడాలన్న భావనను ప్రోత్సహంచటానికి, వ్యక్తిగత మార్గదర్శకత్వం అవసరాన్ని నొక్కి చెప్పటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. మానవులు దేవుని పోలికకు మార్పు చెందేందుకు మానవులకు దైవిక సహవాసంలోకి తీసుకురావటానికి ఆయన వాంఛిస్తున్నాడు. ఈ ఉద్దేశాన్ని నిరర్థకం చెయ్యటానకి సాతాను కృషి చేస్తున్నాడు. మనుషులపై ఆధారపడటానికి అతడు ప్రోత్సహిస్తున్నాడు. మనసులు దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు శోధకుడు వాటిని తన పాలన కిందకి తెచ్చుకుంటాడు. అతడు మానవుల్ని నియంత్రించగలడు. MHTel 203.3

తనను తాను ప్రధానమైన పనివాడిగా చెప్పుకునేందుకు, దేవుని తత్వజ్ఞానం స్థానంలో మానవుడి తత్వాన్ని పెట్టటానికి, మనసు మనసును నియంత్రించటమన్న సిద్ధాంతాన్ని సాతానే ప్రవేశ పెట్టాడు. క్రైస్తవులమని చెప్పుకునేవారి మధ్య ఆమోదం పొందుతున్న తప్పులన్నిటిలోనూ మిక్కిలి భయంకర మోసం దేవుని నుంచి తప్పకుండా వేరు చేసేది ఇది. నిరప యోగ్యంగా కనిపించినా, రోగులపై ఉపయోగిస్తే అది వారి పునరుద్ధరణకు కాదు వారి నాశనానికి దారి తీస్తుంది. సాతాను ప్రవేశించటానికి అది ఒక తలుపు తెరుస్తుంది. నియంత్రించటానికి అప్పగించే మనసును దాన్ని నియంత్రించే మనసును స్వాధీనపర్చుకోవటానికి అతడు దానిగుండా ప్రవేశిస్తాడు. MHTel 204.1

దుర్బుద్ధిగల పురుషులకు, స్త్రీలకు ఈ రకంగా ఇచ్చే అధికారం భయం కరమైనది. ఇతరుల బలహీనతలు తప్పిదాలను ఆసరాగా చేసుకొని లబ్దిపొంది బతకాలనుకునేవారికి ఇది ఎలాంటి తరుణాల్ని ఇస్తుంది! బల హిన లేక వ్యాధిగ్రస్త మనసుల నియంత్రణను తమ మోహ వాంఛలను తృప్తిపర్చుకోవటానికి లేక లాభపేక్షను తృప్తిపర్చుకోవటానికి ఎంత మంది దీన్ని ఓ ఆధనంగా వాడుకుంటారు! MHTel 204.2

మనుషులు మనుషుల్ని నియంత్రించటానికన్నా మెరుగైనది ఒకటి ఉంది. ప్రజలు మానవుల పై కాక దేవుని పై తమ దృష్టిని ఉంచటానికి వారిని వైద్యులు చైతన్యపర్చాలి. ఆత్మ శరీరాల స్వస్థతకు మానవులపై ఆధారపడటానికి బదులు తమ వద్దకు వచ్చే వారిని సంపూర్తిగా రక్షించగల రక్షని పై ఆధారపడటానికి వైద్యులు వారిని నడిపించాలి. మానవుడి మనసును సృష్టించిన ఆయన మనసుకు ఏమి అవసరమో ఎరుగును. దేవుడు మాత్రమే స్వస్థత కూర్చగలడు. ఎవరి మనసులు శరీరాలు రోగగ్రస్తమయ్యాయో వారు క్రీస్తులో పునరుద్ధరించే ప్రభువును చూడాలి. “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు” యెహాను 14:19 రోగగ్రస్తులకు మనం సమర్పించాల్సిన జీవితం ఇదే. MHTel 204.3

పునరుద్ధరించేవానిగా క్రీస్తులో వారికి ” యెహోవా నా ఆశ్రయము. నా కేడెము నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము హర్సించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను”. కీర్తనలు 28:7 MHTel 205.1

విశ్వాసం ఉంటే, ఆరోగ్య చట్టాలకు విధేయులై ఆయనకు భయపడుతూ పరిశుద్దంగా జీవించటానికి ప్రయత్నించటం ద్వారా ఆయనతో సహకరిస్తే ఆయన తన జీవితాన్ని వారికి ఇస్తాడని చెప్పాలి. క్రీస్తును వారికి ఈ రీతిగా మనం సమర్పించేటప్పుడు,వారికి విలువైన ఓ శక్తిని బలాన్ని అందిస్తున్నాం. శరీరాన్ని మనసుకు స్వస్థపర్చే వాస్తవిక విజ్ఞాన శాస్త్రం ఇదే. MHTel 205.2