Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

అంత్యకాల సంఘటనలు

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First

  2 అధ్యాయము - క్రీస్తు త్వరలో రానైయున్నాడని సూచనలు

  మన ప్రభువు యొక్క గొప్ప ప్రవచనము.

  యెరుషలేము నాశనమునము గూర్చియు మరియు మనుష్యకుమారుని యొగ రాకడ సమయములో సంభవింపబోవు సంఘటనలు గూర్చియు ఆయన శిష్యులకు ముందుగానే హెచ్చరించెను. మత్తయి ఇరవై నాలుగోవ అద్యాయమంత జరగబోవు సంఘటనలకు సంబందించిన ప్రవచనము మరియు లోకమంతయు గొప్ప అగ్నిచేత నాశనం చేయబడుతుందని ఈ యెరుషలేము నాశనం ఒక దృష్టాంతముగా ఉపయో గించెను. ఎంమ్స్ 77, 1899LDETel 10.1

  ఆయన రెండవ రాకడలో భయకరమైన తీర్పు ఈ లోకము మీదకు రానైయున్నదని క్రీస్తు ఆ ఒలీవల కొండమీద శిష్యులకు వివరించెను (మత్తయి 4:6) మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు (మత్తయి 24: 6-8] అయితే యెరుషలేము నాశనమైనప్పుడు పాక్షికంగా ఈ ప్రవచనాలు నెరవేర్పును పొందియుంది కనుక దీనిని బట్టి మరియెక్కువగా కడవరి కాలములలో ప్రయోగించబడుతుంది.- సంఘమునకు ఉపదేశములు 5: 753 (1899).LDETel 10.2

  ఆకాశములో సూచనలు

  పోపుల యొక్క గొప్ప హింసకాండ ముగింపునకు వచ్చినప్పుడు, క్రీస్తు ముందుగా ప్రకటించినవి గమనించండి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతి ఇయ్యడు, నక్షత్రములు ఆకాశము నుండి రాలును, ఆకాశ మందలి శక్తులు కదలింపబడును, అంజూరపు చెట్టువలన ఒక ఉపమానము నేర్చు కొనుడి అంజూరపుకోమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు అది సమీపమున ద్వారము దగ్గరనే యున్నదని తెలిసికొనుడి (మత్తయి 24: 29, 32, 33,) క్రీస్తు ఆయన రాకడను గూర్చి సూచనలు ఇచ్చెను. ఆయన సమీపమున ద్వారం దగ్గరే ఉన్నట్లు మనకు తెలుయునని ఆయన చెబుతున్నాడు. ఈ సూచనలు చూచేవారిని గూర్చి ఇలా అనెను ఇవన్నియు జరుగు పర్యంతము ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, (మహా సంఘర్షణ పుస్తకము పుట 306,308,333,334,లో చూడండి) ఈ సూచనలు నెరవేరినవి, ఇప్పుడు నిజముగా ప్రభు రాకడ సమీపములో వున్న నదని మనము తెలుసుకొనుచున్నాము. - (యుగయుగాల అకాంక్ష)632 (1898).LDETel 10.3

  భూమి మీద సూచనలు

  మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, భూమిమీద ఉన్న దేశముల మద్య కలవరం కలుగునని యేసు ప్రకటించెను (లూకా 21:25; మత్తయి 24:29; మార్కు 13: 24-26; ప్రకటన6: 12-17). ఆయన రాకడను గూర్చి ఎవరైతే ముందుగా ఎదురుచూస్తువున్నరో ఆయన సమీపముగా ద్వారము దగ్గరనే వున్నాడని తెలుసుకోనును.(మత్తయి 24:33) -- మహా సంఘర్షణ. పుట,37, 38 (1911).LDETel 11.1

  దేశాలు అశాంతిలో ఉన్నాయి. గందరగోళ పరిస్థితులు ఇప్పటికే మనమీద విరుచుకోని పడుచున్నవి, భూమిమీదకి వస్తున్న భయనక సంఘటనలు బట్టి మనుష్యల హృదయాములో కలిగెను కలవరములు మరియు చెలరేగిన ఆ తుఫాను మధ్య నుండి ఇదిగో నేనువున్నాను భయపడకుము. అని -దేవుని యందు నమ్మకము కలిగియున్న వారికి ఆ స్వరము వినబడుతుంది. సైన్స్ అప్ దిటైమ్స్ అక్టోబరు 9, 1901.LDETel 11.2

  పరలోకములో వున్న పుస్తకాలలో వింతైనవి మరియు చారిత్రాత్మక సంఘటనలు వ్రాయబడియున్నది, సంఘటనలు ఏవైతే ప్రకటించబడియున్నవో అవి త్వరలోనే దేవుని యొక్క గొప్ప దినమందు జరగవలసియున్నవి.ప్రపంచంలోని ప్రతీది అసంతృప్తితో ఉందిమాన్యుస్కిప్రి రిలీజ్ 3: 313 (1908).LDETel 11.3

