Go to full page →

శాస్త్రాల్లో ప్రావీణత్య సాధించాలి MHTel 397

క్రైస్తవంలో ప్రావీణ్యం సంపాదిల్సిన ఓ విజ్ఞాన శాస్త్రం ఉన్నది. ఆకాశం భూమి కన్నా ఎంత ఎత్తుగా ఉన్నట్లు అది అన్ని మావన శాస్త్రాలకన్నా ఎంతో లోతైన, విశాలమైన ఉన్నతమైన విజ్ఞాన శాస్త్రం. మనసును క్రమశిక్షణలో పెట్టాలి. సంస్కరించాలి. తర్బీతు చెయ్యాలి. ఎందుకంటే మనలో ఉన్న సహజమైన ఇష్టాలకు అనుగుణంగా కాని మార్గాల్లో మనం దేవునికి సేవ చెయ్యాలి. క్రీస్తు పాఠశాలలో ఓ నాయకుడవ్వటానికి జీవితం పొడుగునా నేర్చుకున్న విద్యను తర్బీతును తరుచు విసర్జించాల్సి ఉంటుంది. దేవునిలో స్థిరపడటానికి మన మనసుల్ని తర్బీతు చెయ్యాలి. శోధనల్ని ప్రతిఘటించటానికి మనకు సామార్థ్యాన్నిచ్చే తలంపులు తలంచే అల వాట్లును ఏర్పర్చుకోవాలి. మనం పైకి పరలోకం వైపుకి చూడటం నేర్చు కోవాలి. దైవవాక్యంలోని నియమాల్ని ఆకాశమంత ఎత్తయిన నిత్య కాలమంత విస్తృతి గల నియామల్ని మన దిన దిన జీవితంలో వాటి ప్రభావం సందర్భంగా అవగాహన చేసుకోవాలి. ప్రతీ కార్యం ప్రతీ మాట, ప్రతీ ఆలోచన, ఈ నియమాల ప్రకారం ఉండాలి. సమస్తాన్ని క్రీస్తుకు అనుగుణంగాను, విధేయంగాను ఉంచాలి. MHTel 397.4

పరిశుద్దాత్మ ప్రశస్తమైన కృపలు ఒక్క క్షణంలో వృద్ధి చెందవు. ధైర్యం, నైతిక, ధైర్యం సాత్వికం, విశ్వాసం రక్షించటానికి దేవుని శక్తి పై అచంచల విశ్వాసం సంవత్సరాల అనుభవం ద్వారా వస్తాయి. పరిశుద్ద కృషితో కూడిన జీవితం ద్వారా న్యాయాన్ని ధృడంగా అవలంభించటం ద్వారా దేవుని బిడ్డలు తమ నిత్య భవిష్యత్తును భద్రపర్చుకోవాలి. MHTel 398.1