Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  19 అధ్యాయము - క్రీస్తు తిరిగివచ్చుట

  ఏడవ తెగులు మరియు ప్రత్యేక పునరుత్థానం

  గొప్ప భూకంపము సంభవిస్తుంది మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకుని అట్టి మహా భూకంపము కలుగలేదు (ప్రకటన 16:17,18) అంతరిక్షము తెరుచుకున్నట్లు మూసుకొన్నట్లు కనిపిస్తుంది. దైవ సింహాసనము నుండి ప్రకాశించే మహిమ వాటిలో నుండి మెరుపులా ప్రకాశిస్తున్నట్లు కనిపిస్తుంది. గాలికి రెల్లు ఊగినట్లు పర్వతాలు ఉగుతాయి. బండలు అన్ని ప్రక్కలా చెదురు పడి వుంటాయి. సముద్ర తరంగాలు లేచిపడేటట్టు భూమియావత్తు లేచి పడుతుంది. భూమి ఉపరితలం బద్దలవుతాయి, భూమి పునాదులే కూలిపోతున్నట్లు కనిపిస్తుంది, పర్వత శ్రేణులు దిగబడిపోతాయి. జనులు నివసిస్తున్న ద్వీపాలు మాయమౌతాయి.దుర్మార్గతలో సొదమలా వున్న ఓడరేవులు జలసమాధులవుతాయి. తన ఉగ్రత పాత్రలో మద్యాన్ని దానికివ్వడానికి మహాబబులోనును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అయిదేసి మణుగుల బరువుగల పెద్ద వడగండ్లు గొప్ప విద్వంసాన్ని కలిగిస్తాయి.19,21 వచనాలు సమాధులు తెరుచు కుంటాయి. సమాదులలో నిద్రించిన అనేకులు మేలుకొందురు కొందరు నిత్యజీ వవము అనుభవించుటకు, కొందరు నిందపాలగుటకు నిత్యముగా హేయమగుటకును మేలుకొందురు, దానియేలు 12: 2 మూడవదూత వర్తమానాన్ని విశ్వసించి మరణించిన వారందరూ దేవుడు తన ధర్మశాస్త్రమును ఆచరించిన వారితో చేసే సమాదాన నిబందనను వినటానికిగాను మహిమ శరీరులై సమాదుల్లో నుండి బయటకివస్తారు, ఆయనను పొడిచినవారు ,ప్రకటన1:7 మరణవేదనలో ఉన్నప్పుడు ఆయనను ఎగతాళి చేసి కించపరిచినవారు, ఆయన సత్యాన్ని అనుసరించినవారిని తీవ్రంగా వ్యతిరే కించివారు, ఆయన ప్రభావాన్ని చూడటానికి ఆయనకు విదేయులై నడుచుకొన్న జనులుకు ఆయన చూపే గౌరవన్ని చూడటానికి పునరుత్థానులవుతారు. మహా సంఘర్షణ ,636, 637 (1911).LDETel 189.1

  క్రీస్తు రాబోయే సమయాన్ని దేవుడు ప్రకటించును

  మందమైన నల్లని దట్టమైన మేఘాలు పరస్పరముగా ఒకొక్కటి బలముగా డికొంటుండగా వాతావరణం అంతలోనే మారిపోయునది అ తర్వాత వెంటనే వెనక్కి వెళ్లిపోయినప్పుడు మనము స్పష్టముగా, మృగశిర (నక్షత్రం వరకు) విశాలమైన విశ్వమును చుడవచ్చు, అక్కడ నుండి దేవుని స్వరం వినిపించుచున్నది. ఎర్లీ రైటింగ్స్ 41 (1851).LDETel 189.2

  మనము త్వరలోనే దేవుని యొక్క స్వరము వింటాము (క్రీస్తు రాకడకు ముందు గానే దేవుని స్వరం పదే పదే వినిపించింది. మహా సంఘర్షణ 632, 633, 636, 638, 640, 641 చూడండి.) క్రీస్తు రాకడ దినము విస్తార జలాల ధ్వని వంటిదై ఆ గడియ వుంటుంది.సజీవులైన భక్తులు 144,000,మంది ఆ స్వరమును ఎరుగుదురు మరియు అర్థం చేసుకుందురు, అయితే దుష్టలు అది ఉరుము మరియు భూకంపం అనుకొందురు. - ఎర్లీ రైటింగ్స్ 15 (1851).LDETel 189.3