  అబద్ధ ప్రవక్తలు

  యెరూషలేము నాశనానికి ఒక గుర్తుగా చెబుతూ క్రీస్తు ఇలా అనెను “అనేకులైన అబద్ద ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు” (మత్తయి 24:11] అబద్ద ప్రవక్తలు లేచి, ప్రజలను మోసగిస్తారు మరియు గొప్ప సంఖ్యలో ప్రజలను అరణ్యములోనికి నడిపిస్తారు. ఇంద్రజాలికులు మరియు మాంత్రికులు,మాకు అద్భుతశక్తులు కలిగియున్నా మని ప్రకటించుకుంటు ప్రజలను వారి వెంట ఏకాంత స్థలమైన పర్వతాల ప్రాంతమునకు ఆకర్షించేదరు.ఈ ప్రవచనంకూడా కడవరి రోజులును గూర్చి తెలియజేస్తున్నది.ఈ సూచన రెండవ రాకడకు గుర్తుగా ఉన్నది. - (యుగయుగాల అకాంక్ష) 631 (1898)LDETel 11.4

  మనము అసత్య వాదనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అబద్ద ప్రవక్తలు ఉత్బవిస్తారు, అసత్యమైన కలలు మరియు తప్పుడు దర్శనములు చెపుతారు, అయునప్పటికిని దేవుని వాక్యమును ప్రకటించుచు, ఆయన వాక్యములో వున్న స్వరము నుండి దూరముగా వెళ్లిపోవద్దు. సెలెక్ట్డ్ మెసెజ: 2:49 (1894).LDETel 11.5

  నాకు దేవుని గూర్చి చాల అవగాహనము వున్నాదని, ప్రత్యేకంగా కనపరుచుకొనే వారిని నేను చూచాను, వారు. ఇతరులను తప్పుడు మార్గములో నడిపించటానికి ప్రయత్నిస్తారు. తప్పుడు ఆలోచనల నుండి వారు ఒక పనిని చేయుటకు బాధ్యతగా తీసుకుంటారు కాని దేవుడు వారికి అసలు ఆ పని అప్పగించలేదు ఇక పలితము అంతా గందరగోళంగానే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ దేవుని చిత్తము అర్ధము చేసుకొను టకు ఎవరికి వారు దేవున్ని యదార్ధముగా వెతకాలి.-సెలెక్టడ్ మెజ: 2:72 (1893).LDETel 11.6

  అబద్ధ ప్రవక్తతో అనుభవం

  ఆస్ట్రేలియలోనున్న విక్టోరియాకు చెందిన ఒక సోదరుడు అతడు మాకు అపరిచితుడగా పరిచయమైనాడు, ఆ రోజు రాత్రి ఆ యువకుడు నేను సోదరి ఎలెన్ వైట్ గారిని చూడాలని మాకు పోన్ చేసి అడిగాడు, అది సాయంత్రం కాబట్టి నేను అతనిని చూచుటకు అనుమతించలేదు, ఆ రాత్రి వేళ మాతో ఇక్కడే ఉండి అలాగే ఉదయమునే అల్పాహారం తీసుకోమని అతనిని ఆహ్వానించాము.యదావిదిగా ఉదయం ఆరాధన తరువాత,మేము మా వివిద ఉద్యోగాల్లోకి వెళ్ళబోవుచుండగా, ఈ యువకుడు లేచి అదికారముగా సంజ్ఞలు చేసి మీరు కూర్చోవాలని మమ్ములను కోరాడు. మీ దగ్గర పాటల పుస్తకము వుందా? అని అడిగాడు, మనము ఇప్పుడు ఒక పాట పాడు కుందాము మీకు నేను చెప్పవలసిన ఒక వర్తమానము ఉంది అన్నాడు, అప్పడు నేను ఇక ఆలస్యము ఏమిలేకుండ ఆ వార్తమానము ఎమిటో చెప్పు అన్నాను, ఎందు కంటే మేము అమెరికా మెయల్ అందుకొవలసియుంది. మేము సమయాన్ని వృదా చేయలేము అని అన్నాను “ఆ తరువాత అతను వ్రాసినది ఏదో చదువుచున్నాడు, ఇతర విషయాలతో పాటు అందులోవున్న విషయము ఏమిటంటే సమస్త జీవులపైన తీర్పు ఇప్పుడు రానైయన్నదని వుంది. అతను చదివినదంత నేను విని చివరికి ఇలా అన్నాను, “నా సోదరుడా! నీ మనస్సు సరిగ్గా లేదు. నీవు ఇచ్చిన సందేశం మాకు ఎలా సంబందిచియున్నాది స్పష్టంగా మాకు ఒకసారి తెలియజేయుము, బైబిలుకు అను గుణంగా మీరు చెప్పినది వుంది. అయితే నీవు చెప్పానది పొల్లుపోకుండ మేము నమ్ము చున్నాము, కానీ నీవు ఉద్రేకముగా వున్నావు. దయచేసి మా కోసం ఏ వార్తమానము వుందో చెప్పుము అప్పుడతడు మీరు మీ సామానులను సర్దుకొని అందరు ఒక్కసారే బాటిల్ క్రీక్ వెళ్లిపోవాలి అన్నాడు. కారణము ఏమిటి అని అడిగాను అప్పుడతడు, సమస్త జీవులపైన తీర్పు ప్రారంభమైయున్నది, ఈ సందేశమును మీకు అందించాలని వచ్చాను, అప్పుడు ఇలా సమాధానము ఇచ్చేను, దేవుడు మాకు ఇచ్చిన పని ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ మా పని పూర్తయినప్పుడు ఇక మేము బాటిల్ క్ కి వెళ్ళడానికి సమయం దేవుడే మాకు తెలియజేస్తాడు. అంతవరకు మీకు బోధించటం మా బాద్యతని నేను అతనికి జవాబిచ్చాను, ఆ తర్వత అతని విషయములు సహోదరులు స్టార్ చాచుకోమని అప్పగించెను తర్వాత నా వ్రాతలు అక్కడితో ఆపేసాను. తర్వత అతడు సహోదరుడు స్టార్కన్ని కలసి ఇలా చెప్పాడు, సహోదరి వైట్ గారు ఎంతో అధికార పూర్వకముగా నాతో చాలా దయతో మాట్లాడినారు. అతడు తప్పు చేసినట్లుగా భావించి నాడు అతనిని ప్రభావితం చేసిన బలమైన సంఘటనలు స్థిరమైనవి లేదా యుక్తమైనవి కావు అని గ్రహించెను.మాది పెద్ద కుటుంబం పది మంది సభ్యులతో కూడినప్పటికీ, వున్న అదిదులు ముగురుతో పాటు మాతో కొంత సమయము గడపాడానికి ఈ యువకుడు మాతో ఉండాలని నిర్ణయించుకున్నాము. అతుడు కఠినంగా వ్యవహరించే వారితోను మరియు అతనిని ఖండించే వ్యక్తులతో వెళ్లాలని మేము కోరుకొనుటలేదు, లేదా అతనికి వున్న సంబందములు అలాగే కలిగి వుండాలని కూడ ఆశించుటలేదు. అతనితో సహవాసము కలిగివుండుటకు కొద్ది సేపు అలాగే వుండాలి, ఆ తర్వత సాధ్యమైతే సురక్షితమైనదియు మంచి మార్గాలో నడిపించుటవీలౌతుంది.- లెటర్స్ 66, 1894.LDETel 12.1

  తిండిబోతుతనము మరియు మితానుభవముమన ప్రపంచంలో అత్యంత పేద రికము మరియు గొప్ప నైతిక దుర్నీతి పునాది పైనే వున్నది, సాతానికి ఈ విషయము బాగా తెలుసు, అతడు నిరంతరము స్త్రీ, పురుషులను రుచుల విషయములో కోరికలు పెంచి, శోదించుచు వారి సొంత ఖర్చు మీద ఆరోగ్యమునకే కాదు ప్రాణమునకు ముప్పు తీసుకొస్తున్నాడు, తినడం, త్రాగడం, మరియు వస్తాదరణ జీవితం యొక్క లక్ష్యమే కాని అది దేవుని వాక్యముతో ముడిపడి ఉండాలి. జలప్రళయానికి ముందు అలాంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దుష్ప్రవర్తన ఇక త్వరలోనే భూమి యొక్క చరిత్ర అంతమునకు రానైయున్నదని ఒక గుర్తు గా సాక్ష్యమిచ్చుచున్నది. లెటర్ 34, 1875.LDETel 13.1

  జలప్రళయ పూర్వ ప్రపంచము గురించి లేఖనం అందిస్తున్న వర్ణన, అది ప్రస్తుత ఆధునిక సమాజాన్ని వేగవంతముగా అడుగులువేస్తు చేరుకుంటున్న పరిస్థితికి అద్దం పడుతుంది, పితరులు ప్రవక్తలు, 102 (1890).LDETel 13.2

  ప్రభువు త్వరలోనే వస్తున్నాడని మాకు తెలుసు. నోవహు దినాలలో ఉన్నట్లుగానే ప్రపంచం చాల వేగముగా మారుతోంది. తినడం మరియు మద్యపానం అధికంగా వున్నాయి, ఇది స్వార్థపూరిత సంతృప్తి మీద ఒరిగియున్నది. పురుషులు విషపూరిత మైన మద్యాన్ని సేవించి పిచ్చివాళ్లిపోయి రాక్షస స్వబావము కలిగియున్నారు. - లెటర్ 308,1907.LDETel 13.3

  హింసాత్మక చర్యలు

  నోవహు దినాలలో, అత్యధిక సంఖ్యలో ప్రజలు సత్యాన్ని వ్యతిరేకించారు, మరియు ఎంతో ఆసక్తికరముగా అల్లిక చేయబడిన అబద్దాలతో చిత్ర విచిత్రముగా మారిపోయునది, భూమి హింసతో నిండిపోయింది. యుద్ధం, నేరం, హత్య, రోజు వారి క్రమం. క్రీస్తు రెండవ రాకడకు ముందు ఇలాగే జరుగుతుంది. ఎస్ డి ఎ. బైబిల్ కామెంటరీ 1: 1090 (1891).LDETel 13.4

