Go to full page →

అధ్యాయం 27 - సతీపతుల ఎన్నిక CChTel 252

వివాహము ప్రస్తుత ప్రపంచమందును భావి ప్రపంచమందును మీ జీవితములకు సంబంధించిన ఒక విషయము. ఈ విషయమందు దైవాంగీకారమును తెలిసికొను వరకు సత్ క్రైస్తవుడు ఏర్పాట్లు కావించనే కావించడు. తనకు తానే యీ ఎన్నిక చేయడు. కాని యీ యేర్పాటును దేవునికే అప్పగించును. మన అనందమునే మనము లక్షింపరాదు. ఎవరైనను తాము ప్రేమించని వారిని పరిణయమాడవలెనని నా భావము కాదు. ఇది పాపమగును. కాని భ్రమ, ఉద్రేకములకు లోనై నాశన మార్గము పట్టరాదు. సంపూర్ణ హృదయమును, ఉత్కృ ష్ట ప్రేమను దేవుడు కోరుచున్నాడు. CChTel 252.1

వివాహమాడదలచు వారు తాము స్థాపించనున్న గృహము యొక్క నడత, పలుకుండి ఎట్లుండునా అని యోచింపవలెను. తల్లిదండ్రులైనపుడు వారికి ఒక పవిత్ర బాధ్యత అప్పగింపబడును. ఈ ప్రపంచములో తమ బిడ్డల యొక్క సుఖప్రదమైన మనుగడ, భావి ప్రపంచము నందు ఆనందము ఎక్కువ భాగము వారి మీదనే ఆధారపడి యుండును. ఎక్కువ భాగము పిల్లలుపొందు శారీరక, నైతిక స్వరూపమును తల్లిదండ్రులే నిర్ణయించెదరు. గృహ స్థితిపై సమాజ స్థితి ఆనుకొని యుండును. సంఘము యొక్క బాగోగులు కుటుంబ ప్రభావముపై ఆధారపడి యుండును. CChTel 252.2

స్నేహము చేయుట యందును స్నేహితుల నేర్పరచుకొనుట యందును, క్రైస్తవ యువజనులు కడు జాగ్రత్తగా నుండవలెను. ఇప్పుడు మీరు మంచి బంగారనమి దేనిని పరిగణించుచున్నారో అది చౌకబారిన లోహము కాకుండునట్లు జాగ్రత్త పడుడి. ప్రాపంచిక మిత్రత మీరు దేవుని సేవించకుండ అవరోధము కలిగించును. ప్రగతి శీలమునకు సాయపడ లేని వ్యాపారము లేక వైవాహిక సంబంధము వలన జరిగిన ఐక్యత కారణముగా అనేక ఆత్మలు నశించుచున్నవి. CChTel 252.3

మీ జీవితమును ఎవరితో గడపనెంతురో ఆ వ్యక్తి యొక్క ప్రతి అభిప్రాయమును ఎంచి శీలము నందలి ప్రతివిధముయిన మార్పును పరిశీలించుడి. మీరు చేయనున్న కార్యము మీ జీవితమందలి ప్రాముఖ్యమైన విషయములలో ఒకటి. కనుక ఆనాలోచితముగా ఈ కార్యమును నిర్వహించరాదు. ప్రేమించ వచ్చును, కాని గ్రుడ్డితనముగా ప్రేమించరాదు. CChTel 252.4

మీ వివాహిత జీవితము ఆనందదాయకముగా నుండునో లేక అనైక్యత కలిగి దుర్భరముగా నుండునో జాగ్రత్తగా పరీక్షించుకొనుడి. పరలోకము తట్టుకు పురోగమించుటకు ఈ జత నాకు తోడ్పడునా? దేవుని యందలి నా ప్రేమనిది వృద్ధిపరుచునా? ఈ జీవితములో నా పలుకుబడినిది విస్తరింపజేయునా? అను ప్రశ్నలను వేసికొనుడు. వీనికి అనుకూలమైన జవాబు లభ్యమైనచో అప్పుడు దైవభీతియందు పురోగమించుడి. CChTel 253.1

వధూవరుల ఎన్నిక తమకును, తమ పిల్లలకును, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సుక్షేమము నీయగలదై యుండవలెను. తోడి మానవులను ఆశీర్వదించి సృష్టి కర్తను గౌరవించుటకు తమకు, తమ బిడ్డలకు తోడ్పాటు నీయగలదై యుండవలెను. CChTel 253.2