  క్రీస్తు రాకడ దినము మరియు గడియను గూర్చి మరియు తన ప్రజలకు సత్య నిబందన విడుదలను గూర్చి పరలోకం నుండి దేవుడు ప్రకటించడం వినిపిస్తుంది ఆయన ఒక మాట పలకగానే ఆ పలుకులు భూమి అందంతట వ్యాపించెను. ఇశ్రాయేలు దేవుడు నిలువబడి నప్పుడు వారు కన్నులు పైకెత్తి తేరిచూచిరి. యెహోవా నోటి నుండి వచ్చిన పలుకులు వారు వింటున్నారు, ఆ మాటలు భూమి అందంతట గొప్ప ఉరుములు శబ్దముతో ప్రతి ద్వనించెను ఇది ఎంతో అమోగమైనది, ఆయన మాటలాడిన ప్రతి మాటకు నీతిమంతులు ఘనత మహిమ ప్రభావములు నీకే ! హల్లెలుయ! ” అని వారు గంబీర స్వరముతో పలికిరి. సీనాయి పర్వతము నుండి దిగివచ్చిన మోషే ముఖం మహిమతో ప్రకాశించినట్లు వారి ముఖములు దేవుని మహిమతో నిండిపోయాయి, మహిమతో నిండిన వారిని చూచుటకు దుష్టులువారు ముఖములు పైకెత్తలేకపోయిరి. ఆయన పవిత్ర దినమైన సబ్బాతు పరిపూర్ణముగా అచరించి దేవుణ్ణి గౌరవించిన వారిపై ఎప్పటికి అంతము కాని ఆశీర్వాదము కుమ్మరించబడెను, అంతట మృగము మరియు అతని ప్రతిమ పైన జయం, బ్రహ్మాండమైన విజయనాధం పైకి లేస్తుంది. - ఎర్లీ రైటింగ్స్ 285, 286 (1858).LDETel 190.1

  దేవుని యొక్క స్వరంతో మాట్లాడిన సమయానికి నాకు అంతగా అవగాహన లేదు. ప్రకటించిన గడియ నేను విన్నాను, కాని నేను దర్శనములో నుండి వచ్చిన తర్వాత ఆ గడియ నాకు జ్ఞాపకం లేదు. అలాంటి ఉత్కంఠభరితమైన, గంబీరమైన ఆసక్తిని రేకెత్తించే దర్శనాన్ని ఏ భాషలోనూ వివరించడానికి సరిపోదు.. ఎందుకంటే ఈ దర్శనం దగ్గరగా ఉండుట వలన గొప్ప తెల్లని మేఘము మీద మనుష్యకుమారుని కూర్చున్న దృశ్యము కనిపించుచున్నది. అది నాకు ఎంతో సజీవమైన వాస్తవం.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 1:76 (1888)LDETel 190.2

  తప్పిపోయునవారికి అత్యంత భయము

  ప్రభువు దినము వచ్చినప్పుడు , తాగుబోతు తూలినట్టు భూమి ఇటు అటు తిరుగుతుంది. మరియు ఆకాశం వణుకుతున్నప్పుడు ఎవరు ఆయన ఎదుట నిలువగలరు? వారు భయముతో వణుకుతున్న సమయములో వారు తప్పించు కోవడానికి ప్రయత్నిస్తారు. “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రం ఆయనను చూచును ” (ప్రకటన1: 7). రక్షణ పొందని వారు ఇంత వరక దేవుడుగా కొలిచిన అ మూగబోయిన అప్రకృతిని చూచి భయంకరమైన శాపవచనాలు పలికెదరు. పర్వతాలు మరియు కొండలు మాపై పడుముని మరియు సింహాసనంపై కూర్చొని వాని ముఖమును చూడకుండ దాచుమని వేడుకొందురు) (ప్రకటన 6:16) -దాట్ ఐ మే నీ హింమ్. 356 (1896).LDETel 190.3

  తన ప్రజల చెర దేవుని స్వరముతో విడిపోయినప్పుడు జీవిత సంఘర్షణలో సర్వస్వాన్ని కోల్పోయిన వారికి గొప్ప మేల్కొలుపు కలుగుతుంది...... జీవితకాలమంతా కూడబెట్టినదంత క్షణములో మాయమౌతుంది. తాను కోల్పోయిన వెండి బంగారాలు కోసం విలపిస్తారు..... దుష్టులలో సంతాపము కనిపిస్తుంది. ఆది దేవుని నిర్లక్ష్యం చేసినందుకు గాను తోటి మానవులను లక్ష్యపెట్టనందుకుగానికాదు. దేవుడు గెలిచినందుకు కలిగిన పలితము గురించి సంతాపడుతారు. కాని తమ దుర్మాగతను గురించి సంతాపపడరు. జయము సాదించాడానికి ఏ నూతన మార్గమైనా అవలంబించ టానికి వెనుకాడరు, తెగులు, భూకంపం సంభవించినప్పుడు తాను ఏ వర్గం ప్రజల్ని ఎగతాళిచేసి దూషించి నిర్మలించగోరింది. ఆ ప్రజలకు ఏ హాని కలగకపోవటం లోకం చూస్తుంది. -మహా సంఘర్షణ ,654 (1911).LDETel 191.1