  కార్మిక సంఘాలు వారి డిమాండ్లకు కట్టుబడి లేకుంటే త్వరగా హింసకు ప్రేరేపించ బడతారు. ప్రపంచ సమానత్వము మరియు ఐక్యమత్యము లేక భూమి మీద నివసించే ప్రజలను దేవునితో అనుగుణంగా వుండుటలేదు, సాతను యొక్క అధికారము క్రింద క్రమము తప్పకుండ జరుగుచున్న చెడు కార్యములకు ఏశాస్త్రీయ సిద్ధాంతం వర్ణించలేదు. ప్రతి గుంపులో దుష్ట దేవదూతలు పనిలో ఉన్నారు, హింసాకాండ పనులు చేయమని మనుష్యులు ఉత్తేజ పరుస్తున్నారు....... దేవుడు తనకుతానే మహోన్నతముగా బయలు పర్చుకోనే విధముగా, మనుష్యులు తమ వక్రబుద్ధి మరియు క్రూరత్వము వలన ఎతైన స్థాయుని చేరుకున్నరు. నోవహు దినాలలో వుండినట్లు త్వరలోనే ప్రపంచమంత దుర్మార్గాముతో పరిమితిని దాటిపోతుంది, దేవుడు త్వరలోనే తన తీర్పులను కుమ్మ రించును.-ది అప్ వాడ్ లుక్ 334 (1903).LDETel 13.5

  హత్యలు, దోపిడీలు, రైలు ప్రమాదాలు మరియు హింసకు సంబంధించిన ఘోరమైన కృత్యములు గూర్చి భయంకరమైన వార్తలు వినినప్పుడు అన్ని అంతమునకు సమీపించి యున్నదనే కధను తెలియజేయుచున్నది. ప్రభువు యొక్క రెండవ రాకడకు ఇప్పుడు మనము సిద్ధపడవలసియుంది.. లెటర్ 308, 1907.LDETel 14.1

  యుద్ధాలు మరియు వైపరీత్యాలు

  ప్రచండమైన తుపానులాంటివి రానైయున్నది. దాని యొక్క ఉగ్రతను మనము ఎదురుకోవాలంటే మన ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసము వుంచి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాంపోంది సిద్దిపడవలసిన అవసరంవుంది. భూమండాలాన్ని భయంకరంగా కంపింపచేయుటకు దేవుడు రానైయున్నాడు. నలుమూలల హింసలు ఉపద్రవాలు చూస్తాము. సముద్రపు లోతులలో వేలాది నౌకలు అగాదములో పడవేయ బడతాయి. నౌక దళాములు మునిగిపోతాయి మరియు లక్షల మంది మానవ జీవితాలు బలై పోతాయి. మంటలు ఊహించని విధంగా చెలరేగుతాయు వాటిని ఆర్పటంలో మానవ ప్రయత్నం విఫలమౌతుంది. భూమి యొక్క రాజభవనాలు అగ్ని జ్వాలలలో బుగ్గి అవుతాయి. రైలు ప్రమాదాలు మరింత తరచుగా అవుతాయి. గందరగోళం, ఘర్షణ, మరియు మరణాలు క్షణం హెచ్చరిక లేకుండా జరుగుతాయి.ముగింపు సమీపంలో ఉంది, కృపకాలంము గింపునకు వస్తుంది. ఆయన మనకు దొరుకుకాలము వరకు వెతికెదము, ఆయన సమీపంలో ఉన్నపుడు ఆయనను వేడుకొందాం!- యువతకు వర్తమానాలు, 89, 90 (1890).LDETel 14.2

  ఈ భూమి యొక్క చరిత్రలో చివరి సంఘటనలు ఆగ్రహానికి గురి అవుతుంది తెగులు, కరువు కాటకాలు విజృంబిస్తాయి, లోతైన నీళ్లు వాటి సరిహద్దులు దాటి ప్రవహిస్తాయి. ఆస్తులు మరియు ప్రాణలు అగ్నికి ఆహుతైపోతాయి మరియు వరదలకు నాశనమైపోతాయి. అయితే క్రీస్తుని ప్రేమించిన వారికి భవనములు ఉన్నాయి, ఆయన వాటిని కట్టుటకు వెళ్ళి యున్నాడు కాబట్టి దాని కొరకు మనము వేచియుండ వలెను. - మారనాడ 174(1897)LDETel 14.3

