Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  17 అధ్యాయము - చివరి ఏడు తెగుళ్ళు మరియు దుష్టుడు

  (గొప్ప శ్రమకాలం 1 వ భాగము) దేవుని ఉగ్రత పాత్ర పోయబడును

  గొప్ప భయంకర సంఘటనలు మన ముందు ఇంకా జరగవలసియుంది. బూర శబ్దము వెంబడి మరోక బూర శబ్ధము ధ్వనిచుచున్నది, దూతలు వారు పట్టుకున్న పాత్రను భూమిమీద కుమ్మరించును.. సెలెక్ట్డ్ మెజన్స్.3: 426 (1890).LDETel 166.1

  ఈ ప్రపంచమును అతి త్వరలో కరుణగల దేవదూత చేతులకు అప్పగించబడును మరియు వారు పట్టుకొనియున్న చివరి ఏడు తెగుళ్లను కుమ్మరించును ........ఈ కడవరి తెగళ్లు పంపగానే దేవుని కోపము సమాప్తమాయెను. మరియు అతను శిక్షించడం ప్రారంభంకాగానే అవిదేయులు ముగింపు వరకు ఏమాత్రం ఉపశమనం లేకుండా ఉంటారు.-టెస్టమోనీస్ టూ మినిస్టర్స్ అండ్ గాస్పల్ వర్కరస్సా 182 (1894).LDETel 166.2

  వైరముతో రగిలిపోతున్న దేశాలు

  దేవుని సేవకులు వారి నొసటియందు ముద్ర వేయబడేంత వరకు నాలుగు గొప్ప దేవదూతలు ఈ భూమి యొక్క అధికారాలను పట్టుకొనియున్నారు. ప్రపంచ దేశాలు వివాదానికి ఎంతో అతురత కలిగియున్నారు, కానీ అవి దేవదూతలచేత తనిఖీ చేయబడతాయి. ఈ నిరోదిస్తున్న శక్తి తీసివేయబడినప్పుడు శ్రమలు మరియు వేదనల కాలము వస్తుంది. యుద్ధం కొరకై భయంకరమైన ఆయుధములు కనుగొన్నారు, వారి జీవన సమస్యలనే నౌక గొప్ప లోతుల్లో భూస్థాపితం చేయబడును. సత్యం గూర్చి పోరాడని వారందరు సాతాను నాయకత్వంలో ఏకమౌతారు అయితే అర్మ గిద్దాను గొప్ప యుద్దానికి సమయం వచ్చే వరకు వారు నియంత్రించబడతారు. ది ఎస్ డి ఏ . బైబిల్ కామెంటరీ 7: 967 (1900).LDETel 166.3

  ప్రపంచమంత వినాశనం కోరుకుంటుంది

  దుర్భర పరిస్థితులు ప్రపంచమును ముట్టడి చేయనైయన్నదని హెచ్చరిక వచ్చే అంత వరకు ఘర్షణల వాతవరణము దేవదూతలు యొక్క స్వాదీనములో వున్నది, పైర గాలి తూపాను భూమి మీద చెలరేగిపోవుటకు సిద్ధంగా ఉంది, మరియు దేవుడు తన దూతలను ఈ భూమి మీద తెగుళ్ల వదలివేసేటప్పుడు, అటువంటి దృశ్యన్ని ఏ చిత్రకారకుడు వర్ణంచలేదు . ఎడ్యుకేషన్ 179, 180 (1903).LDETel 166.4

  యెరుషలేమును గూర్చిన తీర్పుల విషయములో రక్షకుడు ప్రవచించన నాశనం నెరవేర్పుతోపాటు మరో నెరవేర్పుంది.అప్పుడు జరిగిన భయంకర విధ్యంసం ముందు జరగనున్న దాని నీడవంటిది మాత్రమే, యెరుషలేముకు సంభవించిన నాశనం దేవుని కృపను తృణీకరించి ఆయన ధర్మశాస్త్రన్ని కాలరాసే ప్రపంచం నాశనాన్ని సూచిస్తుంది. సాతాను అప్పుడు భూనివాసులకు ఆఖరి శ్రమలు కలిగిస్తాయి. దేవదూతలు మనుషుల ఆగ్రహావేశాల్ని అదుపులో వుంచడం మానేస్తారు గనుక సంఘర్షణకు అవసరమైన పరిస్థితి ఏర్పడతాయి. ప్రపంచం మరింత నాశనానికి సిద్ధపడుతుంది. అది యెరూషలేమునకు వాటిల్లిన నాశనంకన్నా మిక్కిలి భయంకరముగా ఉంటుంది. మహా సంఘర్షణ 614 (1911)LDETel 166.5

  దేవుడు న్యాయమంతుడు అంతేకాదు దయగలవాడు

  దేవుడు దయ, ఓర్పు, మంచితనం, మరియు సత్యము కలిగి ఉండటం ఆయన మహిమైయున్నది, కానీ పాపిని శిక్షించటంలో చూపబడిన న్యాయం స్పష్టంగా దేవుని యొక్క ఉన్నత మహిమను బయలుపర్చుచున్నాది.- ది రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చ్ 10, 1904.LDETel 167.1

  ఇశ్రాయెలీయల దేవుడు ఐగుప్తు దేవతలకు ఏ విదముగా తీర్పు ఇచ్చేనో అట్లే ఈ లోక దేవతలకు, అగ్ని మరియు వరదలు, తెగుళ్ళు మరియు భూకంపాలు చేత తీర్పు ఇచ్చును. ఆయన భూమండలమును సర్వనాశనము చేయును, అప్పుడు అతని విమోచించబడిన ప్రజలు ఆయన నామమును ఘనపరుచుచు భూమి మీద మహిమ పరిచెదరు. ఈ భూమి యొక్క చరిత్ర అంతములో శేషించి వారిలో జీవించలేని వారు దేవుని చూపిన గుణపాఠముల విషయంలో వారు మేధావులే. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 10: 240, 241 (1899).LDETel 167.2

  ఆయన దయకు మరియు ప్రేమకు చిహ్నంగా ప్రాతినిధ్యం వహిస్తుది, ఇంద్రధనస్సు ఆయన శిరస్సు చుట్టు తిరుగుతుంది. ఆయనే మన పశ్చాత్తాప ప్రార్థనలు మరియు ఒప్పుకోలు విని మన కొరకు మద్యవర్తిగా ప్రభువు నిలిచియున్నాడు, ఆయనే పరలోక గూడారపు సేవ ఇక త్వరలో ముగించనైయున్నాడు, అప్పుడు ఆయన దయ మరియు కనికరం సింహాసనం నుండి వెలివడతాయి,మరియు న్యాయం వాటిస్థానంలో నిలుస్తుంది. సర్వోనతమైన న్యాయస్థానము ఇది అని ఆయన చేసినది న్యాయమేనని ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రజల అనుకోందురు. .-ది రివ్యూ అండ్ హెరాల్డ్, జనవరి 1, 1889.LDETel 167.3

  బైబిలు అంతటిలో దేవుడు కరుణ మరియు కృపను మాత్రమే కాకుండా, కఠినమైన, నిష్పక్షపాతమైన న్యాయం కనపరిచే దేవుడుగా అగుపడుచున్నాడు. -సైన్స్ ఆప్ ది టైమ్స్, మార్చ్ 24, 1881.LDETel 167.4

  దేవుడు తీర్పులు నిశ్చయము

  పాపులను నాశనము చేయకూడదు అనే ఆయన స్వభావము నేటి కాలములో దేవుని ప్రేమయే కనపరుచుచున్నది. మనుష్యుల యొక్క అల్ప న్యాయం మరియు నీతి కొరకు వారి కారణములు వెతికెదరు....... అందుకు నేను కేవలము నీవంటివాడనని నీవనుకొంటివి (కీర్తన 50:21). వారికి వారే దేవుణ్ణి అంచనావేస్తారు. వారు ఆయ పరిస్థితులలో ఎలా పని చేయలో కారణాలు అడుగుతారు మరియు వారు పని చేసే విధముగా దేవుడ నిర్ణయిస్తాడనే వారు తలంచెదరు...... చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఏ రాజ్యముగాని లేదా ఏ ప్రభుత్వముగాని చట్టవిరుద్దముగా వున్న వ్యక్తులకు ఎలాంటి శిక్ష విధించాలని చెప్పడానికి వారి సొంత నిర్ణయానికి అప్పగించలేదు. మనకు ఉన్నదంతా, ఆయన అనుగ్రహించు కృపయే కాబట్టి మనము ఆయనకు బద్దులమై యున్నాము. దేవునికి వ్యతిరేకంగా వున్న తీవ్రమైన పాప స్వభావము పరలోకము వెలకట్టిన వ్యవది బట్టి చూసినటైయితే దేవుడు ఇంక దాని గూర్చి తీర్పు తీర్చడానికి వెనకాడడు..... దేవుడు ఒక నైతిక అధికారి అలాగే ఆయన మనకి తండ్రి కూడ . ఆయన న్యాయాధికారి. అతను తన చట్టాలను అమలుపరుచును ఆయన చట్టం ఏ విధమైన బలవంతము చేసే మాత్రము కాదు.దేవుడు విడిపించగల అదికారము కలిగియున్న ప్పటికిని, ఆయన పంపిస్తున్న అగ్ని చేత ఆయన ప్రజలు శిక్షిచబడటం చూడకూడదని ప్రేమగల తండ్రి హృదయపూర్వక విజ్ఞప్తి చేసియండవచ్చు. దేవుడు మాటకు విదేయు లైన ప్రజల క్షేమమును మరియు వారి భద్రత కోరేవాడు, ఆజ్ఞను అతిక్రమించిన వారినే శిక్షించును. దేవుడు మనిషి యొక్క ప్రణాళికలను బట్టి కార్యము చేయడు. తన సహచరునికి తీర్పిచ్చుటకు మనిషికి ఎటువంటి హక్కు లేదని కాని అనంతమైన దేవుడే న్యాయం చేయగలడు. నోవహుని ఎగతాళి చేసినవారు, మరియు వెక్కిరించినవారుతో పాటు, ప్రపంచమంత ముంచివేసినందుకు దేవునితో సహవు ఏకీబవించక ఉండవచ్చు. లోతు తనకు కాబోయే అలుళ్ళను శిక్షిచుటకు తనకు అదికారము లేదు, కానీ దేవుడు ఖచ్చితమైన న్యాయాదిపతులతో చేసేను. దేవుడు చెప్పినది చేయడు అని ఎవరు అనగలరు, ఆయన చెప్పినదే చేస్తాడు, మాన్యుస్కిప్ట్ రిలీజ్, 12: 207-209; మాన్యుస్కిప్ట్ రిలీజు 10: 265 (1876).LDETel 167.5

  దేవుడు కాపుదల తీసివేసినప్పుడు తీర్పులు వస్తాయి

  అయితే ఈ విధంగా దేవుని తీర్పులు వారి మీదకి ప్రభువు నుండి ప్రత్యక్షంగా రాలేదని నాకు చూపించబడియుంది. అయితే వారికి వారు అతని సంరక్షణ నుండి దూరముగా వెళ్లిపోయారు. ఆయన వారిని హెచ్చరించి, సవరనచేయుచు, గద్దించుచు, మరియు కేవలం సురక్షితమైన మార్గాన్ని చూపించుచు, ఇంక ప్రత్యేకముగా శ్రద్ధ వహించి కాపాడబడుచున్నపటికిని ఏదైన చిన్న విషయములో అటంకము వుంటే చాలు వారు తమ సొంత మార్గాన్నే అనుసరిస్తారు. హెచ్చరికలు వెంబడి హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడ వారు దేవుని యొక్క ఆత్మ నుండి స్వతంత్రంగానే ఉంటారు, వారు తమ సొంత మార్గాన్ని ఎంచుకుంటే కనుక, అప్పుడు సాతాను వారిని నాశనము చేయుటకు నిర్ణయం తీసుకొనును అయితే వాటిని అడ్డుకొనుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించడు. కాబట్టి సాతనుడు ఇక సముద్రమీదను, భూమిమీదను కరువులు కాటకాలు విపత్తులు పుట్టిస్తాడు ఆ విధముగా ఎందరో తనకు బలైపోతారు, మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 14:3(1883).LDETel 168.1

  ఎవరైతే వారి స్వంత వినాశనము కోరుకోనే మార్గాలు అనుసరిస్తారో వారు దేవుని సత్య వాక్కును తప్పుగా సూచించెదరు మరియు తప్పుదోవ పట్టించి అగౌరవపరిచెదరు కాబట్టి దేవుడు తన శత్రువులను ప్రతినిధులగా ఉపయోగించి వారిని శిక్షించును. - ఎల్లెన్ జి. వైట్ లెటర్స్ నుండి -పాల్సస్ సేకరించినవి, 136 (1894)LDETel 169.1

  ఇప్పటికే దేవుని ఆత్మ, అవమానించబడి, తిరస్కరించబడి, దూషించబడుట చేత భూమి నుండి వెనక్కి వెళ్లిపోయేను. ఎప్పడైతే దేవుని ఆత్మ భూమి నుండి ఎంత వేగముగా తీసివేయబడేనో అంత త్వరగా, సాతాను క్రూరమైన కృత్యలు భూమిమీద, సముద్రం మీద జరిగించుటం ప్రారంభిస్తాడు. ఎంమ్ ఎస్ 134, 1898.LDETel 169.2

  దుష్ట జనులు అవదుల్ని దాటిపోయారు; పదే పదే తృణీకరించబడ్డ దైవాత్మ చివరికి ఉపసంహరించబడుతుంది. దైవిక కృప నీడలేనందున సాతాను నుంచి వారికి పరిరక్షణ ఉండందు.మహా సంఘర్పణ 614 (1911). LDETel 169.3

  ఆ సమయమందు పరిశుద్ధ దూతలు సంహారము శక్తిని వినియోగించెదరు.

  [పాపి తనకు తగిన శిక్షకు తానే పూర్తిగా బాద్యత వహించాలి. ఎల్లెన్ వైట్ ఇలా అనేను, “దేవుడు ఎవరిని నాశనం చేయడు. పాపి తన స్వబావంతో తనను తాను నాశనం చేసుకొనేను “5T 120 మహా సంఘర్షణలో చూడండి, 25-37.]LDETel 169.4

  దేవుని తీర్పులు యెరికోకు వ్యతిరేకంగా లేచాయి. ఇది ఒక బలమైనదిగా ఉంది, అయితే సైన్యములకధిపతియగు ప్రభువు పరము నుండి తన సైన్యముతో దిగ్గివచ్చి నగరం మీద దండెత్తేను. దేవుని యొక్క దూతలు పెద్ద గోడలను పట్టుకొని, వాటిని నేలమట్టము చేసేను. సంఘములకు ఉపదేశములు, 3: 264 (1873)LDETel 169.5

