Go to full page →

అధ్యాయము 19 - క్రైస్తవులు దేవుని ప్రతినిధులు CChTel 198

తన ప్రజలయందు తన రాజ్యసూత్రములను బయలు పర్చవలెనని దేవుని సంకల్పము. బ్రతుకునదును, శీలమునందును ఈ సూత్రములను వారు కనపర్చుటకు గాను, వారిని ప్రపంచారములనుండియు, అలవాటు నుండియు, అభ్యాసము నుండియు వేరుచేయవలెనని ఆయన వాంఛ, వారికి తన చిత్తము తెలుపుటకు గాను వారిని తన చెంత చేర్చుకొనవలెనని ఆయన యత్నించు చున్నాడు. CChTel 198.1

ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుడి వెలుపలకు తీసికొని వచ్చినపుడు వారి ద్వారా సాధించనెంచిన కార్యమునే తన ప్రజల ద్వారా నేడు కూడా ఆయన సాధింపజూచుచున్నాడు. CChTel 198.2

సంఘమునందలి సామరస్యము, దయ, న్యాయము, దైవ ప్రేమలను చూచుట ద్వారా ప్రపంచము ఆయన శీలమును గ్రహించవలసి యున్నది. ఇట్లు జీవితమందు దైవ ధర్మ శాస్త్రము ప్రదర్శించబడుచో దేవుని ప్రేమించి ఆయనకు భయపడి ఆయన సేవ చేయువారి ఔన్నత్యమును ప్రపంచము సైతము గుర్తించును. CChTel 198.3

తన ప్రజలలో ప్రతి ఒక్కనిపై దైవదృష్టి యున్నది. ప్రతి వ్యక్తిని గూర్చి ఆయనకు ఏర్పాట్లు గలవు. తన పరిశుద్ధ నియమము నవలంబించువారు ప్రత్యేక గురుతర జనాంగముగా నుండవలెనని ఆయన సంకల్పము. ఆత్మావేశ పూరితుడై మాషే వ్రాసిన మాటలు పురాతన ఇశ్రాయేలీయులకు ఎట్లో నేటి దైవ ప్రజాబాహుళ్యమునకును అట్లే అన్వయించును. నీవు నీ దేవుడైన యోహోవాకు ప్రతిష్ట జనము. నీ దేవుడైన యోహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పర్చుకొనెను. ద్వి. తి. 7. 6. 16T 9, 12; CChTel 198.4