Go to full page →

చిత్తానికున్న శక్తి MHTel 141

శోధించబడుతున్న వ్యక్తి చిత్రానికున్న వాస్తవిక శక్తిని అవగాహన చేసుకోవటం వసరం. మానవుడి స్వభావంలో ఇది పరిపాలించే శక్తి. తీర్మానాలు ఎపికలు చేసే శక్తి. చిత్తం చేపట్టే చర్యపై సమస్తం ఆధారపడి ఉంటుంది. మంచితనానికి, పవిత్రతకు కోరికలు మంచివే అని కొనసాగినంత కాలం. కాని అవి ఇక్కడే అగిపోతే, అవి నిరుపయోగం. తమ చెడు ప్రవృత్తులను జయించటానికి నిరీక్షిస్తూ, ఆశిస్తూ అనేకులు నాశనమౌతారు. వారు చిత్రాన్ని దేవునికి లోపరచరు. ఆయన సేవ చెయ్యటా నికి ఎంపిక చేసుకోరు. MHTel 141.3

దేవుడు మనకు ఎంపిక చేసుకునే శక్తినిచ్చాడు. దాన్ని ఉపయో గించటానికే మనకిచ్చాడు. మనం మన హృదయాల్ని మార్చలేం. మన తలంపులను భావోద్రాకాలను, అనురాగాలను నియంత్రించలేం. దేవుని సేవకు మనల్ని మనం పవిత్రులుగా, యోగ్యులుగా చేసుకోలేం. కాని దేవుని సేవ చెయ్యటానికి ఎంపిక చేసుకోగలం, మన చిత్రాన్ని ఆయన కివ్వగలం. అప్పుడు మనం ఇచ్చయింటానికి ఆయన మనలో పనిచేసి తన సంకల్పాన్ని నెరవేర్చేటుట్ల చేస్తాడు. ఇలా మన స్వభావం మొత్తం క్రీస్తు అదుపులోకి వస్తుంది. MHTel 142.1

చిత్తాన్ని సరిగా ఉపయోగించటం ద్వారా జీవితంలో సంపూర్ణమైన మార్పు చోటు చేసుకోవచ్చు. చిత్తాన్ని క్రీస్తుకి లోపర్చటం ద్వారా మనం దివ్యశక్తితో జతపడతాం. మనల్ని స్థిరంగా ఉంచటానికి పై నుండి శక్తి పొందుతాం.తమ బలహీనతగల, చంచలమైన మానవ చిత్రాన్ని సర్వశక్తి గల, స్థిరమైన దేవుని చిత్తంతో ఎవరు జతపర్చుతారో వారికి అమిత భోగం పై శరీరాశ పై విజయం సాధించే పవిత్రమైన, ఉదాత్తమైన జీవితం సాధ్య మౌతుంది. MHTel 142.2

అమిత ఆహార వాంఛ శక్తితో పోరాడుతున్నవారు ఆరోగ్యదాయక జీవన నియామలపై ఉపదేశం పొందాలి. వ్యాధిగ్రస్త పరిస్థితులను, అస్వాభావిక వాంచలను సృష్టించుకోవటం ఆరోగ్య చట్టాలను అతిక్రమిం చటానికి సారా అలవాటుకు పునాది వేస్తుందని వారికి చూపించాలి. ఆరోగ్య సూత్రాలకు విధేయులవ్వటం ద్వారా మాత్రమే ఆస్వాభావిక ప్రేరేపకాలకు తీవ్ర వాంఛ నుంచి వారు విముక్తి పొందగలరు. అనుచిత ఆహార వాంఛ బందాకాల నుండి విముక్తి పొందటానికి దైవ శక్తి మీద ఆధారపడు తుండగా, వారు దేవుని చట్టాలకు నైతిక, భౌతిక చట్టాలు రెంటికి విధేయంగా జీవించటం ద్వారా దేవునితో సహకరించాలి. సంస్కరణను ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించేవారికి ఉపాధి కల్పించాలి. పని చెయ్యటానికి సమర్థులైనవారిని భోజనం, బట్టలు, నీడ, ఉచితంగా పొందేందకు ఎదరు చూడటానికి తర్బీతు చెయ్యకూడదు. వారి నిమిత్తం ఇతరుల నిమిత్తం, తాము పొందేదానికి ప్రతిగా వారు ఏదో తిరిగి ఇవ్వటానికి ఓ మార్గం ఏర్పాటు చెయ్యాలి. స్వయం సహాయానికి ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహించండి. ఇది ఆత్మ గౌరవన్ని పెంచి ఉన్నత స్వతంత్ర భావాన్ని బలపర్చుతుంది. ఉపయోగకరమైన పనిలో శరారాన్ని మనసును ఉంచటం శోధనలో పడకుండా కాపాడాటానికి చాలా ప్రాముఖ్యం. MHTel 142.3