  దేవుని యొద్ద ఉన్న దూతలందరూ గొప్ప శక్తి గలవారు. ఒక సందర్భములో క్రీస్తు ఆజ్ఞ మేరకు ఒక రాత్రిలో ఒక లక్ష ఎనబై అయిదు వేలమంది అపూరు సైనికుల్ని వారు హతమార్చారు. యుగయుగాల ఆకాంక్ష - 700 (1898)LDETel 169.6

  పరలోక సింహాసనము నుండి ఏ దేవ దూత పేతురును రక్షించెన్ అదే దేవదూత హేరోదుమీదకి కోపం మరియు తీర్పును తీసుకొనివచ్చేను.దేవదూత తనను నిద్రనుండి లేపుటకై పేతురును గట్టిగా కొట్టేను, అలాగే చెడ్డ రాజు యొక్క అహంకారం వదిలించుటకు మరియు సర్వశక్తిమంతుడైన దేవుని శిక్షను అతని మీదకు రప్పించుటకు అతన్ని కొట్టిన విధానము వేరు.దేవుని యొక్క తీర్పు ఫలితముగా హేరోదు మనస్సు మరియు శరీరము గొప్ప వేదనలో పడి మరణించాడు. -అపోస్తలుల కార్యములు .152 (1911).LDETel 169.7

  ఒక దేవదూత ఐగుప్తీయుల మొదటి సంతానాన్ని నాశనం చేసి ప్రజలను దుఃఖంలో ముంచగలిగాడు. ప్రజలను లెక్కించ దావీదు దేవుని కోపము రేపినప్పుడు దావీదు పాపానికి ప్రాయశ్చిత్తంగా ఒక దూత నాశనము కలిగించాడ. దేవుడు ఆజ్ఞాపించాగా పరిశుద్ధ దేవదూతలు కలిగించిన నాశనము వంటి నాశనాన్నే దేవుడు అనుంతించి నప్పుడు దుష్ట దేవదూతలు కలిగిస్తారు. నేడు అన్ని చోట్లా విధ్వంసాన్ని సృష్టించటానికి సిద్ధంగా ఉన్న శక్తులున్నాయి. అవి దేవుని అనుమతి కోసం వేచిన్నాయి. మహా సంఘర్షణ 614 (1911)LDETel 169.8

  మొదటి రెండు తెగుళ్ళు

  పరలోక గుడారములో తన విజ్ఞాపన సేవలను క్రీస్తు ముగించినప్పుడు, మృగానికి దాని ప్రతిమకు నమస్కారం చేసి ఆ ముద్రను పొందిన వారిపై వాక్యము చెబుతున్న ఉగత కుమ్మరించబడుతుంది. (ప్రకటన 14: 9, 10) ఇశ్రాయేలీయులను ఐగుప్తు చేర నుంచి విడిపించటానికి దేవుడు సిద్ధమవుతున్నప్పుడు ఆ దేశం మీదకి ఆయన పంపిన తెగుళ్ళ వంటివే దేవుడు ప్రజల చివరి విమోచనకు ముందు ప్రపంచంపై పడనున్న భయంకరమైన తీర్పులు అ భయంకర తెగుళ్ళను వర్ణిస్తు ప్రకటన గ్రందకర్త ఇలా అంటు న్నాడు. ఆక్రూరమృగము యొక్క ముద్ర గల వారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయువారికిని బాధకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను, సముద్రము పీనుగు రక్తము వంట్టిదాయను. అందువలన సముద్రములో ఉన్న జీవ జంతువులన్నియు చచ్చెను “[ప్రకటన 16: 2, 3] మహా సంఘర్షణ 627, 628 (1911).LDETel 170.1

  భూమి నివాసులపైన ఈ తెగుళ్ళు పడుతున్నాయి. కొందరు దేవుణ్ణి తిరస్కరించి, ఆయనను నిందించిరి. మరి కొందరు దేవుని ప్రజలు యొద్దకు వెళ్లి ఈ తీర్పులనుండి తప్పించుకో నుటకు ఏమీ చేయవలేనో మాకు తెలియజేయమని వారు బ్రతిమిలాడుకొనిరి. అయితే భక్తులు కేవలం పాపుల కొరకు చివరి కన్నీరు విడవబడినది, చివరిగా ఒక గంబీరమైన ప్రార్థన చేయబడినది, ఆమిరి బారం మెయబడినది, చివరి హెచ్చరికను ఇవ్వబడినది. ఎల్లి రైటింగ్స్ 281 (1858).LDETel 170.2

  మూడవ తెగులు

  యేసు క్రీస్తు గుడారపు సేవ పూర్తి అయ్యేక ఆ నాలుగు దేవదూతలు నాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనేను. ఆ తర్వాత ఏడు చివరి తెగుళ్ళు కుమ్మరింప బడును. ఈ తెగులు దుష్టలమీదకి వచ్చినప్పుడు వారు నీతిమంతులకు వ్యతిరేకంగా తిరగబడుదురు. మనమే వారి మీదని దేవుని తీర్పులను తీసుకు వచ్చామని వారు బావించేదరు మరియు వారు మనతో పాటు ఈ భూమి మీద తిరుగుతు ఉంటే అ తెగ్గుళ్లు ఇక ఆగవని, విశ్వాసులను చంపుటకు ఒక శాసనం ఏర్పాటు చేయబడెను, కనుక వారు రాత్రింబగళ్లు విలపించుటకు కారణమైనది.- ఎల్లీ రైటింగ్స్ 36, 37 (1851).LDETel 170.3

