Go to full page →

తన బిడ్డలయందు దేవుని వ్యక్తిగతాసక్తి CChTel 196

క్రీస్తునకును దేవునికిని గల సంబంధము గూర్చి లేఖనములు విస్పష్టముగా వివరించుచున్నవి. వారి మూర్తిత్వమును, వ్యక్తిత్వమును లేఖనములు స్పష్టీకరించుచున్నవి. CChTel 196.3

దేవుడు క్రీస్తు యొక్క తండ్రి. క్రీస్తు దేవుని కుమారుడు. క్రీస్తునకు ఉన్నత స్థానమీయబడినది. ఆయన తండ్రితో సమానముగా చేయబడెను. దైవాలోచనములన్నియు కుమారునికి ఎరుకయే. CChTel 196.4

యోహాను 17వ అధ్యాయమందు కూడ క్రీస్తు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థనలో ఈ ఐక్యత గోచరమగు చున్నది. CChTel 197.1

“మరియు నీవు నన్ను పంపితినని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై యుండవలెనని వారికొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాపముంచు వారందరును ఏకమై యుండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై యున్న లాగున వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి యిచ్చితిని. వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితిని ఈ లోకము తెలిసికొనునట్లు (నా కనుగ్రహించిన మహిమను వారికిచ్చితిని)” (యోహాను 17:20`23. ) CChTel 197.2

ఎంత చక్కని వాక్యము! క్రీస్తుకును తన శిష్యులకును మధ్యగల ఐక్యత వారిలో నెవరి వ్యక్తిత్వమును భంగము చేయదు. వారి వ్యక్తిత్వమునందుగాక, కర్తవ్యమందును, ఉద్దేశమందును ఏకమై యున్నారు. దేవుడును క్రీస్తును ఈ విషయములో ఏకముగానున్నారు. CChTel 197.3

పరలోక భూలోకములు దేవుని ఆజ్ఞను శివసావహించును. మనకు కావలసినదేమో ఆయనకు అవగతమే. మన ముందున్న మార్గములో కొంత భాగము మాత్రమే మనము చూడగలము. “మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు.” (హెబ్రీ4:13. ) ప్రపంచ అల్లకల్లోల పైభాగములపై ఆయన ఆసీనుడై యుండెను. ఆయన దృష్టికి సర్వమును గోచరమగును. ఆయన తన అధిక అచంచల నిత్యత్వము నుండి మనకు మంచిదని తోచిన దానిని మనకు కలుగజేయును. CChTel 197.4

తండ్రికి యెరుక లేనిదే యొక పిచ్చుకకూడ నేలను పడదు. దేవునియందు తనకు గల ద్వేషమును బట్టి నోరులేని జీవరాసులను సయితము నాశనము చేయుటనందు సాతానుడు ఆనందించు చున్నాడు. కాని ఆయన తుదకు పిచ్చుకలనుకూడ మరచిపోడు. “భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్టులు.” (మత్తయి 10:31. )28T 263—273. CChTel 197.5