Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

క్రైస్తవ పరిచర్య

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    కాపరి సంరక్షణ

    తన గొర్రెల్లో ఒకటి తప్పిపోయినట్లు కాపరి కనుక్కుంటే మందలో క్షేమంగా ఉన్న గొర్రెల వంక చూసి, “నాకు తొంబయి తొమ్మిది గొర్రెలున్నాయి. తప్పిపోయినదాన్ని వెతకటానికి వెళ్లటం శ్రమతో కూడిన పని. అదే తిరిగి వస్తుందిలే. అది వచ్చినప్పుడు దొడ్డి తలుపు తీసి దాన్ని లోపల పెడతాను” అనుకుంటూ అజాగ్రత్తగా ఉండడు. గొర్రె తప్పిపోయిన వెంటనే కాపరి తీవ్ర విచారానికి ఆందోళనకు గురి అవుతాడు. మందను మళ్లీ మళ్లీ లెక్క పెట్టుకుంటాడు. ఒక్క గొర్రె తప్పిపోయిందని నిర్ధారణ చేసుకున్నాక అతడు నిద్రపోడు. తన తొంబయి తొమ్మిది గొర్రెల్నీ దొడ్డిలో ఉంచి తప్పిపోయిన దాన్ని వెతకటానికి బయల్దేరాడు. రాత్రి ఎంత చీకటిగా, రేగుతున్న తుపాను ఎంత భీకరంగా, మార్గం ఎంత ప్రమాదభరితంగా ఉంటే కాపరి అంత ఎక్కువ ఆందోళన చెంది అంత ఎక్కువ శ్రద్దగా వెతుకుతాడు. తప్పిపోయిన ఆ గొర్రెని కనుక్కోటానికి ప్రతీ ప్రయత్నం చేస్తాడు.ChSTel 288.2

    మార్గంలో దాని శబ్దం విన్నప్పుడు అతడికి ఎంత ఊరట కలుగుతుంది! శబ్దం వినిపిస్తున్న దిశలో అతడు కొండలు ఎక్కుతాడు. ప్రాణాన్ని లెక్కచెయ్యకుండా ఏటవాలుగా ఉన్న కొండ భాగం దాదాపు అంచు వరకూ వెళ్లాడు. బలహీనమౌతున్న అరుపు గొర్రె మరణించటానికి సిద్ధంగా ఉన్నదని సూచించేంత వరకూ వెతుకుతూనే ఉంటాడు. చివరికి అతడి శ్రమ ఫలిస్తుంది. తప్పిపోయిన గొర్రె దొరుకుతుంది. తనకు అంత శ్రమ కలిగించినందుకు దాన్ని తిట్టడు. దాన్ని కొరడాతో కొడుతూ తోలడు. దాన్ని ఇంటికి నడిపించడు కూడా. భయంతో వణకుతున్న ఆ మూగప్రాణిని భుజాల పై పెట్టుకుంటాడు. అది గాయపడితే దాన్ని కౌగిటిలో పెట్టుకుని తనలోని వేడి దాన్ని బతికించేందుకు దాన్ని తన రొముకి హత్తుకుంటాడు. తన అన్వేషణ వ్యర్థం కానందుకు కృతజ్ఞతతో నిండి దాన్ని దొడ్డికి మోసుకు వెళ్తాడు. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 187, 188.ChSTel 288.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents