Go to full page →

మారా, ఏలీము MHTel 220

నేడు ఏలీము, దాని ఖర్చూర చెట్లు బావులు
ఎడారిలో అలుపు తీర్చి హాయినిచ్చే నీడ
నిన్న మారా...అంతా బండలు ఇసుక
నీడ లేని ఏకాంతం, విషాదం అయినా
అదే ఎడారి ఆ రెంటిని కలుపుతుంది
ఆ నేలపై వడగాలులు తచ్చాడతున్నాయి
అదే లోయ రెంటికి నీడనిస్తుంది
అనే పర్వతాలు రెంటి చుట్టూ మూగి న్నాయి
ఇక్కడ లోకంలో మనకూ అలాగే
ఇంతవరకు అలాగే ఉన్నట్లు నాకు గుర్తు
చేదు తీపి దు:ఖం సంతోషం
పక్క పక్కనే పండుకుంటాయి. మధ్య ఉంది ఒక రోజే
మన చేదును తీపిగా మార్చుతాడు దేవుడు
కొన్నిసార్లు ముచ్చటైన నీటి బుగ్గలిస్తాడు
తన మేహ స్థంభపునీడనిస్తాడు కొన్నిసార్లు శుభప్రదమైన చెట్టు నీడకు మనల్ని తెస్తాడు
ఎమౌతుంది? అట్టే కాలం పట్టదు
మారా ఏలీమూ రెండూ గతించిపోతాయి
మన ఎడారి ఆవులు ఖర్జూర చెట్లూ త్వరలో పోతాయి
తుదకు మనం “దేవుని పట్టణం ” చేరుకుంటాం
ఆహా! ఆ ఆనంద దేశం ఈ ఒంటరి కొండలకు పైగా ఉంది
నిత్యం ప్రవహించే ఏరులు పొంగి పొరలే ఆనందం
ఆహా! ఈ ఆకాశాల పైన పరిశద్దు పరదైసు!
అక్కడ ముగింపు పలుకుతాం మన ఎడారి సంచారాలకు MHTel 220.2

హెరేషియన్ బోనార్