  నదులు.. జీవధారలు .. రక్తమాయెను .” ఈ శిక్షలు భయంకరమైనవి, దేవుని తీర్పులు న్యాయబద్ధమైనవనిపూర్తిగా నిరూపించబడింది. దేవుని దూత ఇలా అంటు న్నాడు: ప్రవిత్రుడా, పరిశుద్దుల రక్తమును ప్రవక్తలు రక్తమును వారు కార్చినందుకు తీర్పు నీవు వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే” (ప్రకటన 16: 2-6). దేవుని ప్రజలకు మరణాని ఖండిస్తూ, వారు ప్రాణాల్ని తమ సొంత చేతులతో తీసినంత దోషిత్వాన్ని వారు మూటకట్టుకొన్నారు. మహా సంఘర్షణ 628 (1911).LDETel 170.4

  నాల్గవ తెగులు

  ఆ తరువాత వచ్చిన తెగుళ్ళులో “అగ్నితో కాల్చుటకు సూర్యుడికి అదికారము ఇయ్యబడెను” కాని మనుష్యులు తీవ్రమైన వేడితో కాలిపోవుయారు ” (ప్రకటన 16: 8, 9) వచనాలు, ఈ భయంకరమైన సమయములో భూమి పరిస్థితిని ప్రవక్తలు ఈ విధంగా వివరించారు: పొలము పాడైపోయెను, భూమి అంగలార్చ చున్నది, దన్యము నశించెను ......తైల వృక్షములు వాడిపోయెను, మనుష్యుల సంతోష మేమియు లేకపోయెను “విత్తనం మంటి పెద్దలకింద కుళిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధన్యపు పోట్టువట్టిదాయెను....మేతలేక,పశువులు బహుగా మూల్గుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి మేతకు అల్లాడుచున్నవి... నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు సంబవిస్తూ ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును. ప్రతి స్థలముమందును అవి పారవెయబడును, ఊరకుండుడి.” యోవేలు లు 1: 10-12, 17-20; ఆమోసు 8: 3).ఈ తెగుళ్ళు సార్వత్రికమైనవి కావు, అలాగైతే భూని వాసులు పూర్తిగా నాశనమౌతరు . అయినప్పటికీ అ తెగుళ్లు మానవులు కనివిని ఎరుగని అతిభయంకర వ్యాధులుగా పరిణమిస్తాయి. మహా సంఘర్షణ 628, 629 (1911).LDETel 171.1

  అయుదవతెగులు

  జయ నినాదాలు, ఎగతాలి కేకలు, శాపనార్ధాలతో దుష్ట ప్రజలు సమూహాలు బాదత ప్రజల మీదికి త్రోసుకురావటానికి సిద్ధముగా వున్న తరుణములో రాత్రి చీకటి మించిన దట్టమైన చీకటి భూమండలాన్ని అవరిస్తుంది. అంతట దైవ సింహసనం నుండి లేచే మహిమతో ప్రకాశిస్తూ ఆకాశము ఈ కొస నుండి ఆ కొసవరకు విస్తరించిన ఇంద్రధనస్సు ప్రార్ధిస్తున్న దైవజనుల సమూహం చుట్టు చక్రంలా ఏర్పడుతుంది. దుష్ట సమూహాలు అర్ధాంతరంగా ఆగిపోతాయి. వారి ఎగతాలి కేకలు ఆగిపోతాయి.... తమ ఆగ్రహానికి కారణాన్ని మర్చిపోతారు ముప్పిరిగొన్న భయాందోళనలతో దేవుని నిబంధనకు గుర్తుగా ఉన్న ఇంద్రదనస్సు వంక తేరి చూస్తారు. దాని ప్రచండమైన ప్రకాశత నుంచి కాపుదల కోసం ఆకాక్షిస్తారు.....తన ప్రజల విడుదల విషయంలో దేవుడు తన శక్తిని మద్యరాత్రిలోLDETel 171.2

  ప్రదర్శిస్తాడు. సూర్యుడు తన శక్తి మేరకు ప్రకాశిస్తూ కనిపిస్తాడు. సూచనలు అద్భుతాలు ఒకదాని వెంట ఒకటి జరిగిపోతాయి. నీతిమంతులు తమ విడుదలలను సూచించే గుర్తుల్ని చూసి సంతోషిస్తుండగా ఆదృశ్యాన్ని చూసి దుష్టులు భయకంపితు లువుతారు. మహా సంఘర్షణ 635, 636 (19110)LDETel 171.3