  గొప్ప అగ్ని గుండము

  ఒక శుక్రవారం ఉదయం, నేను ఇంక నిద్రనుంచి లేవక ముందు, బ్రహ్మండమైన దృశ్యం దేవుడు నాకు దర్శనముగా చూపించెను, కాని అది నా ఇంటిలో మాత్రము కాదు, నేను నిద్ర నుండి మేలుకొనుటకు ప్రయత్నించాను. అప్పుడు నేను కిటికీలోనుండి బయటకు చూచాను, మండుచున్న అగ్ని జ్వాలలు భయంకరముగా రగులుచు గొప అగ్ని బాణాములవలే ఇళ్ళు మీద పడుతున్నాయి, మరియు ఈ అగ్ని బంతుల్లో మండుతున్న బాణాలు ప్రతి దిశలో ఎగురుతూ ఉన్నాయి. చెలరేగిపోతున్న మంటలను తనిఖీ చేయడం అసాధ్యం, మరియు అనేక ప్రదేశాలు ఘోరముగా వినాశనమైనది, ప్రజల భీతి వర్ణించలేనిది. కొంత సమయానికి నేను నిద్రలేచి చూడగా నేను నా ఇంటిలోనే వున్నాను.- ఎవంజిలిజం(1906).LDETel 14.4

  అందమైన భవనాలు మీద పెద్ద పెద్ద అగ్నిబంతులు పడడం తక్షణమే నాశనము అవడం నేను చూచాను, ఎవరో ఇలా అనడం నేను విన్నాను, దేవుని తీర్పులు భూమిపైకి వస్తాయని మనకు తెలుసు, కానీ ఇంత త్వరలోనే వస్తారని మనకు తెలియదు. ఇతరులు ఎంతో వేదనతో గంభీరమైన స్వరముతో అది మీకు తెలుసు, మాకు తెలియదు కదా? మరి మీరు మాకు ఎందుకు చెప్పలేదు ఇలా అరుపులు కేకలు పెట్టారు సంఘములకు ఉపదేశములు 9:28 (1909)LDETel 15.1

  భూకంపాలు మరియు వరదలు

  శత్రువు తన పనిని చేసియున్నాడు, మరియు అతను ఇంకా అపని వేగవంతం చేస్తున్నాడు. అతను గొప్ప శక్తితో వచ్చును, మరియు దేవుని ఆత్మ భూమి నుండి వెళ్లిపోయేను,దేవుడు తన చేతిని ఉపసంహరించుకున్నాడు.(పెన్సిల్వేనియా) లో వున్న జాన్స్ టౌన్ లో జరిగినది మనము కేవలం దాని వైపు చూడవలసి యుంది. మొత్తం నగరం తుడిచిపెట్టుకొని పోవుటకు కారణమైన దుష్టుడుని ఆయన అడ్డగించలేదు. అనేక రోజులు భారీ వర్షాల కారణంగా ఒక ఆనకట్ట తెగిపోయునది 1889. మే 31న, జాన్స్ టౌన్ లో వచ్చిన వరదలకు దాదాపు 2,200 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ భూమి చరిత్ర ముగిసే వరకు ఈ విషయాలు పెరుగుతానే వుంటాయి.- సర్మాన్స్ అండ్ టాక్స్ 1.109 (1889).LDETel 15.2

  భూమి లో దాగియున్న ప్రధాన ద్రవ్యము బలముగా తన్నుకుని బయటకొచ్చి భూమి యొక్క పై బాగమును కాల్చివేసెను, ఈ ప్రదాన ద్రవ్యము ఒకసారి బ్రద్దలై లావాల ప్రవహించినది, అయితే ఎంతో కాలముగా సమకూర్చుకుంటున్న ధనము, ఆస్టి ఐశ్వర్యము మరియు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వకుండ వారిని పస్తులుంచి ఆకలి బాదలకు విడిచిపెట్టి వారి ధనము ఖజానాలో జమ చేసుకొనిన సంపదంతయు తుడుచి పెట్టుకుపోయింది, అంతేకాక, మతపరమైన లోకము కూడా భయంకరముగా ఈ అంతిమ కాలము సమీపమందు కదిలించబడుతుంది. మాన్యుస్కి ప్రి రిలీజ్, 3: 208 (1891).LDETel 15.3

  ఒక్క క్షణం మనము స్థిరమైన భూమిపై ఉండే సమయము వచ్చింది, మరోక్షణం మన పాదాలు భూమి క్రిందకి వెళ్లిపోవచ్చు అయితే ఏ క్షణములోనైన మనకు తెలియ నంతలోనే భూకంపములు రావచ్చు.. టెస్టమోనిస్ టూ మినిస్ట్రీస్ అండ్ గాస్పల్ వర్కర్స్.- 421 (1896)LDETel 15.4

  అగ్ని, వరదలు, భూకంపములు, మహా సముద్రములు ద్వారాను మరియు భూమి మీదను సముద్రమీదను విపత్తులు ద్వారాను దేవుడు హెచ్చరించాడు అయితే దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మనుష్యులతో వాదించదు.. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 3: 315 (1897).LDETel 16.1