  యేసు మహిమా ప్రభవముతో అరుదెంచును

  కొద్ది సేపటిలో తూర్పున మనషి చేతిలో సగం పరిమాణం గల నల్లని మేఘం కనిపిస్తుంది. అది రక్షకిని ఆవరించి దూరానికి చీకటితో నిండినట్లు కనిపించే మేఘం. అది దైవ కుమారుని సూచనగా దేవుని ప్రజలకు తెలుసు. అది భూమిని సమీపిస్తుండగా వారు నిశబ్దంగా దాని వంక చూస్తూవుంటారు. దగ్గరకు వచ్చే కొద్ది ఆ మేఘం తేజోవంతమౌతూ చివరికి బ్రహ్మండమైన తెల్లని మేఘమౌతుంది. దాని పై నిబంధన సంకేతమైన ఇంద్రదనుస్సు ఉంటుంది. దాని పై ఆసీనుడై యేసు సర్వశక్తిగల విజేతగా వస్తాడు.... అసంఖ్యాకమైన పరిశుద్ధ దూతల సమూహము పరలోక మధుర గీతాలాపనతో ఆయనకు సేవలు చేస్తు ఆయన వెంట వస్తారు వేవేలకొలది -- కోట్ల కొలది దూతలతో అంతరిక్షం నిండినట్లు కనిపిస్తుంది. ఆ సన్నివేశాన్ని ఏ మానవుడు వర్ణంచ లేడు. ఆ వైభవాన్ని ఏ మానవుడు అవగతం చేసుకోలేడు......అగ్ని జ్వాలలు ఆవరించి వున్న మేఘం మీద రారాజు క్రీస్తు దిగివస్తాడు. ఆకాశం కాగితం చుట్టలా ముడుచుకు పోతుంది. భూమి అయన ముందర వణుకుతుంది పర్వతాలు ద్వీపాలు వాటి స్థానాలు తప్పుతాయి.-మహా సంఘర్షణ,, 640-642 (1911). LDETel 191.2

  ఆయనను పొడిచినవారి యొక్క స్పందన

  క్రీస్తును తిరస్కరించి మరియు ఆయనను శిలువ వేయడంలో అత్యంత ప్రాముఖ్యమైన పాత్ర పోషించిన వారు ఆయనను చూడడానికి ముందుకు వస్తారు, మరియు భక్తులు క్రీస్తుని మహిమపరుచటం ఆయనను దిక్కరించిన వారు చూస్తారు, ఆ సమయంలో భక్తులు ఒక క్షణంలో రెప్పపాటున మార్పుచెందెదరు మరియు వారు ఆకాశ మేపూలలో ప్రభువును కలుసుకొనుటకు పైకి ఎత్తబడుదురు. ఊదారంగు వస్త్రం ఆయన మీద కప్పిన వారు, అతని నుదుటి మీద ముండ్ల కిరీటాన్ని పెట్టిన వారు, మరియు అతని చేతులలో మరియు పాదాలలోను మేకులు దిగగొట్టిన వారు ఆయన వైపు చుచి దుఃఖించెదరు. .- మాన్యుస్క్రిప్ట్ రిలీజ్. 9: 252 (1886).LDETel 191.3