  ఆకాశములో దేవుని ధర్మశాస్త్రం కనిపించుని

  అపుడు మడిచి వున్న రెండు రాతి పలకలను పట్టుకొన్న హస్తము ఆకాశములో కనిపిస్తుంది. ప్రవక్త ఇలా అంటున్నాడు ” దేవుడు తనే న్యాయ కర్తయైయున్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది (కీర్తన 50: 6).ఉరుములు అగ్ని మధ్య సీనాయి పర్వత శిఖరం నుండి జీవితానికి మార్గదర్శిగా ప్రకటితమైన దేవుని నీతి ఆయన పరిశుద్ద దర్మశాస్త్రం తీర్పుకు ముఖ్యశాసనమౌతుందని దేవుడు మనుషులకు ఇప్పుడు బయలుపర్చుతాడు. ఆ హస్తము రాతి పలకలను తెరుస్తుంది. వాటి మీద పది ఆజ్ఞలుంటాయి. అవి అగ్ని కలముతో దిద్దినట్లు వుంటాయి. ఆ మాటలు అందరూ చదవ గలిగినంత స్పష్టంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి మేల్కోంటుంది. మూఢనమ్మకం తప్పుడు సిద్దాంతల చీకటి విడిపోతాయి. దేవుని పది మాటలు క్లుప్తంగా, వివరంగా, ఆదికారికంగా భూనివాసులందరి దృష్టికి వస్తాయి. మహా సంఘర్షణ 639 (1911) .LDETel 172.1

  రక్షణ కొల్పయినవారు అబద్ధ కాపరులు ఖండించేదరు

  సంపు సభ్యులు ఎవరైనప్పటికి వారు సత్యము ఇదే అని తెలుసుకోనప్పుడు వారు చేసిన అపరాధములు ఒప్పుకుంటారు. అయితే వారు ఆత్మలను రక్షణకై ఏ కాపరినైతే నమ్ముకొనియున్నారో అంత వృధ అయునదని వారి అపరాదములకు మూల్యము చెల్లించేది మరేవ్వరు లేరు అనీ విషయము దేవుని యొక్క రాకడ దినమందు తెలుసుకుంటారు. అప్పుడు నేను రక్షణ పోగొట్టుకున్నాను, నేను నిత్యత్వమును కోల్పోయాను” అని గొప్ప వేదనతో ఓదార్చలేని మిక్కిలి బాధత రోధన వినబడుతుంది, సత్యాన్ని దాచిపెట్టి అబద్దాలను బోధించిన కాపరులను, తున తనాకలుగా చీల్చివేయాలని మనుష్యులు వారి అవేదనను వ్యక్తము చేయుదురు. -ది ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 4: 1157 (1900).LDETel 172.2

  అందరూ కలిసి తమ తమ బోధకుల్ని తీవ్రంగా ఖండిస్తారు. తప్పుడు పాదుర్లు అంతా సంవ్యంగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. దైవ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించటానికి పరిశుద్ధంగా ఆచరించే ప్రజలను హింసించటానికి ఆ పాదుర్లు వారిని నడిపించారు. ఇప్పుడు, ఈ బోధకులు తాము చేలిన మోసన్ని ప్రపంచం ముందు అంగీకరిస్తారు. ప్రజలు కోపోద్రిక్తులవుతారు మేను నశించిపోతున్నాము, మా నాశనానికి మీరే కారణం! అంటు అబద్ద కాపరులపై తిరుగబడతారు. ఒకప్పుడు తమను ఎంతో అభిమానించిన ప్రజలే వారిపై అత్యంత భయంకరమైన శాపములు పెడతారు. ఒకప్పుడు కీర్తి కిరీటం పెట్టటానికి ఎత్తిన చేతులే అప్పుడు వారిని మొత్తటానికి పైకిలేస్తాయి. దేవుని ప్రజలను చంపటానికి ఏర్పటైన కత్తులు వారి శత్రువులను నాశనం చేయడానికి ఇప్పుడు ఉపయోగపడుచున్నవి .ఎటు చూచిన పోరాటమే, ఎటు చూచిన రక్తపాతమే - మహా సంఘర్షణ 655, 656 (1911)LDETel 172.3

  ఇక్కడ సంఘాన్ని చూస్తున్నాము- అదే దేవుని యొక్క పరిశుద్ధాలయము ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత్త అఘాతం మొట్ట మొదటిగా ఎదుర్కొన్నది. (యెహెజ్కేలు 9.6) పూర్వీకులైన దేవుని ప్రజలకు , అయన అనుగ్రహించు గొప్ప సత్యమును పొందుకొనిన వీరు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కొరకు ప్రజలకు సంరక్షకులుగా నిలబడ వలసిన వారే ఆయన నమ్మకాన్ని ఒమ్మి చేసినారు. [5] సంఘమునకు ఉపదేశములు 5: 211 (1882).LDETel 173.1

  తప్పుడు బోదకులు చేత దేవుని వాక్యము ప్రభావం చూపించబడదు....వారు చేసిన పనికి అతి త్వరలో వారి మీదకే తిరుగుబాటు రానైయునది. అప్పుడు దేవుని తీర్పులు మర్మమైన బబులోను మీద వస్తాయని ప్రకటన 18 లో వివరించిన దృశ్యాలే సాక్షముగా ఉన్నది. సంఘమునకు ఉపదేశములు. - ఎమ్ ఎస్ 60, 1900.LDETel 173.2

