Go to full page →

“నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము” MHTel 60

పర్ణశాల పండుగ అప్పుడే ముగిసింది. యేసుకు వ్యతిరేకంగా తమ కుట్ర విషయంలో యెరూషలేములోని యాజకులు రబ్బీలు విఫలుయ్యారు సాయ ంత్రం పడుతుండటంతో “ఎవరి ఇంటివారు వెళ్ళిరి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను”. యెహాను 7:53శ8:1 MHTel 60.1

నగరంలోని ఉద్రేకం గందరగోళం నుండి అతురతగా ఉన్న జన సమూహాలు, నమ్మక ద్రోహులైన రబ్బీల నుండి యేసు ప్రశాంతమైన ఒలీవల తోపులోకి వెళ్లాడు. అక్కడ ఆయన దేవునితో ఏకాంతముగా ఉండవచ్చు కాని ఆయన ఉదయాన్నే దేవాలయానికి వెళ్లాడు. తన చుట్టు ప్రజలు చేరటంతో కూర్చుని వారికి బోధించాడు. MHTel 60.2

కొద్ది సేపటలో ఆయనకు అంతరాయం ఏర్పడింది. పరిసయ్యులు సద్దూకయ్యులతో కూడిన ఓ గుంపు బయంతో వణుకుతున్న ఓ స్త్రీని ఈడ్చుకంటూ కఠిన కర్కశ స్వరాలతో ఏడో ఆజ్ఞను అతిక్రమించనిట్లు ఆమెను నిందిస్తూ ఆయన వద్దకు వచ్చారు. ఆమెను యేసు ముందుకి నెట్టి, దొంగ భక్తి ప్రదర్శిస్తూ, “బోధకుడా, యీ స్త్రీ వ్యభిచారము చేయు చుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళురువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకాజ్ఞపించెను, గదా; అయినను నీ వేమి చెప్పుచున్నావని అడిగిరి” 4,5 కచనాలు. MHTel 60.3

ఆయనను మట్టు పెట్టటానికి తాము వేసిన పథకానికి వారి దొంగ భక్తి ఓ ముసుగు, యేసు ఆ స్త్రీని విడిచి పెట్టడంటే, మోషే ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నట్లు ఆయన్ని నిందించవచ్చు అమె మరణ దండనకు అర్హురాలని ఆయన ప్రకటిస్తే రోమియులకు మాత్రమే చెందిన అధికారాన్ని చేతుల్లోకి తీసుక్నున్నట్లు నిందమోపి రోమీయుల ముందు ఆయనను నిలబెట్టవచ్చు. MHTel 60.4

యేసు ఆ దృశ్యాన్ని చూసాడు. సిగ్గుతో వణుకుతున్న బాధితురాలు మానవత దయ ఏమాత్రం లేకుండా ముఖాల్లో కాఠిన్యం ప్రదర్శిస్తున్న ఉన్నతాధికారులు ఆ దృశ్యం నుండి ఆయన నిష్కళంక పవిత్రత వెనకడుగు వేసింది. ఆ ప్రశ్నను విన్న సూచనలు కనపర్చకుండా వంగి, దృష్టి నేలపై నిలుపుతూ దూళిలో రాయడం ఆయన మొదలు పెట్టాడు. MHTel 60.5

ఆయన చూపిన ఉదాసీనత పట్ల అసహనంతో ఆవిషయము పై ఆయన దృష్టిని ఆకర్షించటానికి ఫిర్యాదుదారులు ఆయనకు దగ్గరగా వెళ్ళారు. యేసు దృష్టిననుసరించి వారి దృష్టి నేలపై ఆయన పాదాల వద్ద పడ్డప్పుడు వారి స్వరాలు మూగబోయాయి. అక్కడ వారి ముందు వారి రహస్య అపరాధాలు పాపాలు ఆయన రాస్తున్నాడు. MHTel 61.1

కన్నులు పైకెత్తి కుట్రలు పన్నుతున్న పెద్దల పై దృష్టి సారించి యేసన్నాడు. “మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును” (7వ వచనం) మళ్ళీ వంగి రాయటం కొనసాగించాడు. MHTel 61.2

మో షే ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టటం గాని రోమా ప్రభుత్వ అధికాన్ని అతిక్రమించటం గాని ఆయన చెయ్యలేదు. ఫిర్యాదుదారులు ఓడిపోయారు. ఇప్పుడు వారి దొంగ పరిశుద్ద అంగీలు వారి నుండి చించబడ్డాయి. ఆయన అపార పరిశుద్దత ముందు వారు అపరాధులుగా తీర్పు పొంది నిలబడ్డారు. తమ జీవితాల్లో రహస్యంగా దాగి ఉన్న పాపం జనులు మందు బట్ట బయలువుతందేమోనన్న భయంతో వణుకుతూ తలలు వంచుకొని నేల చూపు చూసుకుంటూ, బాధితురాలిని జాలిపడుతున్న రక్షకుని వద్ద విడిచి పెట్టి నెమ్మదిగా జారుకున్నార MHTel 61.3