  అతని ప్రేమను ఎలాగ అగౌరపరిచారో మరియు ఆయన కరుణకు ఎలా దుర్భాషలాడారో వారు జ్ఞాపకం చేసుకొన్నారు ఆయనను తృణీకరించి ఒక హంతకుడై - బందిపోటు దొంగ బరబ్బా అతని స్థానంలో ఎన్నుకోవటం, యేసు తలపై ముళ్ళు కిరీటం పెట్టడం మరియు కొరడా దెబ్బలు కొట్టించడం మరియు ఆయన సిలువ వేయడం మరియు ఆయన సిలువపై వేదనల సమయంలో యాజకులు మరియు మతాదీ కారులు, ఆయనను చూచి శిలువ నుండి దిగిరా అప్పుడు మేము నిన్ను నమ్ముతాము. తనను తానే రక్షించుకోనలేడు ఇతరులను ఎలా రక్షిస్తాడు అని అపహాసం చేయుడం, వారు ఆలోచించారు. క్రీస్తుకు అపనిందలు మరియు అవమానం కలిగించడం, మరియు అతని శిష్యులకు బాధలన్నీ కలిగించడం, సాతాను యొక్క ఘోర కృత్యలే అని వారు చేసిన పనులన్ని స్పష్టంగా జ్ఞాపకముకు తెచ్చు కొన్నారు. ఆయన విజ్ఞాపనతో వేడుకొన్నది మరియు ఆయన తరుచుగా బోదించిన కమ్మిని స్వరము, వారి చెవులలో మరల మరల ధ్వనిస్తునేవుంది. రక్షకుడిగా సమాజమందిరములోను మరియు వీదిలోను మదుర స్వరముతో దయతో ప్రార్థించి నప్పుడు మరియు ఆయన మాట్లా డినవ ప్రతి మాట వారి చెవులలో రింగుగున మ్రోగుచున్నది. అప్పుడు ఆయనను పోడిచిన వారు కొండలతోను మరియు పర్వతా లతోను మామీద పడము సింహాసనం మీద కూర్చుని యున్న వాని ముఖం నుండియు మరియు గొట్టెపిల్ల ఉగ్రత నుండియ మమ్మును దాచమని బ్రతిమిలాడెదరు.- లెటర్ 131, 1900.LDETel 192.1

  నిద్రించువారు మెల్కోని లేచెదరు. !LDETel 192.2

  మేషూలు చుట్టబడినట్టు వెనక్కి చుట్టబడుచున్నవి, మరియు ప్రకాశవంతమైన వెలుగులో మనుష్యకుమారుడు యొక్క సూచన స్పష్టంగా కనిపించుచున్నది. ఆ మేషం అంటే ఏమిటో దేవుని బిడ్డలకు తెలుసు. మరియు సంగీతం ద్వనించుచు అది సమీపిస్తుండగా, సమాదులు తెరవబడెను చనిపోయివారు లేచేదరు.-మాన్యుస్కిప్ట్ రిలీజ్ 9: 251, 252 (1886).LDETel 192.3

  దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాదులలో నున్న వారు ఆయన శబ్దము విందురు [యోహాను 5:28, 29].లోకములో ఎందరైతే నింద్రించియున్నారో వారందరికి ఈ శబ్దము ఎంతో వేగముగా ప్రతిధ్వనిస్తుంది. మరియు యేసులో నిద్రిస్తున్న ప్రతి పరిశుద్దుడు మేలుకొని మరణ బందీ గృహము నుండి బయటకొచ్చేదరు.- ఎమ్ ఎస్, 137, 1897.LDETel 192.4

  ఆదాము మొదలుకొని మరణించిన తన చివరి భక్తుడు వరకూ ప్రశస్తమైన తమ మృతులు దైవ కుమారుని స్వరము వింటారు. యుగయుగాల ఆకాంక్ష - 606 (1898).LDETel 192.5

  భూమి తిరగడముతోపాటు మెరుపులు ఉరుములు మధ్య దైవ కుమారుని స్వరం సమాదుల్లో నిద్రిస్తున్న భక్తుల్ని పిలుస్తుంది. నీతిమంతుల సమాధుల వంక చూస్తు ఆకాశము వైపు చేతులెత్తి, మంటిలో నిద్రస్తున్న వారులార మేల్కోండి లేవండి , అని ఆయన కేకవేస్తాడు. భూమండలం అంతట చెదరి ఉన్న మృతులు ఆ స్వరం వింటారు. విన్న వారందరు బ్రతుకుతారు. ప్రతీ ప్రజలు నుండి ప్రతీ వంశం నుండి , ఆయాబాషలు మాట్లాడే వారి నుండి ప్రతీ ప్రజల నుండి గొప్ప జనసమూహాలు బయలుదేరగా వారి పాదాల సవ్వడితో భూమి మారుమ్రోగుతుంది. అమరత్వ మహిమ ధరించి వారు మరణబందిగృహం నుంచి బైటకువస్తారు. ఇలాకేకలు వేస్తారు, మరణమా, నీ విజయ మెక్కడా? ఓమరణమా నీ ముల్లేక్కడ?“1 కొరిందీ 15, 53. జీవించి ఉన్న నీతిమంతులు సమాదులనుంచి లేచిన భక్తులు గళం కలిపి ఆనందముతో విజయగీతము పాడేదరు.మహా సంఘర్షణ, 644 (1911)LDETel 193.1