  ఆరవ తెగులు

  ఆ దురాత్మలు ప్రపంచంలోని రాజులను మోసగించి దేవుని ప్రభుత్వానికి వ్యతిరేక ముగా సాతానుతో కలసి పోరాటానికి వారిని సంకుచిత పర్చటానికి బయలుదేరాయిమహా సంఘర్షణ. 624 (1911).LDETel 173.3

  దేవుని ఆత్మ క్రమంగా ఈ లోకము నుండి ఉపసంహరించుకుంటున్నాడు. సర్వశక్తి మంతుడైన దేవుని రాకడ దినమున పోరాడుటకు సాతాను “భూమిమీదను మరియు, సర్వలోకములోనున్న రాజుల యెద్దకు వెళ్లివారిని ప్రోగుచేసి తనపక్షను చేరి రానైయున్న దేవుని దినమందు పోరాడుటకు వారికి శిక్షణ ఇచ్చును. (ప్రకటన 16 : 14] .- ది ఎస్ డిఏ బైబిల్ కామెంటరీ 7: 983 (1890).LDETel 173.4

  ఇక అద్బుతం శక్తి కార్యము జరగనైయున్నది అది అంతిమ మహా పోరాటమునకు ప్రపంచమంత కలసిరావలసియున్నదని, ప్రకటన 16 లో యోహాను వివరణ ఇచ్చిన తరువాత, చిహ్నాలు పడవేయబడుచున్నవి మరియు మరో సారి బూర ద్వనిస్తుంది: ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరిచుచున్నందున జనులు తమ దిసమొలను చూతురేమో అని మెలకవుగా ఉండి తమ వస్తము కాపాడుకొనువాడు ధన్యుడు. (ప్రకటన16: 15] ఆదాము మరియు హవ్వలు అతిక్రమము చేసిన తరువాత వారు దిగంబరులుగా వున్నారు. ఎందుకంటే వెలుగు మరియు భద్రత అనే వస్త్రం వారి నుండి వెళ్లిపోయునది.. అలాగే నోవహు కాలములోను జీవించిన ప్రజలవలేను మరియు సొదొమలో నివసించిన ప్రజలవలెను ప్రస్తుత ప్రపంచంలోని నివసించేవారు కూడా ఇవ్వబడిన ఆదేశములను మరియు హెచ్చరికలు మర్చి పోయారు. వారు తమ పదకములను, దుర్మార్గపు ఆవిష్కరణలతో నిద్రనుండి లేస్తారు, అయితే హఠాత్తుగా అగ్ని పరలోకం నుండి దిగి వస్తుంది, దేవుని ఎరగని ప్రజలను ధహించువేస్తుంది. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును” (లూకా 17:30] .- 14 ఎమ్ ఆర్ 96, 97 (1896).LDETel 173.5

  మంచి, చెడు మధ్య ఆఖరిపోరాటం.

  అంతిమ మహా పోరాటములో రెండు గొప్ప ప్రత్యర్థి శక్తులు బయటపడతాయి. ఆకాశము భూమిని సృష్టించిన సృష్టకర్త ఇచ్చిన ఆజ్ఞలకు విధేయులై ఆయన ముద్ర కలిగినవారు ఒకవైపు వుండగా.మరో వైపు చీకటి ప్రపంచమునకు రాజైన సాతనుతో పాటు తిరుగుబాటుచేసి మతభ్రష్టత్వానికి కారకులైనవారు ఉంటారు. ది ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 7: 982, 983 (1901).మన ముందు భయంకరమైన సంఘర్షణ ఉంది. మనము సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క రాకడ దినమున జరిగే పోరాటమునకు సమీపిస్తున్నాము. నియంత్రణలో ఉంచబడినది విడిచిపెట్టుటకు సిద్ధముగావున్నది. కరుణగల దేవదూత ఈ ప్రపంచమును సాతాను యొక్క నియంత్రణకు వదిలివేసి, రెక్కలను ముడుచుకొని సింహాసనం నుండి క్రిందకి దిగివచ్చుటకు సిద్ధపడుచున్నాడు. భూలోక రాజ్యాలు మరియు శక్తులు పరలోకమందున్న దేవునికి అతి క్రూరముగా వ్యతిరేకించి తిరుగబడి యున్నారు. ఆయనను సేవిస్తున్న వారిపై ద్వేషముతో నిండి యున్నారు, ఇక అతి త్వరలోనే మంచి, చెడుల మధ్య అంతిమ మహా సంగమము ఎదుర్కుంటారు.ఈ భూమి యుద్ధరంగముగా మారును, ఎక్కడైతే సాతానుడు దేవునికి వ్యతిరేకంగా మనుష్యులను నడిపించియున్నాడో, ఇక్కడే తుది పోరాటములో ఆఖరి విజయ సంఘటనలు జరుగును. తిరుగుబాటు ఇక ఎప్పటికి అణిచివేయబడును. ది.. రివ్యూ అండ్, హెరాల్డ్, మే 13, 1902.LDETel 174.1

