Go to full page →

భావి అర్థాంగి యుండవలసిన లక్షణములు CChTel 253

జీవిత కష్టనిష్టూరములను సహించ సామర్థ్యము గల స్త్రీని యువకుడు తన సహధర్మచారిణిగా ఎన్నుకొనవలెను. తన పలుకుబడిచే అతనికి సాధుత్వము, సంస్కారము కలిగించి తన ప్రేమచే అతనిని సంతోషపరచగల యువతిని యువకుడు వివాహమాడవలెను. CChTel 253.3

“బుద్ధిగల భార్య యెహోవాయొక్క దానము” ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యుంచును. ఆమె తాను బ్రతుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాకి కీడేమియు చేయదు. జ్ఞానము కలిగిన తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమో తన యింటివారి నడతలను బాగుగా కనిపెట్టును. పనిచేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పవిత్రతా ధర్మము ననుసరించి యున్నారు గాని వారందరిని నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఇట్టి భార్య దొరికిన వానికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు.” CChTel 253.4

ఈ విషయములు పరిగణింపదగినవి. మీరు పరిణయమాడదలచిన వ్యక్తి మీ గృహమును సంతోషపరుచునా? ఆమె పొదుపు కలిగిన స్త్రీయేనా? లేక తన సంపాదననే గాక మీ సంపాదనను కూడా సింగారించుకొను ఇచ్చ తీర్చుకొనుటకు ఆమె దుబారా చేయునా? ఈ విషయమందు ఆమె నియమములు నిర్థుష్టమైనవేనా? ఆమె యందు సద్గుణములేమైనా కలవా? మోహముతోను వివాహ తలంపుతోను నిండిన మనుష్యుని మనస్సుకు ఈ ప్రశ్నలు నిష్ప్రయోజకములుగా కాన్పించునని నాకు తెలియును. కాని యీ విషయములు ఆలోచించబడవలసినవి. కారణమేమనగా మీ భావి జీవితము వీనిపై నాధారపడియుండును. CChTel 253.5

భార్యను ఎన్నుకొనుటలో ఆమె శీలమును పరిశీలించుడి, ఓర్పు కలిగి శక్తి వంచన లేకుండ ఆమె పని చేయునా? ఈతనిని వారితో పొత్తులేకుండా జేసి తన స్వకీయ వినోదములకు అనువగు విధముగా అతడు మెలగునట్లు చేసి తద్వారా తల్లిదండ్రులు ప్రేమ పూరితమైన కుమార్తెగా ఆమెను పొందుటకు బదులు తమ కుమారులనే పొగొట్టుకున్న వారగుటకామె కారకురాలగునా? CChTel 254.1