  గుహలు మరియు దాగుడు స్థలము మరియు చెఱసాలనుండి

  రక్షణ స్థలముగావున్న పర్వతాలలో,భూమిలోవున్న గుహలలో మరియు దాగుడు స్థలములో, రక్షకుని తన ఉనికిని మరియు అతని మహిమను వెల్లడిస్తాడు. కొద్ది సేపటికి, రాబోయేవాడు వస్తాడు. వారి పేర్లు గొట్టెపిల్ల యొక్క జీవపు గందములో వ్రాయబడ్డాయి కాబట్టి అగ్ని జ్వాలల వంటి ఆయన కళ్ళు మూసివేయబడిన భూగర్భములోనికి చొచ్చుకొని పోయి దాగిన వారిని సహితం వేటాడతాయి. ఎందుకంటే రక్షకుడు యొక్క కళ్ళు మన పైన, మాన చుట్టూ ఉన్నాయి, ప్రతి కష్టమును గుర్తించెను, ప్రతి ప్రమాదాన్ని తెలుసుకొనేను; మరియు ఆయన దృష్టి వెళ్లలేని చోటుగాని, ప్రజల కషాలనుగాని, దుఃఖ బాధలను తీర్చ లేనిది కాదు, క్రీసు దయ అందనిదంటు ఏదీ లేదు... యేసు క్రీస్తు యొక్క మహోన్నతమైన మహిమను చూచి దేవుని బిడ్డలు మొదటి సారి భయభ్రాంతులయ్యారు. అతను పరిశుద్ధ సమక్షంలో జీవించలేనని అతను భావిస్తాడు. కాని ప్రభువు “భయపడవద్దు యోహానుతో పలికిన మాటలు అతనికి వినిపిస్తాయి, ” యేసు యోహానుపై తన కుడిచేతిని ఉంచాడు. నేలపై సాష్టంగపడిన అతనిని పైకి లేపాడు. ఆయన తన విశ్వసనీయులైన నమ్మదగినవారికి కూడా చేస్తాడు.. దాట్ ఐ మే నో హిమ్, 360, 361 (1886).LDETel 193.2

  దేవుని వారసులు పందుళ్లలో నుండి, మురికి ఇళ్ల పంచల నుండి చీకటి కోట్ల నుండి, ఉరికంబాల నుండి, పర్వతాల నుండి, అడవుల నుంచి, గుహలనుండి సముద్రపు సోరంగాల నుండి వస్తారు. మహా సంఘర్షణ, 650 (1911).LDETel 193.3

  సముద్రపు లోతుల్లో మరియు స్వరంగములో మరియు పర్వతాలు నుండి.

  కడ భూర మ్రోగినప్పుడు, విశ్వాసులు యొద్దకు క్రీస్తు మరియు ఆయనతో వున్న సమూహముతో కలసి వచ్చును మరియు భూమి అంతట అత్యున్నతమైన పర్వతాల శిఖరాల నుండి,లోతైన గనులలో ఏకాంతస్థలము వరకు, ఆ శబ్దం విందురు. చనిపోయిన నీతిమంతులు కడబూర శబ్దము వినినప్పుడు వారి సమాధుల నుండి బయటికి వస్తారు, అమరత్వం దరించుకొని వారి ప్రభువును కలసికొందురు. ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 909 (1904).LDETel 193.4

  భూమి యొక్క అన్ని ప్రాంతముల నుండి, రాతి గుహల నుండి, నేలక్రింద నుండి చెరసాల నుండి, భూమి యొక్క గుహల నుండి, లోతైన నీళ్ల నుండి వచ్చిన నీతముంత లందరు పునరుత్థానము పొందెదరు వారిని చూచి నేను మిగుల సంత హించితిని. ఎవ్వరిని చూడకుండ ఆయన విడచిపెట్టలేదు, ప్రతివాడు ఆయన స్వరము వినవలెను. వారు జయ జయ ద్వనులతో మరియు ఘన విజయంతో ముందుకు వస్తారు.- లెటర్స్ 113,1886LDETel 194.1

  అహో ఏమీటి ఈ దృశ్యం అచ్చం ఈ పర్వతాలు మరియు కొండలు (స్విటర్లాండ్ వున్నటుంది] ప్రాణదాతైన క్రీస్తు చనిపోయినవారిని పిలవబడుతున్నప్పుడు ఏ దృశ్యం అలా ఉంటుంది! వారు గుహలు మరియు చెరసాల నుండి, ,ఎక్కడైయుత వారి మృత దేహాలు పూడ్చిపెట్టారో ఆ లోతైన బావులు నుండి వస్తారు. - లెటర్ 97, 1886.LDETel 194.2