యేసు లేచి నిలబడి, ఆ స్త్రీ వంక చూసి ఇలా అన్నాడు. “అమ్మా వారెక్కడున్నారు?ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా ఆనెను. అందుకు యేసు నేనును శిక్ష విధంపను. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము”. ఆమె హృదయం నీరైపోయింది. క్రీస్తు పాదాలపై పడి తన కృతజ్ఞతను ప్రేమను తెలుపుకొని, దు:ఖిస్తూ తన పాపాలు ఒప్పుకుంది. MHTel 61.4

ఇది ఆమెకు ఓ నూతన జీవితారంభం. పవిత్రత, సమాధానంతో కూడిన, దేవునికి అంకితమైన జీవితం. పతనమైన ఈ ఆత్మను లేవదీయటంలో తీవ్ర శారీరక వ్యాధిని స్వస్థపర్చినప్పటికన్నా యేసు ఎంతో గొప్ప అద్భుత కార్యం చేసాడు. నిత్య మరణాన్ని కలిగించే ఆధ్యాత్మిక రుగ్మతను ఆయన స్వస్థపర్చాడు. పశ్చాత్తపురాలైన ఈ స్త్రీ ఆయన MHTel 61.5

నమ్మకమైన అనుచరుల్లో ఒకరు అయ్యింది. తనను కృపతో క్షమించిన క్షమాపణకు, ఆత్మ త్యాగంతో కూడిన ప్రేమతో అంకింత భావంతో ఆయనకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నది. పాపి అయిన ఈ స్త్రీ పట్ల లోకం ఏవగింపు. తిరసాక్కరం కనపరిచింది. కాని పాపరహితుడైన యేసు ఆమె బలహీనతను జాలిపడి ఆమెకు చేయూత ఇచ్చాడు. వేషధారులైన పరిసయ్యులు ఆమెను ఖండిచంగా యేసు “వెళ్ళి ఇక పాపము చేయకుము” అని ఆదేశించాడు. MHTel 62.1

యేసుకు ప్రతీ ఆత్మ పరిస్థితులు తెలుసు. పాపి అపరాధం. ఎంత ఘోరమైనదైతే అంత ఎక్కువగా అతడికి లేక ఆమెకు రక్షకుడు అవసరం. దివ్య ప్రేమ సానుభూతితో నిండిన ఆయన హృదయం ముఖ్యంగా సాతాను ఉచ్చుల్లో చిక్కుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఆకర్షితమౌతుంది. మానవ జాతి విమోచన పత్రాలపై ఆయన తన సొంత రక్తంతో సంతకం చేసాడు. MHTel 62.2

“రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తమువలె ఎఱ్ఱనినైనను అని హిమమువలె తెల్లబడును. కెంపువలె ఎఱ్ఱనివైనను అని గొట్టెబొచ్చువలె తెల్లనివగును.” యెషయా 1:18 MHTel 62.3

అంత మూల్యం చెల్లించి తాను కొన్న మనుషులతో విరోధి తన శోధనలతో ఆడుకోకూడదన్నది యేసు కోరిక. మనం ఓటమి పాలౌ నాశనమవ్వటం ఆయనకు ఇష్టం లేదు. తమ గుహలోని సింహాల నోళ్ళకు కళ్ళెం వేసిన ఆయన, నమ్మకమైన తన సాక్షులతో అగ్నిగుండం మంటల్లో నడిచిన ఆయన, మన స్వభావంలోని ప్రతీ దుష్టతను అణిచి వెయ్యటానికి అంతే సంసిద్ధతతో ఉన్నాడు. తన సహాయం కోరే వారి ప్రార్ధనల్ని దేవుని ముందు సమర్పిస్తూ నేడు కృపా బలిపీఠం ముందు నిలబడి ఉన్నాడు. విలపించే ఏ వ్యక్తిని విరిగి నలిగిన హృదయం గల ఏ వ్యక్తిని ఆయన నిరాకరించడు. క్షమాపణ, పునరుద్దరణ కోసం తన వద్దకు వచ్చేవారందరిని ఆయన క్షమిస్తాడు. తాను వెల్లడి చేసేదంతా ఆయన ఎవరికి చెప్పడు. ఆతని భయంతో వణుకుతున్న ప్రతీ ఆత్మనూ ధైర్యంగా ఉండాల్సిందిగా ఆదేశిస్తున్నాడు. ఎవరు ఇష్టపడతారో వారందరూ దేవుని బలాన్ని పొంది ఆయనతో సమాధానపడవచ్చు. ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. MHTel 62.4

