Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తక్కువ రకం శాస్త్రం కాదు

    వంట తక్కువ రకం శాస్త్రం కాదు. వ్యావహారిక జీవితంలో అతి ముఖ్య విషయాలలో అది ఒకటి. అది స్త్రీలందరూ నేర్చుకోవలసిన శాస్త్రం . పేదవర్గాలకు చెందిన ప్రజలకు ఉపకరించే రీతిగా దాన్ని బోధించాలి. ఆహారాన్ని కమ్మగాను, అదే సమయంలో సామాన్యంగాను పౌష్టికంగాను తయారు చెయ్యటానికి నిపుణత అవసరం. దాన్ని సాధించవచ్చు. సామాన్యమైన ఆహారాన్ని సామాన్యంగా ఆరోగ్యదాయకంగా దాని సామాన్యత వల్ల అది రుచిగా, బలవర్ధకంగా ఉండేటట్లు ఎలా తయారు చెయ్యాలో వంటకత్తెలు, వంటగాళ్లకు తెలియాలి.CDTel 265.1

    కుటుంబ బాధ్యత కలిగి, అయినా ఆరోగ్యకరమైన వంట కళని అవగాహన చేసుకోని ప్రతీ స్త్రీ తన కుటుంబ సంక్షేమానికి ఎంతో అవసరమైన ఆ కళను నేర్చుకోవాలన్న ధృఢ నిశ్చయం కలిగి ఉండాలి. అనేక స్థలాల్లో ఆరోగ్య వంట పాఠశాలలు ఈ రకమైన ఉపదేశానికి అవకాశం కల్పిస్తాయి. ఇలాంటి సహాయానికి వసతులులేని స్త్రీ ఓ మంచి వంటకత్తె వద్ద ఉపదేశం పొంది, వంట కళలో గురువుగా పేరు పొందే వరకు వృద్ధి సాధించటానికి పరిశ్రమించాలి.CDTel 265.2

    వంటకు జీవితంతో దగ్గర సంబంధం ఉంది కనుక అది మిక్కిలి విలువైన కళ-817]CDTel 265.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents