Go to full page →

మద్యపాన నిషేధం MHTel 295

మద్యపానాన్ని అలవాటు చేసుకున్న వ్యక్తి నిరాశాపూర్వక పరిస్థితిలో ఉంటాడు. అతడి మెదడు వ్యాధిగ్రస్తమౌతుంది. చిత్తశక్తి బలహీనమౌతుంది. అతడిలో ఏమైన శక్తి ఇంకా ఉంటే అది అతడి ఆహారవాంఛను అదుపులో ఉంచలేదు. అతడితో సహేతుకంగా మాట్లాడలేం. హానికరమైన పదార్ధాన్ని విడిచి పెట్టటానికి అతణ్ణి ఒప్పించలేం. దుష్టత దుర్మార్గత గుహల్లోకి ఆకర్షితుడైన వ్యక్తి. తాగుడును విడిచి పెట్టటానికి తీర్మానించుకున్న వ్యక్తి మద్యం పాత్రను మళ్ళీ పట్టుకోవటానికి నడిపించబడతాడు. మత్తెక్కించే ఆ పానం మొదటి రుచితో ప్రతీ మంచి తీర్మానం శక్తిహీనమౌతుంది. చిత్త శక్తిలో మిగిలి ఉన్న ప్రతీ ఛిద్రం నాశనమౌతుంది. పిచ్చెక్కించే ఆ పానీయం ఒక్క గుక్క రుచి చాలు. దాని పర్వయసానాల్ని గురించినా లోచన మాయ మౌతుంది. హృదయభారంతో ఉన్న భార్యను మర్చిపోతాడు. పిల్లలు ఆకలిగా ఉన్నారని బట్టలు లేకుండా ఉన్నారని జాలి గుండె లేని ఆ తండ్రి ఆలోచించడు. సార వ్యాపారాన్ని చట్టబద్దం చెయ్యటం ద్వారా ఆత్మ పతనమౌవ్వటానికి అనుమతించి దుష్టత్వంతో దుర్మార్గతలోకాన్ని నింపుతున్న ఆ వ్యాపారాన్ని ఆపటానికి చట్టం నిరాకరిస్తుంది. MHTel 295.1

ఇది నిత్యం కొనసాగాలా? శోధనకు తలుపు బార్లా తెరిచి ఉండగా ఆత్మలు ఎప్పుడూ విజయానికి పోరాటరా సాగించాలా? అమితానుభవ శాపం నాగరిక ప్రపంపంచము పై ఓ మహమ్మారి ఫలితంలా నిరంతరం నిలవ వలసినదేనా? అది ప్రతీ సంవత్సరము కబళించే అగ్నిలా వేలాది ఆనంత గృహాలన్నిమింగేయ్య వలసిందేనా? తీరానికి దగ్గరలోనే అందరు చూస్తుండానే ఓ ఓడ పగిలినప్పుడు ప్రజలు చూస్తు ఉండరు. మనుషులను నీటి సమాధి నుండి కాపాడటానికి ప్రయత్నించటంలో వారు ప్రాణాలు పొగొట్టుకోవటానికి సైతం సిద్ధమౌతారు. తాగుబోతు విధి నుండి మనుషుల్ని రక్షించటానికి ఉన్న అవసరం ఇంకా ఎంత గొప్పది! సారా అమ్మేవాడి వ్యాపారం వల్ల ప్రమాదం సంభవిచేంది తాగుబో తుకు అతడి కుటుంబానికే కాదు లేక అతడి వ్యాపారం సమాజం మీద మో పేది పన్నుల భారం ఒక్కటే ప్రధానమైన కీడు కాదు. MHTel 295.2

మనందరం మానవ సాలిగూడులో వేయబడి ఓ భాగమై ఉన్నాం. విశాలమైన మానవ సహోదరత్వంలో ఏ భాగానికైనా కీడు సంభవిస్తే అది మనందరికి ప్రమాదమే. లాభాపేక్షవల్లో సుఖజీవితాన్ని కోరో సారా వ్యాపారాన్ని నియంత్రించటానికి సమ్మతించని అనేకులు ఆ వ్యాపారం వల్ల కీడులో తమకూ పాలున్నదని ఆలస్యంగా గుర్తిస్తారు. తమ సొంత పిల్లలే దానికి గురి అయ్యిపతనమవ్వటం వారు చూస్తారు., చట్టరాహిత్యం కట్టలు తెంచుకుం టుంది. ఆస్తులకు ప్రమాదం ఏర్పడుతుంది. ప్రాణానికి భద్రత కరవుతుంది. సముద్రం పైన భూమి పైనా ప్రమాదాలు ఇబ్బది ముబ్బది అవుతాయి. మురికవాడల్లోను అభాగ్యుల నివాసాల్లోను వర్ధిల్లే వ్యాధులు గొప్పవారి విలాస భవనాలక వ్యాపిస్తాయి. కన్న ప్లిలు పెంచి పోషించిన వ్యబిచారం నేరం దౌష్ట్యాలు దురాగతాలు నాగరికత సంస్కారం గల గృహాల కొడుకులు కూతుళ్ళకు అంటుకుంటుంది. MHTel 296.1

