Go to full page →

రక్తప్రసరణ MHTel 229

మంచి ఆరోగ్యానికి మంచి రక్తం అవసరం. రక్తమే జీవితానికి విద్యుఛ్చక్తి. అది వ్యర్ధాన్ని మరమ్మత్తు చేసి శరీరానికి పౌష్టికత నిస్తుంది. సరియైన ఆహార పదార్ధాల్ని సరఫరా చేసినప్పుడు స్వచ్చమైన గాలిని సంబంద వల్ల శుద్ధతను శక్తిని పొందినప్పుడు, అది జీవాన్ని శక్తిని శరీరంలోని ప్రతీ భాగానికి తీసుకువెళ్తుంది. ప్రసరణ ఎంత పరిపూర్ణంగా ఉంటే ఈ పని అంత మెరుగుగా సాగుతుంది. MHTel 229.2

గుండె కొట్టుకునే ప్రతీసారి రక్తం తవ్రగా సులువుగా శరీర భాగలన్నిటికి బయలుదేరాలి. బిగువాటి బట్టలు ధరించటం వల్ల గాని లేక శరీరం చివరి భాగలాకు చాలినంత వస్త్ర పరీక్షణ లేనందు వల్ల గాని రక్తప్రసరణకు ఆటంకం కలుగకూడదు. ప్రసరణ ఏది ఆటంకపర్చుతుందో అది ప్రధాన అవయవాలకు రక్తాన్ని తిరగి పంపివేస్తుంది. ఇది రక్తాన్ని ఒకేచోట పోగుపడేటట్లు చేస్తుంది. ఫలితంగా తలనొప్పి, దగ్గు, గుండె వేగంగా కట్టుకోవటం లేక ఆజీర్తి సంభవిస్తాయి. MHTel 229.3