  మనుష్యుకుమారుడు ఆకాశ మేఘాలలో కనిపించక ముందు పంచభూతములు గడగడ వణికిపోవును, ఆకాశము నుండ పుట్టిన మెరుపులు భూమిమీద చెలరేగిన అగ్ని ఈ రెండు కలయకలో పర్వతములు అగ్ని గుండము వలే మండుచుంచెను, ఆ కొలిమి నుంచి వచ్చిన లావా గ్రామాలు, పట్టణాల మీద ప్రవేసించును. కరుగుచున్న పెద్ద రాళ్లు నీళ్లలో పడినప్పుడు నీరు మరిగెను, అంతట భూమిలో దాగియున్న వస్తువులు పైకి లేచును, అప్పుడు శక్తివంతమైన భూకంపాలు కలుగును మరియు మానవ జీవితాలకు గొప్ప విద్వంసం కలుగుతుంది. ఎస్ డి ఎ బైబిల్ కామెంటరి 7: 946 (1907).LDETel 16.2

  నేరము, కరువు, తెగులు

  సాతాను ఈ వాతావరణంలో తన ప్రతాపం చూపిస్తున్నాడు; విషపూరితమైనదిగా వాతావరణాన్ని అతడు మారుస్తున్నాడు, మరియు ఇక్కడ మనము ప్రస్తుతము శాశ్వతమైన జీవితము కోసం దేవుని మీద ఆదారపడుచున్నాము. మనము ఉన్న స్థితిలో ఉంటున్నాము, కనుక మనం పూర్తిగా మేల్కొని వుండాలి, పూర్తిగా దైన ద్యానములో వుండాలి, పూర్తిగా మార్పు చెందాలి, పూర్తిగా దేవునికి సమార్పించుకోవాలి. కానీ మనము పక్షవాతానికి గురైనట్లు కూర్చోని చూస్తున్నాము. పరలోకమందున్న దేవుడు ఎప్పటి కప్పుడు మనలను మేల్కొల్పుచున్నాడు! - సెలెక్ట్డ్ మెసేజస్ 2:52 (1890).LDETel 16.3

  విశ్వములో వున్న ఒకటి ప్రాణవాయువును మరియు పోషకాహారమును విషముతో మలినము చేస్తున్న ఈ భయంకరమైన పనిని కొనసాగిస్తున్నా ఈ చీకటి శక్తులను దేవుడు నిరోదించుట లేదు, జీవనాధారమైన కూరగాయలు మాత్రమే కాదు పొడవు చున్నవి మనిషి తెగులు నుండి కూడ బాధపడచున్నాడు.....ఈ విషయాలన్ని కూడ దేవుని యొక్క ఉగ్రత పాత్ర నుండి పడుచున్న బిందువుల పలితమే [దేవుడు తాను అనుమతించిన దానినే బాద్యత తీసుకుంటాడే తప్ప ఆయన వాటిని అసలు అడ్డుకోడు, నిర్గమకాండము 7:3;8:32; 1 దినవృత్తాంతములు10: 4, 13, 14] చూడండి భూమ్మీద కుమ్మరించబడినవి, ఇక సమీపములో నున్న భవిష్యత్తులో ఏమి జరగనై యున్నదో ఇవి మందమైన ప్రాతినిధ్యాలుగా ఉన్నవి.- సెలెక్టేడ్ మెసేజస్ 3:391 (1891).LDETel 16.4

  కరువు కాటకాలు పెరుగుతాయి. తెగుళ్లు చేత వేలాది మంది తుడిచిపెట్టుకొని పోతారు, సాతాను శక్తులు యొక్క ప్రమేయం లేకుండగా ప్రమాదాలన్ని మన చుట్టు అలుము కుంటాయి, కానీ దేవుని నిరోదక శక్తి ఇప్పుడు కార్యరూపములోనికి రానైయున్నది. మాన్యుస్కిప్ట్ రిలీజ్ 19: 382 (1897).LDETel 16.5

  ప్రభువు యొక్క ఆత్మ భూమి నుండి వెనక్కి వెళ్లిపోవడం నాకు చూపించబడి యుంది.దేవుని ఆజ్ఞలను గైకొనుటకు నిరంతరము నిరాకరిస్తున్నా వారి నుండి దేవుని ఆదీనములో ఉన్న శక్తి త్వరలోనే తీసివేయబడుతుంది. ప్రతి మోసపూరిత మైన లావా దేవీలు, హత్యలు మరియు నేరాలకు సంబంధించిన నివేదికలు అనుదినము మాకు అందుచున్నాయి. అక్రమము సర్వ సాదారణమైన విషయం, ఒకసారి అతిక్రమము నకు పాల్పడితే ఇక ఇంద్రియా జ్ఞానమునకు ఎటువంటి అదురు బెదురు ఉండదు.లెటర్ 258, 1907LDETel 17.1

  విపత్తులలో దేవుని సంకల్పము.

