Go to full page →

మనోహరమైన పరిసరాలు MHTel 317

దేవుడు అందాన్ని ప్రేమిస్తాడు. ఆయన భూమిని ఆకాశాన్ని అందంతో కప్పాడు. తన బిడ్డలు ఉత్సహించటాన్ని ఆనందంతో చూస్తు ఓ తండ్రి అనందించినట్లు ఆనందిస్తాడు. మన గృహాల చుట్టు మనం స్వాభావిక విషయాల సౌందర్యంతో అలంకరించుకోవాలని ఆయన ఆకాంస్తున్నాడు. MHTel 317.1

దాదాపు పల్లె ప్రాంతాల్లో నివసించేవారందంరు వారెంతో పేదవారైన తమ గృహాల చుట్టు కొంచెం పచ్చగడ్డి లాన్, నీడనిచ్చే కొన్ని చెట్లు, పూల మొక్కలు లేక సువాసన వెదజల్లే పువ్వులు ఉంచుకోవచ్చు. కృత్రిమమైన ఏ అంకరణలకన్నా గృహంలోని తమ ఆనందానికి వారు ఎక్కువ పాటుపడాలి. అవి గృహ జీవితంలోకి ప్రకృతి పట్ల సున్నితమైన ప్రేమను తెస్తాయి. ప్రకృతి పట్ల ప్రేమను బలీయం చేసి కుటుంబ సభ్యుల్ని మరింత దగ్గరగా తెస్తాయి. కుటంబాన్ని దేవునికి మరింత దగ్గర చేస్తాయి. MHTel 317.2

*****