Go to full page →

అధ్యాయము 31 - భార్య భర్తల సంబంధము CChTel 281

దేవుని పరిశుద్ధోపదేశముచే కాపాడబడుచున్న ఆచారములలో నొకటిగా వివాహమును పరిగణించువారు వివేచన అదుపాజ్ఞలకు కట్టుబడి యుందురు. CChTel 281.1

ఏ వర్గీయులును అవివాహితులుగ నుండవలెనని యేసు ఆదేశించలేదు. పరిశుద్ధ వివాహసంబంధమును రద్దు చేయుట కాయన రాలేదు. కాని దానిని ఘనపరచి దాని యధాపూర్వ పవిత్ర స్థితికి తెచ్చుటకే ఆయన వచ్చెను. పవిత్రమైన, నిస్వార్థమైన ప్రేమ ఉన్న కుటుంబమును చూచి ఆయన ఆనందించును. CChTel 281.2