సారా వ్యాపారం వల్ల దెబ్బతినని ఆసక్తులు లేని వ్యక్తి ఎవరూ ఉండరు. తన సొంత క్షేమం దృష్ట్యా దాన్ని నాశనం చెయ్యటానికి పూనుకోకూడని వ్యక్తి ఎవరూ ఉండరు. MHTel 296.2

లౌకికాసక్తులు గల స్థానాలన్నిటిలోను శాసన సభలు న్యాస్థానాల్లోని వ్యక్తులు శాపగ్రస్తుమైన అమితానుభవానికి దూరంగా ఉండాలి. గవర్నర్లు, సెనేటర్లు, ప్రతినిధులు, న్యాయమూర్తలు, ఓ దేశ చట్టాలను రూపొందించి అమలుపర్చే వ్యక్తులు. సాటి మనుషులు ప్రణాలను, ప్రతిష్టతను ఆస్తులను తమ చేతుల్లో ఉంచుకునే వ్యక్తులు మితానుభవాన్ని నిష్కర్షగా పాటించే మనుషులై ఉండాలి. అప్పుడే వారి మనసులు తప్పొప్పల మధ్య తేడాను గుర్తించటానికి నిర్మలంగా ఉంటాయి. అప్పుడు మాత్రమే వారు నియమం విసయంలో వివేకం కలిగి వ్యవహరించగలుగుతారు. అయితే రికార్డు ఎలా ఉన్నది? వీరిలో ఎంతమంది మనసులు మసకబారాయి? మద్యపానం వల్ల న్యాయం అన్యాయం మద్య వారి మనసులు ఎంత తికమకపడుతన్నాయి! వారు ఎన్ని క్రూర చట్టాలుచేసారు ! మద్యం తాగే శాసనసభ్యులు, సాక్షులు న్యాయవాదులు, ఆన్యయమూర్తుల అన్యాయం వల్ల ఎంతమంది నిరపరాధుల్ని నేరస్థులుగా తీర్పు తీర్చి ఊరి కంబానికి పంపారు ! “వైన్ సేవించే ఘనులు” “మద్యం కలిపే బలశాలురు”. “కీడును మేలని, మేలును కీడని పిలిచేవారు”. “లంచానికి దుష్టుణ్ణి సమర్ధించేవారు, నీతిమంతుణ్ణించి నీతిని తీసివేసేవారు” చాలమంది అట్టివారి గురించి దేవుడంటున్నాడు. MHTel 296.3

“వారికి శ్రమ...... సైన్యములకధిపతియుగ యెహోవా యొక్క ధర్మ
శాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు
ఇశ్రాయేలు యొక్క పరిశశుద్ధ దేవుని వాక్కును
తృణీకరించుదురు...
కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయునుట్ల
ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళి
పోవును వారి పువ్వు ధూళివలె పైకి ఎగిరిపోవును” MHTel 297.1

యెషయా 5:22-24

ప్రజలను అమితానుభవంలోకి కీడుకు మేల్కొల్పటానికి సాధ్యమైన ప్రతీ ప్రయతం్న చెయ్యాల్సిందిగా దేవుని ఘనత. జాతి స్థిరత,సమాజ, గృహ వ్యక్తి సంక్షేమం డిమాండు చేస్తున్నాయి.మనం ఇప్పుడు చూడని దీని భయంకర ఫలితాన్ని త్వరలో చూస్తాం నాశనకరమైన ఈ పనిని విలువరించటానిక ఎవరు పట్టుదలతో కృషి చేస్తారు; ఇంకా ఈ పోటీ ప్రారంభం కాలేదు మంచి మనుషుల్ని ఉన్మాదుల్ని చేస్తున్న సారా అమ్మకాన్ని ఆపు చెయ్యటానికి ఓ సైన్యంగా ఏర్పడదాం. సారా వ్యాపారం నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని స్పష్టం చేసి, దాని నిషేధాన్ని డిమాండు చేస్తూ ప్రజాభిప్రాయాన్ని సృష్టిద్దాం. తాగుడు పిచ్చిగల మనుషులు తమ చెర నుండి విడిపించకోవటానికి వారికి ఓ అవకాశం ఇవ్వాలి. ఈ చెడు వ్యాపారానికి మంగళం పాడాల్సిందిగా చట్ట సభల సభ్యులను కోరుతూ జాతి గళమెత్తాలి. MHTel 297.2

“చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము
నాశనమందు పడుటకు జోగుచున్నవారిన నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనిన యెడల
హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా;
నిన్ను కని పెట్టువాడు దానినెరుగునుగదా?
“ఆయన నీ మీద అధిపతులుగా నియమించినునప్పుడు
నీవేమి చెప్పెదవు”?

సామెతలు 24:11, 12 యిర్మీయా 13:21

*****