Go to full page →

ఆహారం MHTel 237

పవిత్రం, అపవిత్రం అన్న బేధాన్ని ఆహార విషయలన్నిటిలోనూ పాటించం జరిగింది. MHTel 237.3

“జనములోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్రత పక్షులకును విభజన చేయవలెను. పవిత్రమైనదని నేను మీకు వేరు చేసిన యే జంతువులనే గాని యే పక్షివలననే గాని, నేల మీద ప్రాకు దేనివలననేగాని మిమ్మును మీరు అపవిత్రపర్చుకొనకూడదు.” లేవీకాండము 20:24,25. MHTel 237.4

తమ చుట్టూ ఉన్న అన్యులు స్వేచ్చగా తింటున్న అనేకమైనాహార పదార్ధాలు ఇశ్రాయేలీయులు తినకూడదని దేవుడు నిషేంధించాడు. ఆవిభజన అకారణంగా చేసింది కాదు. దేవుడు నిషేధించినవి అనారోగ్యక రమైనవి. వాటిని అపవిత్రత పదార్థాలుగా నిర్దేసించటం హానికరమైన ఆహారపదార్థాల వినియోగం. అపవిత్రపర్చుతుందన్న పాఠం బోధించింది. శరారాన్ని పాడు చేసేది ఆత్మనూ పాడు చేస్తుంది. దాని వినియోగదారుణ్ణి దేవునితో సాంగత్యానికి అయోగ్యుణ్ణి ఉన్నత పరిశుద్ధ సేవకు అనర్హుణ్ణి చేస్తుంది. MHTel 237.5

ఆరణ్యంలో ప్రారంభమైన క్రమశిక్షణ సరియైన అలవాట్లు ఏర్పర్చుకోవటానికి అనుకూల పరిస్థితుల్లో వాగ్దత్త దేశంలో కొనసాగింది. ప్రజలు నగరాల్లో గుమిగూడలేదు. ప్రతీ కుటుంబానికి చిరాస్థి అయిన భూమి ఉన్నది. అది అందరికీ ఆరోగ్యదాయకమైన, స్వాభావికమైన దీవెనలను వక్రమార్గాలు లేని జీవితాన్ని ఇచ్చింది. MHTel 238.1

ఇశ్రాయేలీయులు వెళ్ళగొట్ని కనానీయుల విచ్చలవిడి వర్తనను గురించి ప్రభువంటున్నాడు. MHTel 238.2

“నేను మీ యెదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనుల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియనల్నియు చేరిపిరిగనుక నేను వారి యందు అసహ్యపడితిని”. 23వ. “దానివల నీవు శాపగ్రస్తుడవు కాకు ండునట్లు నీవు హేయమైనదాని నీ ఇంటికి తేకూడదు.” ద్వితీయో 7:26 MHTel 238.3

తమ రోజువారీ జీవిత విషయాలన్నటిలో ఇశ్రాయేలీయులకు పరిశు ద్దాత్మ నిర్దేశించిన పాఠం బోధించటం జరిగింది. MHTel 238.4

“మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా! ఎవడైనను దేవుని ఆలయమునకు హాని చేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు”. MHTel 238.5