Go to full page →

జీవితంలోని అవకాశాలు MHTel 304

ఇక్కడ మన జీవిత కాలం తక్కువ. ఈలోకంలో మనం ఒక్క సారి మాత్రమే ఉంటాం. కనుక దాని నుంచి పొందగలిగినంత మేలును పొందుదాం. మనం చెయ్యటానికి పిలుపు పొందిన పనికి భాగ్యం. గాని సాంఘిక సదాగాని గొప్ప ప్రతిభగాని అవసరంలేదు. దానికి దయగల ఆత్మ త్యాగపూరిత స్వభావం. ఆచంచల సకల్పం అవసరం. దీపం ఎంత చిన్నదైనా దాన్ని నిలకడగా ఉంచితే అది అనేక ఇతర దీపాల్ని వెలిగించే సాధనమౌతుంది. మన ప్రభావ పరిధి చిన్నది మన సామర్ధ్యం స్వల్పం మన తరుణాలు తక్కువ సాధనాలు పరిమితం కావచ్చు. అయినా మన సొంత గృహాల తరుణాలను నమ్మకంగా వినియోగించుకోవటం ద్వారా మనకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. మనం మన హృదయాల్ని గృహాల్ని దైవిక జీవిత నియామాలకు తెరిస్తే జీవాన్నిచే కాలువలవుతాం. ఇప్పుడు ఎడారి, మరణం మాత్రమే ఉన్న చోటికి జీవం సొగసు, ఫలాలు తెస్తూ మన గృహాల నుంచి స్వస్తత కూర్చే కాలువలు ప్రవహిస్తాయి. MHTel 304.1

*****