Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    శ్రీమతి వైట్ ఆహార విధానాన్ని ప్రశ్నించేవారికి వివరణ

    ఉత్తరం 50, 1908 CDTel 516.1

    23. ఆరోగ్యసంస్కరణ సూత్రాల్ని నేను కలంతో ప్రబోధించిన రీతిగా ఆచరణలో పెట్టటం లేదని కొందరు నివేదిస్తున్నారట. కాని నాకు తెలిసినంత వరకు నేను ఇంతవరకు ఈ సూత్రాల్ని ఉల్లంఘించలేదని చెప్పగలను. నా భోజన బల్లపై నాతో భోజనం చేసిన వారు నేను తమ ముందు మాంస పదార్ధాలు పెట్టలేదని ఎరుగుదురు........CDTel 516.2

    ఇంటివద్ద నా భోజనబల్లపై మాంసం తిని అనేక సంవత్సరాలయ్యింది. మేము టీ, కాఫీలు వాడం. అప్పుడప్పుడు పూరేకులతో చేసిన టీ వేడి పానీయంగా తాగుతాను. మా కుటుంబంలో దాదాపు ఎవరూ భోజనం చేసేటప్పుడు ఎలాంటి పానీయం తాగరు. నా భోజనబల్ల మీద బటర్ బదులు వెన్న ఉంటుంది. అతిథులున్నప్పుడు కూడా ఇది ఉంటుంది. అనేక సంవత్సరాలుగా నేను బటర్ వాడకం మానేశాను.CDTel 516.3

    అయినా మేము తినేది పోషకపదార్థాలుగల ఆహారం. మాకు ఎండబెట్టిన పండ్లు, క్యాన్ చేసిన పండ్లు సమృద్ధిగా ఉంటాయి. మా పండ్ల పంట తక్కువగా ఉన్నప్పుడు మేము మార్కెట్టులో కొన్ని పండ్లు కొంటాం. సోదరి గ్రే నాకు గింజల్లేని ద్రలు పంపుతాదీ. ఇవి స్ట్యూ చేసుకుంటే అది నోరూరించే కమ్మని వంటకమౌతుంది. మేము సొంతంగా లాగన్బరీలు పండించి వాటిని విరివిగా వాడ్డాం . ఈ స్థలంలో స్ట్రాబెరీలు సరిగా పండవు. కాని మేము మా పక్కింటి వారి వద్ద బ్లేక్ బెరీలు, రేస్ బెరీలు, ఏపి లు, పేర్లు, కొంటాం. మాకు టమాటోలు కూడా బాగా పండుతాయి. మంచి రకమైన స్వీట్ కారన్ కూడా మేము పండిస్తాం. ఎక్కువ మొత్తంలో వాటిని ఎండబెట్టి చలికాలంలో ఉపయోగించుకుంటాం. మాకు సమీపంలో ఓ ఆహార కర్మాగారముంది. దానికి మేము గింజలతో తయారు చేసిన ఆహార పదార్థాల్ని సరఫరా చేస్తాం.CDTel 516.4

    [ఎండబెట్టిన కార్న్, బటానీల వినియోగం-524]CDTel 517.1

    ఏ ఆహారపదార్థాల మిశ్రమాలు మాకు సరిపడతాయో నిర్ధారించటానికి మా వివేచననుపయోగించటానికి ప్రయత్నిస్తాం. ఆహార అలవాట్ల గురించి, మితానుభవం గురించి వివేకంగా వ్యవహరించి కార్యం నుంచి కారణాన్ని గ్రహించటం మన విధి. మనం మన పాత్ర నిర్వహించటానికి సిద్ధంగా ఉంటే, మన శక్తిని కాపాడటానికి మన ప్రభువు తన పాత్ర నిర్వహిస్తాడు.CDTel 517.2

    నలభై సంవత్సరాలకు పైగా నేను రెండుపూటలు మాత్రమే భోజనం చేస్తున్నాను. ఏదైనా ప్రాముఖ్యమైన పని చెయ్యాల్సి వచ్చినప్పుడు నేను తినే ఆహారాన్ని పరిమితం చేసుకుంటాను. కడుపులో అస్తవ్యస్త పరిస్థితి కలిగిస్తుందని అనుమానం కలిగించే ఏ ఆహారాన్ని తోసి పుచ్చటం నా విధి అని నేను భావిస్తాను. నా మనసు దేవునికి ప్రతిష్ఠితమవ్వాలి. నా మానసిక శక్తుల్ని దెబ్బతియ్యటానికి దోహదపడే ఏ అలవాటు విషయంలోనైనా నేను జాగ్రత్తగా ఉండాలి.CDTel 517.3

    ఇప్పుడు నా వయసు ఎనభై ఒక సంవత్సరం. ఓ కుటుంబంగా మేము ఐగుప్తు మాంసపు కుండకోసం తహతహలాడమని నేను సాక్ష్యమివ్వగలను. ఆరోగ్యసంస్కరణ సూత్రాల ప్రకారం నివసించటం ద్వారా కలిగే మేళ్లు నాకు తెలుసు. ఆరోగ్య సంస్కర్తగా నివసించటం ఓ ఆధిక్యతగా ఓ విధిగా నేను పరిగణిస్తాను.CDTel 517.4

    అయినా ఆరోగ్య సంస్కరణ పై వచ్చిన వెలుగును నిష్కర్షగా అనుసరించని వారు అనేకమంది ఉన్నందుకు సంతాపం చెందుతున్నాను. తమ అలవాట్లలో ఆరోగ్య సూత్రాల్ని అతిక్రమించేవారు, ప్రభువు తమకిచ్చిన వెలుగును అనుసరించని వారు పర్యవసానాల్ని తప్పక అనుభవిస్తారు.CDTel 517.5

    నా ఆహార విధానం గురించి ప్రశ్నించే వారికి మీరు సమాధానం చెప్పగలిగేందుకు ఈ వివరాలు మీకు రాస్తున్నాను......CDTel 518.1

    నేను ఇంత విస్తారంగా రాయటానికి, ప్రసంగించటానికి శక్తి కలిగి ఉండటానికి కారణం ఆహార పానాల్లో నేను నిష్కర్షగా మితం పాటించటమేనని నేను పరిగణిస్తున్నాను. నాముందు రకరకాల భోజన పదార్థాలు పెడితే నాకు సరిపడే వాటినే ఎంపిక చేసుకోటానికి ప్రయత్నిస్తాను. ఈ రకంగా నేను మానసిక స్పష్టతను నిర్మలతను పొందగలుగుతున్నాను. పులియజేసే ప్రక్రియకు దారితీసే ఏ పదార్థాన్ని తెలిసి తినను. ఆరోగ్య సంస్కర్తలందరు నిర్వర్తించాల్సిన విధి ఇది. మనం కార్యం నుంచి కారణాన్ని గ్రహించాలి. అన్ని విషయాల్లో మితం పాటించటం మన విధి.CDTel 518.2