Go to full page →

క్రీస్తు రెండవ రాకడను జ్ఞాపకము చేయు ఆచారము CChTel 249

వారు బల్ల చుట్టు కూడియుండగా గద్గద స్వరముతో ఆయన యిట్లు చెప్పెను: “నేను శ్రమపడకమునుపు మీతో కూడా ఈ పస్కాము భుజించవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తికొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ` మీరు దీని తీసికొని మీలో పంచుకొనుడి.” (లూకా 22:15`18). CChTel 249.2

కాని ప్రభురాత్రి భోజన సంస్కారము విచారముతో నిండిన కూటము కారాదు. ఇది దాని ఉద్దేశ్యము కానేకాదు. ప్రభుని అనుచరులు ఆయన బల్ల చుట్టు గుమిగూడి తమ తప్పిదములను జ్ఞప్తికి దెచ్చుకొని విలపింపరాదు. మత విషయకమైన తమ గతానుభవమును గూర్చి వారు చింతించరాదు. అది ఉత్తేజకరమైనను విషాదకరమైనను దానిని గూర్చి వారు చింతించరాదు. అది ఉత్తేజకరమైనను విషాదకరమైనను దానిని గూర్చి చింతించరాదు. తమకును తమ సహోదరులకును మధ్య లేచిన విబేధములను గూర్చి వారు చింతించరాదు. సిద్దబాటు సంస్కారములో ఇవి యన్నియు పరిష్కరించబడినవి. ఆత్మ పరీక్ష, పాపపు ఒప్పుకోలు విభేదముల పరిష్కారము ` ఇవన్నియు నిర్వహించబడినవి. CChTel 249.3

ఇప్పుడు క్రీస్తును సంధించుటకు వారేగుదెంచిరి. సిలువ ఛాయలో నిలచుటకు గాక రక్షణ వెలుగులో నిలుచుటకు వారు వచ్చిరి. నీతి సూర్యుని ప్రచండ కిరణమును గాంచుటకు వారు తమ ఆత్మను విప్పవలసియున్నారు. వారి కగోచరమైనను ఆయన సన్నిధానమును సంపూర్ణముగా గుర్తించి క్రీస్తుని ప్రశస్త రక్తముతో కడుగబడిన హృదయములు కలవారై వారు ఆయన చెప్పు మాటలను ఆలకించవలెను. CChTel 249.4

“సమాధానము మీకనుగ్రహించుచున్నాను. లోక మిచ్చునట్లుగా నేను మీ కనుగ్రహించుట లేదు”. (యెహాను 14:27) CChTel 250.1

నలుగగొట్టబడిన క్రీస్తు శరీరమును, చిందించబడిన ఆయన రక్తమును సూచించు రొట్టెను ద్రాక్షరసమును అందుకొన్నప్పుడు ఊహలో మేడపై గదిలో జరిగిన ప్రభురాత్రి భోజన దృశ్యములో మనము పాల్గొనెదము. లోకపాపములను మోసిన ఆ ప్రభువు పొందిన బాధచే పునీతము చేయబడిన వనములో నుండి మనము వెళ్లుచున్నట్లగపడును. దేవునితో మనకు రాజీ కుదురుటకు జరిగిన పోరాటమును మనము చూచెదము. క్రీస్తు మన మధ్య సిలువ వేయబడినట్లు చూచెదము. CChTel 250.2

సిలువ వేయబడిన రక్షకుని చూచుచు మనము ఆ పరలోకరాజు చేసిన సమర్పణా విస్తృతిని, భావమును ఇతోధికముగా గ్రహింతుము. రక్షణ సంకల్పము మనకు గోచరమగును. కల్వరి గూర్చిన తలంపు మన హృదయములలో సజీవమైన, పవిత్రమైన అవ్యక్తానందమును కలిగించును. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు స్తుతి మన హృదయములలోను పేదవుల మీదను తాండవించును. కారణమేమనగా కల్వరి దృశ్యమును నూతనముగా స్మరించువారి ఆత్మలో గర్వము, ఆత్మస్తుతి ఉండజాలవు. CChTel 250.3

మన ప్రభుని మహత్తర బలిదానమును విశ్వాసముతో ధ్యానించగా క్రీస్తు ఆధ్యాత్మిక జీవితమును ఆత్మ జీర్ణించుకొనును. ప్రతి ప్రభు రాత్రి సంస్కారము నుండి ఆయాత్మ ఆధ్యాత్మిక బలమును సమార్జించు కొనును. ఆ సంబంధము ద్వారా విశ్వాసి క్రీస్తుతోను తద్వారా తండ్రితోను జతపర్చబడును. అది ప్రత్యేక విధముగా నిస్సహాయ మానవులకును దేవునికిని సంబంధము కుదుర్చును. CChTel 250.4

ప్రభురాత్రి భోజన సంస్కారముము క్రీస్తు ద్వితీయాగమనమును చూపించుచున్నది. శిష్యుల హృదయములలో ఈ నిరీక్షణ తేటగా నుండుటకు యిది ఉద్దేశించ బడినది. ఆయన మరణము జ్ఞాపకము చేసికొనుటకు వారు సమావేశమైనపుడెల్లా ఆయన ఎట్లు “గిన్నె పట్టుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి వారికిచ్చి ` దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నాతండ్రి రాజ్యములో మీతో కూడ నేను ద్రాక్షరసుమును క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను త్రాగానని చెప్పుచున్నాననె “నో సింహలోకనము చేసికొను చుండెడివారు. (మత్తయి 26:27-29)శ్రమలు కలిగినప్పుడు తమ ప్రభవు తిరిగి వచ్చునను నిరీక్షణ వారి కాదరణ నొసంగెను. “మీరు ఈ రొట్టెతిని యీ పాత్రలో నిది త్రాగునపుడెల్ల ప్రభువు వచ్చు పర్యంతము ఆయను మరణము ప్రచురించుదురు. ”అను తలంపు వారికి అమూల్యమై యుండెను. (1 కోరింధీ 11:26). CChTel 250.5

ఇవి మన మెన్నడును మరవరాని సంగతులు,బలవంతముచేయు శక్తి గల యేసుని ప్రేమ మన స్ప్రుతి పధమందు నిలువ వలెను. మన యెడల చూపబడిన దైవ ప్రేమను గూర్చి మన మనోశక్తులను వ్యక్త సరచుటకు గాను ఈ యాచారమును క్రీస్తు స్థాపించెను. క్రీస్తు ద్వారా వినా దేవునకిని మన యాత్మలకు సమైక్యత కుదురదు. సహోదరునికి సహోదరునికి,మధ్యగల ప్రేమ ,ఐకమత్యములు యేసు ప్రేమద్వారా పటిష్టము చేయబడి చిరస్థాయిగా నుంచబడ వలెను. క్రీస్తు యొక్క మరణమే ఆయన ప్రేమను మనకు సార్ధకము గావించును. ఆయన మరణము వలననే మనము ఉత్సాహముతో ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూడ గలుగుచున్నాము. మన నిరీక్షణకు కేంద్రము ఆయన త్యాగమే. దీనిపై మనము మన విశ్వాసమును నిర్మించ వలెను. 2DA 643-661. CChTel 251.1