Go to full page →

24—ఆహారంగా మాంసం MHTel 266

ఆదిలో మానవుడికి దేవుడు నియమించిన ఆహారంలో మాంసం లేదు. జలప్రళయం వచ్చి పచ్చగా ఉన్న సమస్తాన్ని నాశనం చేసిన తరువాత వరకు మాంసం తినటానికి మానవుడికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. MHTel 266.1

ఏదెనులో మానవుడి ఆహారం ఎంపిక చెయ్యటంలో ఉత్తమ ఆహారం ఏమిటో ప్రభువు చూపించాడు. ఇశ్రాయేలీయులకు చేసిన ఎంపికలోను అదే పాఠాన్ని బోధించాడు. వారు తన ఆస్తిగా ఉండే నిమత్తం వారిని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చి వారి శిక్షణను చేపట్టాడు. వారి ద్వారా లోకాన్ని దీవించి లోకానికి బోధించాలని ఆయన వాంఛించాడు. ఈ ఉ దేశానికి అనుకూలంగా వారికి ఆహారాన్నిచ్చాడు. మాంసం కాదు “ఆకాశము నుండి ... ఆహారము” అయిన మన్నాను. ఐగుప్త మాంసపు కుండల కోసం వారి అసంతృప్తి గొణుగుడు వల్లనే దేవుడు వారికి మాంసాన్నిచ్చాడు. ఇది కూడా స్వల్ప కాలానికి మాత్రమే. దాని మాంసాన్నిచ్చాడు దాని వినియోగం వేలాది మందికి వ్యాధి మరణాల్ని తెచ్చింది. అయినా మాంసంలేని ఆహారాన్ని వారు హృదయపూర్వకంగా అంగీకరించలేదు. అది అంసతృప్తికి గొణుగుడుకు .. అంతర్గతంగానో, హిర్గతంతగానో... కారణమౌతూనే ఉంది. MHTel 266.2

దాన్ని స్థిరపర్చలేదు. కనానులో స్థిరపడిన తర్వాత ఇశ్రాయేలీయులు మాంసాన్ని ఉ పయోగించటానికి దేవుడు అనుమతించాడు కాని దుష్పలితాల్ని తగ్గించటానికి ఉద్దేశించిన కొన్ని అంక్షలతో, పంది మాంసం నిషిద్ధం. అలాగే అపవిత్రమైనవిగా ప్రకటించబడ్డ జంతువులు, పిట్టలు, చేపల మాంసం నిషిద్ధం. అనుమతించబడ్డవాటి మాంసంలోని కొవ్వు, రక్తం నిషిద్ధ పదార్ధాలు. MHTel 266.3

ఆరోగ్యంగా ఉన్న జంతువులు మాంసం మాత్రమే ఆహారంగా ఉ పయోగించటానికి యోగ్యమైంది. చీల్చబడ్డ ప్రాణి, చనిపోయిన ప్రాణి,లేక రక్తం ఏ జంతువు నుంచి జాగ్రత్తగా ఓడ్చి వేయబడదో దాని మాంసం ఆహారంగా వాడటం నిషిద్ధం, తమ ఆహారం విషయంలో దేవుడు నియమించిన ప్రణాళిక నుండి తొలగిపోయినందుకు ఇశ్రాయేలీయులు చాలా పొగొట్టుకున్నారు. మాంసాహారం కోరారు, దాని పర్యవసానాల్ని అనుభవించారు. వారు దేవుడు నిర్దేశించిన ప్రవర్తన ఆదర్శాన్ని చేరలేకపోయారు లేక ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయారు. “వారు కోరినది ఆయన వారికిచ్చెను. అయినను వారి ప్రాణమునకు ఆయన క్షీణత కలుగజేసెను”. కీర్తనలు 106:15 వారు ఐహిక విషయాలను పారలౌకిక విషయాలకు మిన్నగా భావించారు. తమకు ఆయన ఉ ద్దేశించిన పవిత్ర ప్రాధాన్యాన్ని వారు సాధించలేకపోయారు. MHTel 266.4