  ఒక్క క్షణము ఎటువంటి హెచ్చరిక లేకుండా శాశ్వతత్వం లోకి పడవేసే సముద్రపు గనులు ద్వారా భయంకర విపత్తులు కలుగడం అంటే అర్థం ఏమిటి? పేదలను అణచివేసి వారి యొద్ద నుండి దౌర్జన్యముగా దొంగిలించియున్న మనుష్యులు యొక్క సంపదంత భూమగ్ని ప్రమాదమునకు నాశనమైపోవుటమంటే ఏమిటి? దేవుని చట్టమును అతిక్ర మించుచు అతని ఒడంబడిక విచ్చిన్నము చేసిన వారిని మరియు సబ్బాతు దినమును త్రోసివేసి దాని స్థానములో ప్రభువు ఏర్పాటు చేయని దినమును అంగీకరించిన వారి ఆస్తులను రక్షించడానికి జోక్యము చేసుకొనడు. దేవుని యొక్క తెగుళ్లు ఇప్పటికే భూమి మీద పడుచున్నవి, పరలోకము నుండి అగ్ని శ్వాస ద్వారా చాలా ఖరీదైన నిర్మాణాలు తుడిచిపెట్టుకొని పోవుచున్నవి, నామకార్ధ క్రైస్తవులు ఈ తీర్పులు చూచైనా మనోజ్ఞానము పొందుకోరు పాపులు ఆయనకు భయపడి ఆయన ముందు వణుకుచు వచ్చుటకును, ఈ లోకమునక ఇస్తున హెచ్చరికను అంగీకరించుటకు దేవుడు ఇంకను అనుమతించుచున్నాడు. -మాన్యుస్కిప్ట్ రిలీజ్ 3: 311 (1902).LDETel 17.2

  ఈ విపత్తులు జరగడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఆయన మార్గాలలో ఒకటైనది ఈ మార్గము ద్వారా, స్త్రీ పురుషులకు జానోదయము పొందుకొనుటకు ఈ విధముగా పిలుపునిచ్చుచున్నాడు. ప్రకృతి ద్వారా అసాధారణ పనుల ద్వారా దేవుడు మానవ సంస్థలను అనుమతించెను అని వాక్యములో స్పష్టంగా వెల్లడిస్తున్నది .. మాన్యుస్కిప్ట్ రిలీజ్ 19: 279 (1902).LDETel 17.3

  భూకంపాలు, తుపాన్లు, అగ్ని ప్రమాదములు మరియు వరదలు, ఆస్తి మరియు విపరీతమైన ప్రాణ నష్టమును గూర్చి మనము ఎంత తరచుగా వినుచున్నాము! నిలకడలేని క్రమ రహితమగు విశృంఖలంగా విరుచుపడే ప్రకృతి శక్తుల విజృంభణలు, ఈ విపత్తులు మానవుని నియంత్రణలో మించినవి అందులో దేవుని ఉద్దేశము వ్యక్తమౌ తుంది. తమకు వస్తున్న ప్రమాదాల గుర్తింపు మానవులకు కలిగేందుకు ఉపయుక్తమౌ తున్న సాధనాలు ఇవి. -ప్రవక్తలు - రాజులు, 277 (.1914).LDETel 17.4

  రానైయున్న సంఘటనలు దేవుని స్వాదీనములోనున్నవి

  ప్రపంచమునకు పాలకుడు లేకుండా వుండదు. రాబోయే సంఘటనల యొక్క సంగతులు ప్రభువు హస్తాలలో వున్నది, దేశముల యొక్క గురి మరియు ఆయన అలాగే అధికారములోనున్న ఆయన సంఘము యొక్క బాద్యత అంత పరలోకము ఘనతకు కొరకు ఉంది . సంఘమునకు ఉపదేశములు..5: 753LDETel 18.1

  ఈ సూచనార్థకమైన ప్రాతినిద్యాలు [అరణ్యంలోని మండుతున్న సర్పాలు] ఒక ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తాయి. వారి నుండి దేవుని ప్రజలు భూమి యొక్క భౌతిక శక్తులు సృష్టికర్త యొక్క నియంత్రణలో ఉంటారని మాత్రమే కాకుండా, ఆయన నియంత్ర ణలో దేశాల మతపరమైన ఉద్యమాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా ఆదివారము ఆచరణను బలాత్కారముగా అమలుచేయడం గూర్చిన సందర్భములో ఇది నిజమైనది - మాన్యుస్కిప్టు రిలీజ్ 19: 281 (1902).LDETel 18.2

  పనిని గొప్పగా ముగించడములో మనం ఎలా వ్యవహరించాలో తెలియకపోవటమే కలవరపరుచుచున్న విషయము, పరలోకమందున్న మూడు గొప్ప శక్తులు పని చేస్తున్నాయి అనే విషయము మనము మర్చిపోకూడదు, ఒక దైవికమైన హస్తము నిరంతరము పనిలో వున్నది, మరియు దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చును. ఎవాంజలిజం, 65 (1902).LDETel 18.3