  ఈ రెండు సైన్యాల మధ్య జరిగే పోరాటం ఈలోకంలోని సైన్యం మధ్య జరిగే యుద్ధంతో వాస్తవం. ఈ అధ్యాత్మిక సంఘర్షణ అంశాలపై నిత్యజీవానికి సంబంధించిన భవిష్యత్తులు ఆనుకొని ఉన్నాయి. రాజులు - ప్రవక్తలు176 (c. 1914).LDETel 174.2

  ప్రపంచమంత ఒక ప్రక్కన లేదా వరోప్రక్కన వుంటుంది

  ప్రపంచమంతా ఒక వైపున ఉంటారు లేదా ఇతరులు ప్రశ్నార్ధకముగా వుంటారు. హార్ మెగినను యుద్ధము ముందుంది. ఆ రోజు మనలో ఎవరూ నిద్రపోకూడదు. బుద్ధిగల కన్యకవలే మన దివిటీలలో తైలము వండవలెను. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మన మీద ఉండాలి మరియు సైన్యములకధిపతి అయున మన ప్రభువు పరలోక సైన్య మైన దూతలు ముందుండి యుద్ధము నడిపించును,సెలేన్టేడ్ మెసెన్స్ 3:426 (1890).LDETel 174.3

  సాతాను తన ఆఖరి తిరుగుబాటు కార్యములో తన దుష్ట శక్తుల సైన్యాన్ని యుద్దానికి సమాకూర్చుకొలది అతడు మంచిని వ్యతిరేకించే కొలది శత్రుత్వం మరింత బయలుపర్చబడుతుంది. మరియు దేవునికి పూర్తిగా సమర్పించుకొననివారు దైవిక శక్తితో వేరుచేయబడతారు. వారు సాతానుతో సంబంధము కలుపుకొని పరలోకానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పటుచేసుకొని, విశ్వా పాలకుడైన దేవునితో యుద్ధం చేయుటకు సన్నద్దులగుదురు.- టెస్టమోనీస్ టూ మినిష్టర్స్, అండ్ గాస్పాల్ వర్కర్స్, 465 (1892).LDETel 174.4

  త్వరలోనే భూనివాసులందరూ ఎవరు పక్షము వారు ఎంచుకుంటారు పరలోక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదా అనుకూలముగానే ఉంటారు . సంఘమునకు ఉపదేశములు. 7: 141 (1902)LDETel 175.1

  ఏడవ తెగులు

  [ప్రకటన 16: 17-21] లో వున్న ఏడవ పాత్రను గూర్చి మనము అధ్యయనం చేయవలసియుంది. దుష్ట శక్తులు వేదనలు అనుభవించకుండా పోరాటం జరగదు. అయితే హార్ మెగిట్టేనను యుద్ధం కూడ సంరక్షించుటం ఒక బాగమైయున్నది. ప్రకటన 18వ అద్యయము ప్రాకరము దేవదూత యొక్క మహిమతో భూమి ప్రకాశింపజేసి నప్పుడు మతపరమైన మంచి, చెడులు గల అంశాలు నిద్ర నుండి మేల్కోంటాయి, అప్పుడు సజీవుడైన దేవుని యొక్క సైన్యము యుద్ధరంగములో నిలువబడును. ది ఎస్ డి ఏ . బైబిల్ కా మెంటరీ 7: 983 (1899).LDETel 175.2

  హార్ మెగాద్గాఢనను యుద్ధం ఇక అతి త్వరలోనే జరగనైయున్నది. రాజుల రాజు మరియు ప్రభువులకు ప్రభువు అను నామము ఆయన వస్త్రం మీద వ్రాయబడినవారు పరలోకమందున్న సేనలు శుద్ధి అయిన తెల్లని నార బట్టలు దరించుకొని తెల్ల గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించెదరు. [ ప్రకటన 19: 11-16] .- ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 7: 982 (1899).LDETel 175.3

  భూమి ఉపరితలం బద్దలవుతుంది. భూమి పునాదులే కూలిపోతున్నట్లు కనిపిస్తుంది. పర్వత శ్రేణులు దిగబడిపోతాయి. జనులు నివసిస్తున్న ద్వీపాలు అదృశ్యమవుతాయి. దుర్మార్గతలో సొదొమలా ఉన్న ఓడరేవులు జలసమాదులవుతాయి ..... లోకములోని ప్రఖ్యాత నగరాలు కుప్పకూలిపోతాయి. తమ వ్యక్తిగత ప్రభావాన్ని చాటుకోవటానికి ప్రఖాత ప్రజాపాలకులు నిర్మంచుకొన్న రాజభవనాలు తమ కళ్ళ ముందే కూలిపోతాయి. జైలు గోడలు బద్దలవుతాయి. తమ నిమిత్తము ఖైదు పాలైన దైవ ప్రజలు విడుదల పొందుతారు.- మహా సంఘర్షణ 637 (1911).LDETel 175.4