Go to full page →

దేవ కుమారులగుటకు మానవులకు క్రీస్తు శక్తి నిచ్చుట CChTel 195

ఆయన సిలువ మరణమునకు ముందటి రాత్రి క్రీస్తు మేడ గదిలో పలికిన మాటలను గూర్చి పర్యాలోచింతము. ఆయనకు శ్రమకాలము దాపురించుచున్నది. కఠినముగా శోధించబడి పరీక్షించబడనున్న తన శిష్యుల నాయన ఓదార్చ సమకట్టెను. CChTel 195.4

దేవునికిని తనకును సంబంధము గూర్చి క్రీస్తు పలికిన మాటలను శిష్యులు గ్రహించలేదు. ఆయన ఉపదేశములో నెక్కువ భాగము వారికి అగోచరముగా నుండెను. వారికిని, తమ వర్తమాన భవిషయత్కాల ఆసక్తులకును దేవునికిని గల సంబంధమును గూర్చి వారికున్న అజ్ఞానమును వారడిన ప్రశ్నలే బయలుపరచినవి. వారు దేవుని గూర్చి సుస్పష్టముగాను, నిష్కర్షగాను తెలిసికొనవలెనని క్రీస్తు అభిలషించెను. CChTel 195.5

పెంతెకోస్తు దినమున తమపై పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడినప్పుడు క్రీస్తు దృష్టాంతరములతో పలికిన సత్యములు శిష్యులు గ్రహించిరి. వారికి మర్మములగానున్న బోధలు ప్రస్పుటమాయెను. పరిశుద్ధాత్మ క్రుమ్మరింపువలన తమకు కలిగిన వివేకముతమ విపరీత సిద్ధాంతముల విషయమును గూర్చి యిప్పుడు వారికి కలిగిన జ్ఞానముతో పోల్చి చూచిన వారి ఊహాగానములు, వ్యాఖ్యలు, బుద్దిహీనముగా అగపడెను. వారు ఆత్మచే నడిపింపబడిరి. ఒకానొకప్పుడు చీకటిమయమైన వారి దృక్పథమున వెలుగు ప్రకాశించెను. కాని క్రీస్తు వాగ్దత్త సాఫల్యమును శిష్యులు యింకను పూర్తిగా పొందలేదు. దేవుని గూర్చి తాము భరించగల జ్ఞానము నంతటిని వారు పొందిరి. కాని క్రీస్తు తండ్రిని స్పష్టముగా వారికి కనబరతునన్న వాగ్దానము ఇంకను సంపూర్ణముగా నెరవేరలేదు. ఈనాడు కూడా అట్లే యున్నది. దేవుని గూర్చిన మన జ్ఞానము కొంచమై అసమగ్రముగా నున్నది. పోరాటము ముగిసిన పిమ్మట పాప లోకములో తన్ను గూర్చి నిజాయితీగా, సాక్ష్యమిచ్చిన నమ్మకమైన సేవకులను గూర్చి యేసుక్రీస్తు తన తండ్రి ముందు ఒప్పుకొనుతరి ఇప్పుడు మర్మములుగా అగపడు విషయములను వారప్పుడు గ్రహించెదరు. CChTel 196.1

క్రీస్తు తనతో పరలోకమునకు మహిమపర్చబడిన మానవత్వమును కొనిపోయెను. ఆయనను అంగీకిరించువారికిదేవ కుమారులగుటకు ఆయన శక్తినిచ్చి తద్వారా తనతో యుగ యుగములు నివసించుటకు దేవుడు వారి నంగీకరించునట్లు చేయును. ఈ జీవితమందు వారు దేవునిపట్ల ప్రభుభక్తి పరాయణులై యున్నచో తుదకు వారు “ఆయన ముఖ దర్శనము చేయుదురు. ఆయన నామము వారి నొసళ్లయందుండును.” (ప్రక. 22:4) దేవుని ముఖదర్వనము తప్ప పరమందు వేరొక ఆనందము కలదా? క్రీస్తు కృపచే రక్షింపబడిన పాపికి దేవుని ముఖదర్శనము చేసికొని ఆయన పితృత్వము పొందుటకన్న గొప్ప ఆనందము వేరొకటి యుండునా? CChTel 196.2