  దుష్టలు చంపబడుదురు

  రెచ్చిపోయిన తమ పిచ్చి ఉద్రేకాలతోను దేవుని ప్రచండమైన ఉగ్రత కుమ్మరింపు తోను జరిగే పోరాటంలో లోకంలోని దుర్మార్గులు- యాజకులు, పరిపాలకులు, ప్రజలు, దనికులు, దరిద్రులు, అదికులు, అధములు అందరూ నేల కూలతారు, ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క యీదిశ నుండి ఆ దిశవరకు కనబడదురు ఎవరును వారిని గూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు యిర్మియా 25,33. యేసు రాకడ సమయములో దుష్టులు ఇక భూమిమీద లేకుండా సర్వనాశనమౌతారు. ఆయన నోటి ఊపిరివల్ల ఆయన మహిమ ప్రకాశమౌతారు. క్రీస్తు తన ప్రజల్ని దేవుని పట్టణానికి తీసుకువెళ్తాడు. ఇక భూమిమీద మనుషులుండరు. యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. మహా సంఘర్షణ, 657 (1911).LDETel 194.3

  పాపము ఎక్కడవున్న దానికి మన దేవుడు దహించు అగ్న యైయున్నాడు. హెబ్రీ 12, 29 ఆయన శక్తికి తమ్మును తాము సమార్పిచుకొనే వారందరిలోను దేవుని ఆత్మ పాపాన్ని దహించే శక్తిలా ఉంటుంది. కాగా మనుష్యులు పాపాన్ని అంటిపెట్టుకొని ఉంటే వారు దానిలో బాగమౌతారు. అప్పుడు పాపాన్ని దహించి వేసే దైవమహిమ దానితో పాటు వారిని కూడ దహించి వేయకతప్పదు. - యుగయుగాల ఆకాంక్ష, 600(1898).LDETel 194.4

  దుష్టులను నాశనం చేయుట చట్టప్రకారమైన న్యాయము.

  దేవుని పై తిరుగుబాటు చేస్తు జీవితమంత గడపవలసిన వారు అర్ధంతరంగా పరలోకానికి ప్రయాణం కావడం, అక్కడ రాజ్యమేలే ఉన్న తస్థాయి పరిశుద్ధతను సంపూర్ణ త్వాన్ని తిలకించటం జరిగితే ప్రతీ వారు ప్రేమతో నిండివుండటం ప్రతి ముఖంపై సంతోషం తాండవించటం, దేవుని గౌరవార్థం గొర్రెపిల్ల గౌరవార్ధం మైమరపించే మదుర సంగీతం వినిపించడం, సింహాసనాసీనుడైన దేవుని ముఖం నుంచి జీవనదివలె విమోచన పొందిన వారి మీదకి వెలుగు ప్రవహించడం- దేవునిని ఆయన సత్యాన్ని పరిశుద్ధతను ద్వేషించువారు పరలోకవాసులతో కలసి వారి స్తుతిగానాలలో గళం కలపగలుగుతారా? దేవుని మహిమను గొర్రెపిల్లి మహిమను వారు తాళగలుగుతారా? తాళలేరు. పరలోక జీవనానికి అనువైన ప్రవర్తనలు రూపొందించుకోటానికి ఎన్నో సంవత్సరాల కృపకాలం వారికి దేవుడు అనుగ్రహించాడు. కాని వారు పరిశుద్ధతను ప్రేమించటం అలవర్చుకోలేరు. పరలోక బాషను నేర్చుకోలేరు. ఇప్పడు నేర్చుకోటం సాధ్యపడదు. చాలా ఆలస్యమైపోయింది. జీవితమంతా దేవునికి వ్యతిరేకముగా జీవించిన వారు పరలోకానికి అనర్హులయ్యారు. పరలోకానికి పవిత్రత, పరిశుద్ధత, ప్రశాంతత వారికి హింసగా పరిణ మిస్తుంది. దేవుని మహిమ దహించే అగ్నిలా ఉంటుంది. ఆ పరిశుద్దలోకాన్ని విడిచిపెట్టి పారిపోవాలనిపిస్తుంది. అక్కడ వుండడంకన్న నాశనమ వ్వడమే మేలనుకుంటారు. తమను విమోచించాటానికి మరణించిన అ ప్రభువు ముఖము చూడటంకన్న మరణమే మేలనుకుంటారు. దుష్టులు తమ భవితను వారే ఎంపికచేసుకొన్నారు. పరలోకం నుంచి తను బహిష్కృతి వారు స్వయంగా ఎంచుకోన్నదే. దేవుని పక్షంగా అది న్యాయమైంది, కృపతో కూడింది. మహా సంఘర్షణ,542 543(1911)LDETel 194.5

  స్వగృహమునకు రాకుండ బందించుట

  జీవించి ఉన్న నీతిపరులు, నిముషంలో ఒక రెప్పపాటున, మార్పుపొందుతారు. దేవుని మాటతో వారు మహిమ పొందుతారు. ఇప్పుడు వారి పునరుత్థానులైన భక్తులతో కలసి మద్యాకాశములో ప్రభువును కలుసుకోటానికి అమర్తులుగా మార్పు పొందుతారు. దేవాదూతలు ఆకాశము యొక్క ఈ చివరినుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు. చిన్న పిల్లల్ని దేవదూతలు తమ తల్లుల యొద్దకు ఎత్తుకొని వెళ్లి వాళ్ల చేతులలో పెడతారు. మరణం చాల కాలం విడదీసిన మిత్రులు ఏకమౌతారు. వారు ఇక ఎన్నడు విడిపోరు. ఆనందగీతలు పాడుకొంటు వారు కలసి దేవుని పరిశుద్ధ పట్టణానికి ఎగసిపోతారు. మహా సంఘర్షణ, 645 (1911).LDETel 195.1

  మనమందరం మేఘాలలో కలుసుకొని అక్కడ నుండి వెళ్లెదం మరియ ఏడు రోజుల తర్వాత స్పటిక సముద్రం మీదకి ఆరోహణమౌతాము..- ఎర్లీ రైటింగ్స్. 16 (1851).LDETel 195.2

  మరియు రధములు ఆకాశము పైకి ఎత్తబడినప్పుడు పవిత్రమైన రద చక్రాలు గంభీరద్వని చేసెను మరియు రెక్కలు, కదిలినప్పుడు, పవిత్రమైనవి అని అనెను, మరియు రధములు చుట్టువున్న పరిశుద్ధ దేవదూతలు సమూహం పరిశుద్ద, పరిశుద్ధ బిగ్గరగా పలికెదరు మరియు మేపూలలో వున్న పరిశుద్దలు సర్వశక్తిమంతుడైన యెహోవా పరిశుద్ద, పరిశుద్ధ మహిమ ప్రభావము నీకే హల్లేలుయ అని వారు యెలుగేత్తి కేకలు వేసేను.- ఎర్లీ రైటింగ్స్ 35 (1851)LDETel 195.3

  విమోచింపబడిన వారందరిని ఆయన ఆవ్యాహనిస్తు ఉంటే ఆహా ఆది చూచుటకు ఎంద అమోగముగా ఉన్నది.! మనము ఎంతో కాలము నుండి ఎదురు చూస్తున్నాము, మన నిరీక్షణ నిస్సప్రయోజనం కాదు. మనము ఆ సౌందర్యముగల రాజును చూడ గలిగితే నిరంతరం మనము ఆశీర్వదించబడతాము. అప్పుడు నేను బిగ్గరగా కేకలు వేయలనిపిస్తుంది, అయితే నేను నా స్వదేశములోనే వున్నాను!” -సంఘమునకు ఉపదేశములు.8: 253 (1904LDETel 196.1

  క్రీస్తు విజయుడైనాడని దూతలుపాడిరి!

  ఆ దినమందు విమోచింపబడినవారు తండ్రి మరియు కుమారుని మహిమలో ప్రకాశింపబడుతారు. రాజాది రాజును మరియు అతని విజయోత్సవముతో వస్తున్న సమూహమును, ఎవరైతే గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రము తెల్లగా కడుగుకొని ఉన్నరో వారిని ఆహ్వానించుటకు - దేవదూతలు తమ బంగారు వీణాలను పట్టుకొనియున్నారు. క్రీస్తు జయించెనని విజయ గీతము పరలోకమంత నింపి వేసినది . అతడు పరలోక న్యాయస్థానాలలో విమోచించిన వారందరితో ఆయన కలిసి ప్రవేశిస్తాడు, ఆయన పొందిన సిలున వేధన మరియు త్యాగపూరితమైన సేవ వృదగాపోలేదు.-సంఘమునకు ఉపదేశములు.. 9:285, 286 (1909).LDETel 196.2

  ప్రభువు సంతోషములో పాలు పొందాటానికిగాను తమకు నమ్మకముగా నిలిచిన భక్తుల్ని యేసు ప్రమతో స్వాగతిస్తాడు. బాధలు వేదన అనుభవించి అవమానం భరించి తాము రక్షించిన ఆత్మల్ని మహిమ రాజ్యంలో చూడటం రక్షకునికి అమితానందం కూర్చుతుంది. మహా సంఘర్షణ,647 (1911)LDETel 196.3

