సారా ఆసక్తి లోకంలో ఓ శక్తిగా పరిణమించిది. దాని పక్క ద్రవ్యం అలవాటు. వాంఛ సంయుక్త శక్తి ఉన్నది. సంఘములో సైతం దానికి బల ముందు. సారా వ్యాపారంలో ప్రత్యేక్షంగానో పరక్షంగానో డబ్బు సంపాదించి నవారు “మంచి, నమ్మకమైన” సంఘ సభ్యులు. వారిలో చాలామంది ప్రజా శ్రేయస్సుకి ఉదారంగా విరాళాలిస్తారు. వారి విరాళాలు సంఘ పథకాలకు బోధకుల పోషణకు తోడ్పాటునిస్తాయి. తమ ఆర్ధిక శక్తి వల్ల వారిని అందరు పరిగణిస్తారు. అలాంటి సభ్యుల్ని అంగీకరించే సంఘాలు వాస్తవంలో సారా వ్యాపారాన్ని పోషిస్తున్నారు. బోధకుడు సత్యానికి నిలబడే ధైర్యం తెచ్చుకోవటం తరుచు జరగుతుంటుంది. సారా వ్యాపారి పని గూర్చి దేవుడు ఏమిచెప్పాడో ప్రజలకు బోధించడి. స్పష్టంగా మాట్లాడటం మంటే సంఘానికి బాధ కలిగించటం, తన జీతాన్ని పొట్టుకోవటం. MHTel 291.1
అయితే,సంఘ న్యాయస్థానానికి పైగా దేవుని న్యాయస్థానం ఉంది . మొదటి నరహంతకుడితో ‘నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర పెట్టుచున్నది” (ఆదికాండము 4:10) అని ప్రకటించిన ఆయన తన బలిపీఠానికి సారా వ్యాపార ఈవులను అంగీక రించడు. ఈ అపరాధాన్ని ఉదారత పేరిట కప్పిపుచ్చుటానికి ప్రయత్నించే వారి మీద ఆయన కోపం రంగులు కొంటున్నది. వారి ద్రవ్యం రక్తపు మరలకతలో నిండి ఉన్నది. దాని పై శాపం ఉంది. MHTel 291.2
“చావునకై పట్టుబడిన వారిని నీవు తప్పించుము. నాశనమందు పడటకు జోగుచున్నవారిని నీవు రక్షింపవా? ఈ సగంగతి మాకు తెలియదని నీవనుకొనిన యెడల హృయదములను శోధించువాడు నీ మాటను గ్రహించునుగదా, నిన్ను కనిపెట్టువాడు దానినెరుగునుగదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతికారము చేయును గదా”? సామెతలు 24:11,12. “యెహోవా సెలవిచ్చు మాట ఇదే - - విస్తారమైన మీ బలులు నాకేల?....నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు ?...... మీరు మీ చేతులు చాపుచున్నప్పుడు మిమ్మును చూడక నాకన్నులు కప్పుకొందును మీ చేతులు రక్తముతో నిండియున్నవి”. యెషయా 1:11,12 MHTel 291.3
తాగుబోతు మెరుగైన పనులు చెయ్యగలడు. దేవుని ఘనపర్చటానికి లోకాన్ని దీవెనగా ఉండటానికి ఆయన అతడికి వరాలనిచ్చాడు. కాని తన తోటి మనసులు తన ఆత్మకు ఓ ఉచ్చుపన్ని అతడి దౌర్భగ్యం ద్వారా తమను తాము వృద్ధపర్చుకున్నారు. తాము దోచుక్నున్న అభాగ్యుడు పేదరికంలోను దౌర్భాగ్యంలోను జీవిస్తుంటే వారు సకల సౌకర్యాలు కలిగి జీవిస్తున్నారు. తాగుబోతును తన నాశనానినికి నడిపించింనదుకు అతణ్ణి దేవుడు శిక్షిస్తాడు. పరలోకమందుండి పరిపాలన చేసే ప్రభువు తాగుబోతు తనం మొదటి కారణాన్ని లేక దాని చివరి ఫలితాన్ని విస్మరించడు. పిచ్చులకను గూర్చి శ్రద్ధ వహించేవాడు పొలంలోని గడ్డిని అలంకరించే దైన ప్రభువు తన స్వరూపంలో సృష్టి యిన తన రక్తంతో కొన్న వారిని దాటి పోడు, వారి మొరను వినకుండా వారిని దాటిపోడు. నేరాన్ని దు:ఖాన్ని శాశ్వతం చేసే ఈ దుర్మార్గతను దేవుడు చూస్తున్నాడు. MHTel 292.1
మానవ ఆత్మను భ్రష్టపర్చటం ద్వారా భాగ్యాన్ని సంపాదించే వ్యక్తి లోకానికి సంఘానికి ఇష్టుడు కావచ్చు. అడుగడున మనుషుల్ని సిగ్గు భ్రష్టత మార్గంలో నడిపించే మనుషుల్ని లోకం సంఘం అభినందివచ్చు. దానతంటిని దేవుడు గుర్తించి న్యాయమైన తీర్పు వెలిబుచ్చుతాడు. సారా వ్యాపారిని లోకం మంచి వ్యాపారిగా శ్లాఘించవచ్చు. కాని ప్రభువు “అతడికి శ్రమ” అంటున్నాడు. సారా వ్యాపారం ద్వారా నిరాశను, దు:ఖాన్ని, బాధను కలిగించిన నేరాన్ని దేవుడు అతడి మీద మోపుతాడు. తిండి బట్ట నీడ లేక నిరీక్షణను సంతోషాన్ని కోల్పోయిన తల్లులు పిల్లలనుభవిస్తున్న లేమి నిమిత్తం దు:ఖం నిమిత్తం వారు దేవునికి జవాబు చెప్పాలి. నిత్య జీవానికి సిద్ధపడకుండానే నిత్యత్వంలోకి తాను పంపిన ఆత్మల నిమిత్తం అతడు జవాబుదారి సారా వ్యాపారికి తన వ్యాపారంలో మద్దుతునిచ్చేయవారు అతడి నేరంలో భాగస్వాములు, వారినుద్దేశించి “మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి” అంటాడు దేవుడు. MHTel 292.2