ఆశ్రయం కోసం తన వద్దకు వచ్చే ఆత్మల్ని యేసు నిందలు మోపే, జగడలాడే నాలుకలకు పైగా ఎత్తుతాడు. ఈ ఆత్మల్నీ ఏ మనుషుడు గాని దుష్ట దూతగాని తప్పు పట్టలేడు. వారిని తన దేవమానవ స్వభావంతో క్రీస్తు ఏకం చేస్తాడు. పాపాలు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లపక్క దేవుని సింహాసనం నుంచి ప్రకాశిస్తున్న వెలుగులో వారు నిలబడతారు. MHTel 63.1

“యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును.” 1 యోహాను 1:7 MHTel 63.2

“దేవునిచేత ఏర్పర్చబడిన వారి మీద నేరుము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే.” రోమా 8:33,34 MHTel 63.3

గాలిపై కెరటాల పైన దయ్యాలు పట్టిన మనుషుల పైన తనకు సంపూర్ణ నియంత్రణ ఉన్నదని క్రీస్తు చూపించాడు. గాలివానను సద్దణచిన, తుఫానుతో ప్రకోపించిన సముద్రాన్ని శాంతపర్చిన ఆయన సాతాను కలిగించిన మాసిక కల్లోలానికి గురి అయిన మనసులకు శాంతి వాక్కులతో ప్రశాంతత కలిగించాడు. MHTel 63.4

పాపానికి దాసులైన వారిని విడిపించే తన మిషను గురించి కప్నె హేములోని సమాజ మందిరంలో ఆయన మాట్లడుతున్నాడు. ఓ భయం కరమైన అరుపు ఆయన మాటలకు అంతరాయం కలిగించిది. ఓ న్మాది ప్రజల మధ్య నుండి పరుగు పరుగున వచ్చి “నజరేయుడవగు యేసూ, మాతో నీకేమి మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెడవో నాకు తెలియును, నీవు దేవుని పరిశుద్దడవు అని కేకలు వేసెను”. మార్కు 1:24 MHTel 63.5

ఆ దయ్యాన్ని మందలిస్తూ యేసు ఇలా అన్నాడు. ఊరకుండుము’ ఇతనిని వదలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను”. లూకా 4:35 MHTel 64.1

ఇతడి బాధకు కారణం కూడా ఇతడి జీవితమే. అతడు పాపభోగా లకు ఆకర్షితుడయ్యాడు. జీవతాన్ని గొప్ప పండుగగా మార్చుకోవాలను కున్నాడు. అతడి స్వభావంలోని ఉదాత్త గుణాల్ని మితి మీరిన భోగం, చౌకబారుతనం వక్రం చేసాయి. సాతాను అతణ్ణి తన అదుపులోకి తీసుకున్నాడు. పశ్చాత్తాపం ఆలస్యంగా వచ్చింది. తాను పోగొట్టుకున్న మగసిరిని తిరిగి సంపాదించటానికి భాగ్యాన్ని బోగాన్ని త్యాగం చేయగలిగి ఉన్నప్పుడు అతడు అపవాది గుప్పెట్లో నిస్సహాయుడయ్యాడు. MHTel 64.2

రక్షకుని సన్నిధిలో అతడు స్వతంత్రత కోసం ఎంతో ఆశించాడు. కాని ఆ దయ్యం క్రీస్తు శక్తిని ప్రతిఘటించింది. సహాయం కోసం అతడు యేసుకు విజ్ఞప్తి చేసినప్పుడు ఆ దురాత్మ అతడి నోటిలో మాటలు పెట్టగా అతడు భయంతో కేకలు వేసాడు. తనను విడిపించగలవాని సన్నిధిలో తానున్నానని దయ్యం పట్టినవాడు పాక్షికంగా అవగాహన చేసుకున్నాడు. కాని సర్వశక్తి గల ఆయన అందుబాటులోకి రావాటానికి ప్రయత్నించి నపుడు, అతణ్ణి మరొకడి చిత్తం అదుపు చేసింది. అతడి నోట మరొకటి మాటలు వినిపించాయి. MHTel 64.3