  క్రీస్తు చేసిన అమోగమైన కార్య పలితాలలో దాని ప్రతిఫలమును ఆయన చూస్తాడు. ఎవ్వరూ లెక్కించలేని గొప్ప సమూహంలో, ఆయన మహిమ సన్నిదికి ముందుగా ఆయన నిర్దోషిగా గొప్ప ఆనందముతో ఆయన ప్రత్యక్షమగును మరియు ఎ వని రక్తం వలన మనము విమోచించబడియున్నాము మరియు ఎవరి జీవితము ద్వార మనము పాఠం నేర్చుకున్నామో “ఆయనే మన ప్రభువు, మన కోరకు చేసిన కఠినమైన శ్రమను చూచి మనము సంతృప్తి చెందెదం. ”- ఎడికేషం 309 (1903).LDETel 196.4

  పరిశుద్ధులకు కిరీటములు మరియు వీణలు ఇచ్చెదరు.

  లేకించలేని సంఖ్యలోనున్న దేవదూతలు ఆ పట్టణములో నుంచి మహిమగల కిరీటములు తీసుకొని వచ్చుట నేను చూచాను-- కిరీటం మీద ఎవరు పేరు వ్రాయబడి వున్నాదో అది ప్రతి పరిశుద్ధినికి ఇయ్యబడేను. యేసు కిరీటములను ఇచ్చుటకు పిలువగా దేవదూతలు అకిరీటములు ఆయనకు సమర్పించిరి అప్పుడు ప్రేమ మయుడైన యేసు ఆ కిరీటములను తన స్వహస్తలతో గౌరవప్రదమైన పరిశుద్దుల తలల మీద పెట్టును. ఎర్లీ రైటింగ్స్ 288 (1858). అస్పటిక సముద్రము మీద పరిపూర్ణమైన చతురాకారంలో1,44,000 మంది నిలిచున్నారు. కొందరికి చాలా ప్రకాశవంతమైన కిరీటాలను కలిగి వుండగా మరి కొందరికి అంత తేజోపరంతంగాలేవు. కొన్ని కిరీటాలు నక్షత్రాలతో బరువుగా కనిపించుచున్నవి, మరికొందరు తక్కువ నక్షత్రాలు ఉన్నాయి. అందరూ తమ కిరీటాలతో సంతృప్తిగా ఉన్నారు.- ఎర్లీ రైటింగ్స్ 16,17 (1851).LDETel 196.5

  జీవిత కిరీటం అనేక నక్షత్రాలతో తళుకు తళుకుమని ప్రకాశవంతముగానో లేదా మసకగానే ఉంటుంది, లేదా మన స్వంత కార్యక్రమాలకు అనుగుణంగా కొన్ని రత్నాల ద్వారా ప్రకాశించబడుతుంది. ది ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 6: 1105 (1895). పరలోకంలో రక్షింపబడినవారు కిరీటములో నక్షత్రములులేకుండ ఎవరూ ఉండరు. మీరు ప్రవేశిస్తే, మహిమగల దేవుని న్యాయస్థానాల్లో ఎవరో ఒకరు యొక్క సహాకార తొల్పటు వలన ప్రవేశించెదరు. -సైన్స్ ఆప్ ది టైమ్స్, జూన్ 6, 1892.LDETel 197.1

  పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించక ముందు రక్షకుడు తన అనుచరులకు విజయ చిహ్నాల్ని తమకు కలిగిన రాజహోదాకు అధికార లాంఛనాల్ని అందిస్తా. తళతళమెరిసే హోదాలు రాజైన యేసు చుట్టు చతురాకారములో ఏర్పటై ఉంటాయి. భక్తులకన్న దూతల కన్న యేసురాజు ఉన్నతస్థాయి కలిగి ఉంటాడు.... జయించేవారి శిరస్సులమీద క్రీస్తు తన కుడిచేతితో మహిమ కిరీటాలు పెట్టును. ప్రతి ప్యక్తి తన కొత్త పేరు, ప్రకటన 2. 17, యెహోవా పరిశుద్దుడు,అని చెక్కిన మాటలు గల కిరీటం ఉంటుంది. ప్రతీ వారి చేతు లోను విజయసూచకమైన ఖరూరపు మట్టలు వీణి ఉంటాయి. నాయక దూతలు వీణి మీటటంతో ప్రతీ హస్తం సున్నితంగా తంత్రాలు మీటుతు మదుర మనోహార సంగీతం అందిస్తారు..రక్షణపొందిన ప్రజలముందున్న పరిశుద్ధపట్టణం గుమ్మాలు యేసు తెరుస్తాడు. సత్యాన్ని ఆచరించినవారందరు అందులో ప్రవేశిస్తారు.మహా సంఘర్షణ, 645, 646(1911)LDETel 197.2