Go to full page →

శిష్యులకు వెల్లడి MHTel 362

తన సిలువ మరణానాకి ముందు రాత్రి మేడ పై గదిలో క్రీస్తు పలికిన మాటల్ని అధ్యయనం చేద్దాం. ఆయనకు తీర్పు తీర్చే గడియ సమీస్తున్నది. తీవ్ర శోధనకు శ్రమలకు గురికానున్న తన శిష్యుల్ని ఓదార్చటానికి ఆయన ప్రయత్నించాడు. MHTel 362.4

“మీ హృదయములను కలవరపడ నియ్యకుడి, దేవుని యందు విశ్వ్వసముంచుచున్నారు. నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి యింట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపర్చవెళ్ళుచున్నాను..... . MHTel 362.5

“అందుకు తోమా... ప్రభువా, యెక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడగగా యేసు,., నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానరే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారు.... MHTel 362.6

“అప్పుడు ఫిలిప్పు.. ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము. మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు... ఫిలిప్పు నేనింతకాలము మీయొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు? తండ్రియందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా?నేను మీతో చెప్పుచున్నమాటలు నా అంతట నేనే చెప్పుటలేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు”. యోహాను 14:1-10 MHTel 363.1

దేవునితో తన సంబంధాన్ని గురించి క్రీస్తు చెప్పిన మాటలు శిష్యులు ఇంకా అర్ధం చేసుకోలేదు. ఆయన బోధనలో చాలా మేరకు వారికి ఇంకా బోధపడలేదు. వారు దేవుని గురించి స్పష్టమైన మరింత ఖచ్చితమైన జ్ఞానం కలిగి ఉండాలని క్రీస్తు ఆకాంక్షించాడు. MHTel 363.2

“ఈ సంగతులు గుఢార్ధముగా మీతో చెప్పితిని అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది”. యోహాను 16:25 MHTel 363.3

క్రీస్తు తమకు గూడార్థంగా చెప్పిన సత్యాలను శిష్యులు పెంతెకోస్తు దినాన తమపై పరిశుద్దాత్మ కుమ్మరింపబడ్డప్పుడు మరింత సంపర్ణంగా అవగాహన చేసుకున్నారు. తమకు మర్మంగా కనిపించన బోధలో చాలా మట్టుకు స్పష్టమయ్యింది. అప్పుడు సయితం శిష్యులు క్రీస్తు వాగ్దాన నెరవేర్పును పూర్తిగా పొందలేక పోయారు. దేవుని గూర్చిన జ్ఞానాన్ని తాము తాళగిలిగినంత మేరకు పొందుతారు. కాని క్రీస్తు తమకు తండ్రిని స్పష్టంగా కనపర్చుతాడన్న వాగ్దానం నెరవేర్పు ఇంకా జరగాల్సి ఉంది. అలాగే నేడు కూడా. దేవుని గూర్చిన మన జ్ఞానం పాక్షికం, అసంపూర్ణం, మహా సంఘర్షణ అంతమొందినప్పుడు మానవుడు క్రీస్తు యేసు పాపలోకంలో తనను గూర్చి యధార్ధ సాక్ష్యం ఇచ్చి తన నమ్మకమైన సేవలను తన తండ్రి ముందు అంగీకరించేటప్పుడు ప్రస్తుతం తమకు మర్మాలుగా ఏవైతే ఉన్నవో వాటిని స్పష్టంగా అప్పుడు అవగాహన చేసుకుంటారు. MHTel 363.4

మహిమపర్చబడ్డ తన మానవత్వాన్ని క్రీస్తు తనతో పాటు పరలోక ప్రాంగణములోకి తీసుకువెళ్లాడు. తనతో నిత్యం నివసించటానికి దేవుడు చివరికి తనవారిగా స్వీకరించేందుకు క్రీస్తు తనను ఎవరు అంగీకరిస్తారో వారికి దేవుని కుమారులవ్వటానికి శక్తినిస్తాడు. ఈ జీవితంలో వారు దేవునికి నమ్మకంగా జీవిస్తే చివరికి “ఆయన ముఖ దర్శనము చేసికొందురు. ఆయన నామము వారి నొసళ్ళయందుండును.” ప్రకటన 22:4 దేవుని చూడటంకన్నా పరలోకంలో గొప్ప ఆనందం ఉన్నదా? క్రీస్తు కృప ద్వారా రక్షణ పొందిన పాపికి దేవున్ని ముఖాముఖి చూసి ఆయన్ని తండ్రిగా ఎరగటం కన్నా ఎక్కువ ఆనందాన్నిచ్చేది ఇంకేదైనా ఉన్నదా? దేవునికి క్రీస్తుకు మధ్య ఉన్న సంబంధం గురించి లేఖనాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. వారి ఒక్కొక్కరి వ్యక్తిత్వాన్ని ప్రత్యేకతను స్పష్టంగా మన దృష్టికి తెస్తున్నాయి. MHTel 364.1

“పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను... ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునై యుండి, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవ దూతలకంటె ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చునియుండెను. ఏలయనగా MHTel 364.2

--నీవు నాకుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియు గాక --నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలతో ఎవనితో నైనను ఎప్పుడైనను చెప్పెనా”? హెబ్రీ 1:1-5. MHTel 364.3

తండ్రి వ్యక్తిత్వం కుమారుని వ్యక్తిత్వం వారి మధ్య ఉన్న ఏకత్వం యోహాను పది హేడో అధ్యాయంలో క్రీస్తు తన శిష్యుల కోసం చేసిన ప్రార్ధనలో స్పష్టమౌతున్నాయి. MHTel 365.1

“మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రీ, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్ధించుటలేదు; వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచువారందరను ఏకమైయుండ వలెనని వారి కొరకును ప్రార్ధి:చుచున్నానుఎ”. యోహాను 17:20,21 MHTel 365.2

క్రీస్తుకి ఆయ శిస్యులకు మధ్య ఉండే తత్వం వారిలో ఎవరి వ్యక్తిత్వాన్ని నాశనం చెయ్యదు. ఉద్దేశంలో, భావనలో, ప్రవర్తనలో వారు ఒకటే గాని వ్యక్తుల పరంగా కాదు. దేవుడు క్రీస్తు ఒకటిగా ఉండటం ఈ తీరుగా. MHTel 365.3