సాతాను శక్తికి స్వతంత్రతకు దయ్యం పట్టినవాడి ఆకాంక్షకు మధ్య సంఘర్షణ భయంకరమైనది తన మగతనాన్ని నాశనం చేసిన శత్రువుతో పోరాటంలో ఆ బాధిత వ్యక్తి తన ప్రాణాన్ని పొగట్టుకోవలసి ఉన్నట్లు కనిపించింది. అయితే రక్షకుడు అధికారంతో మాట్లాడి ఆ బందీని విడపించాడు. దురాత్మ పీడుతుడైన ఆ వ్యక్తి ఆశ్చర్య పడుతున్న ప్రజల మందు స్వతంత్రతతో నిగ్రహంతో నిలబడ్డాడు. MHTel 64.4

అతడు తన విముక్తకి సంతోషానందాలతో దేవున్ని స్తుతించాడు. కొద్ది సమయం క్రితమే పిచ్చితనంలో ఎర్రగా కనిపించన కన్ను ఇప్పుడు వివేకంతో ప్రకాశించి కృతజ్ఞతా బాష్పాలు కార్చింది. ప్రజలు విస్మయంతో మూగబోయారు. మాట్లాడగలిగిన వెంటనే వారు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు.“ఇదేమిటో క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో ఆపవిత్రాత్మలను ఆజ్ఞపింపగా అవి ఆయనకు లోబడున్నవి”.మార్కు 1:27 MHTel 64.5

కపెర్న హెూమునివాసి అయిన ఆ దయ్యం పట్టిన వాడిలా దూరా త్మల వశంలో నేడు వేలాది మంది ఉన్నారు. దేవుని ఆజ్ఞలను పూర్తిగా విడిచి పెట్టే వారందరూ తమను తాము సాతాను నియంత్రణ కింద ఉంచుకుంటున్నారు. కావాలనుకున్నప్పుడు దాన్ని విడిచి పెట్టెయ్యవచ్చునని అనేకమది దుష్టత్వంతో దోబూచులాడతారు. కాని వారు తమ చిత్తం కన్నా బలమైన చిత్తం అదుపులో ఉన్నట్లు తెలుసుకునే వరకు లోతుగా, ఇంకా లోతుగా వెళ్ళటానికి ఆకర్షితులౌతారు. దాని నిగూఢ శక్తి నుండి తప్పించుకోలేరు. రహస్య పాపం లేక బలమైన వ్యసనం కపెర్న మామ దయ్యం బాధితుడిలా వారిని నిస్సహాయ బందీలుగా ఉండవచ్చు. MHTel 65.1

అయినా, ఈ పరిస్థితి నిరాశాజనకమైనది కాదు. మన సమ్మతి లేకుండా దేవుడు మన మనసుల్ని అదుపు చెయ్యడు. ఏ శక్తి తనను పరిపాలించడం తనకు ఇష్టమో ఎంపిక చేసుకోవడానికి ప్రతి వ్యక్తికీ స్వేచ్చ ఉంది. క్రీస్తులో విముక్తి పొందలేనంత నీచ స్థితికి పడిపోయినవారు గాని నికృష్టులుగాని ఎవరు లేరు. దయ్యం పట్టినవాడు ప్రార్ధనకుబదులు సాతాను మాటలనే ఉచ్చరించగలిగాడు. అయినా ఆ హృదయం మూగ విజ్ఞప్తి వినిపిచింది. అవసరంలో ఉన్న ఆత్మ నుంచి వచ్చే ఏ మొరా, అది మాటల్లో చెప్పలేకపోయినా, ఆలక్ష్యం చెయ్యబడదు. దేవునితో నిబంధనకు సమ్మతించేవారు సాతాను ప్రాబల్యానికి గాని లేక తమ సొంత స్వభావం దుర్బలతకు గాని విడిచి పెట్టబడరు. MHTel 65.2

బలాఢ్యూని చేతిలోనుండి కొల్లసొమ్ము ఎవడు తీసికొనగలడు? భీకరులు చెరపట్టినవాడు విడిపింపబడుదురా? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు-- బలాఢ్యులు చెరపట్టివారు విడిపింపబడురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసెదను, నీపిల్లలను నేనే రక్షించెదను యషయా 49: 24, 25 MHTel 65.3

ఎవరు విశ్వాసం ద్వారా తమ హృదయ ద్వారాన్ని రక్షకునిగా తెరుస్తారో అతనిలో అద్భుతమైన మార్పు చోటు చేసుకుంటుంది. MHTel 66.1

“కాగా వారితో ఇట్లనుము.. నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గమునుండి మరలా బ్రదుకుట వలన నాకు సంతోషము కలుగును.” యెహజ్కేలు 33:11 ” యెహోవాను సేవంచుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో.. నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నాయింటి వారను యెహోవాను సేవించెదము”. యెహూషువ 24:15 MHTel 66.2