  చక్రాల లాంటి చిక్కులు కెరుబులు యొక్క రెక్కల చేతుల క్రింద కాపాడబడు చున్నవి, కాబట్టి క్లిష్టమైన పాత్రను పోషిస్తున్న మానవ సంఘటనలు దైవ నియంత్రణలో ఉన్నవి. దేశాల కలహాలు, అల్లర్లు మద్య, కెరూబుల మీద కూర్చుని, భూమి యొక్క వ్యవహారాలను నడిపించుచున్నాడు.[యెహెజ్కేలు 1: 4, 26; 10: 8; దానియేలు 4:17, 25, 32] -ఎడ్యుకేషన్ 178 (1903).LDETel 18.4

  మానవ వార్షిక సంఘటనల యొక్క చరిత్రలో, దేశాల అభివృద్ధి, సామ్రాజ్యాల పెరుగుదల మరియు పతనం, మనిషి యొక్క ఇష్టానుసారం మరియు పరాక్రమం మీద ఆధారపడివున్నట్ల కనిపిస్తుంది. సంఘటనలను రూపొందించుకోవడం కూడ గొప్ప స్థానము అని తన శక్తి ఆశయం లేదా తరచు మనసు మార్చుకోవడం ద్వారా నిర్ణయించ బడుతుందని భావించెదరు. అయితే దేవుని వాక్యములో అడ్డు తెర పక్కకు తొలగించ బడింది ,మానవ ఆసక్తి, అదికారం, ఆవేశకావేషాలకు పైగా వాటి వెనక, వాటి గుండా నడిచే నాటకం అంతర్నాటక మంతటా కృపానిది అయిన దేవుని సాధనాల్ని చూస్తాం. అవి చడిచప్పుడు లేకుండ ఆయన చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చుతూ ఉంటాయి. ప్రవక్తలురాజులు, 499, 500 (c 1914).LDETel 18.5

  భూమి యొక్క వ్యవహారాల కోసం పరలోకం బాధ్యత వహిస్తుంది

  మొట్ట మొదటి హంతకుడి పై సహనాన్ని చూపించుటచేత,ఈ విశ్వమంత మహా గొప్ప పోరాటము పైన వుంటుందని దేవుడు ఒక పాఠం మన ముందు వుంచాడు...... తిరుగుబాటును అంతం చేయుటమేకాక దాని స్వభావ స్వరూపాల్ని విశ్వానికి చూపించా లన్నది ఆయన ఉద్దేశ్యం, .... ఇతర ప్రపంచములో వున్న పవిత్ర నివాసులు భూమిపై జరుగుచున్న సంఘటనలు ఎంతో ఆసక్తికరముగా తిలకించుచున్నారు.....దేవుడు కరుణ యావత్ర పంచం గుర్తిస్తుంది. తన ప్రణాళికను ఒకటి తర్వాత ఒకటి పూర్తిగా సాగుతూ లక్ష్యసిద్ధికి చేరుకొంటుండగా దేవునికి యావత్విశ్వం సానుభూతి సమ్మతి లభిస్తుంది. పితరులు - ప్రవక్తలు, 78, 79 (1890).LDETel 19.1

  మనుష్యులను రక్షించుటకు క్రీస్తు చనిపోయిన దృశ్యము కేవలము పరలోకము, మనుష్యునికి అందుబాటులో వుంచటమే కాదు గాని, తిరుగుబాటు చేసిన సాతను విషయములో దేవుడు మరియు అతని కుమారుడు న్యాయమును జరిగించెనని ఈ విశ్వము ముందు ధ్రువపర్చుతుంది. పితరులు - ప్రవక్తలు, 68, 69 ( 1890).LDETel 19.2

  మంచి చెడుల మద్య జరుగుచున్న మహా సంగ్రామము యొక్క ముగింపు ఘట్టాన్ని విశ్వమంత అమితాశక్తితో పరిశీలిస్తున్నది. ప్రవక్తలు -రాజులు, 148 (c.1914).LDETel 19.3

  మన ఈ చిన్న ప్రపంచం ఈ విశ్వానికి పాఠ్య పుస్తకం.- యుగయుగాల ఆకాంక్ష 19 (1898) పాపరహిత కోకాల నివాసులు మరియు పరలోకమందున్న దేవదూతలు గెత్సమనేలో క్రీస్తు పడుచున్న వేదనను అత్యంత ఆసక్తితో ” వీక్షించారని (ఎఎన్ వైట్ వివరించేను ) యూగయుగాల ఆకాంక్ష (DA 693).LDETel 19.4

  క్రీస్తు నాలుగు వేల సంవత్సరాలునుండి సాతానుతో యుద్ధము చేస్తూ ఇక చివరికి శిలువలో విజయుడైనాడు అని ఆమే వివరించుచుండగా ఈ విధముగా ప్రకటించినది. పరలోక విశ్యం చూసింది, పరలోకములు, మరియు పాపరహిత ప్రపంచాలు సాక్షులె యున్నాయి వారు విక్షించారు, పరలోకము ఆశక్తితో చూచింది, అహో! పరలోక విశ్వా నివాసులకు చూడడానికి ఇది ఎంత విచిత్ర దృశ్యం! యుగయుగాల ఆకాంక్ష693, 759, 760.]LDETel 19.5