Go to full page →

వివాహము న్యాయమైనది పవిత్రమైనది CChTel 281

తినుటలోను త్రాగుటలోను లేక పెండ్లి చేసికొనుటలోను, పెండ్లికిచ్చుటలోను పాపములేదు. నోవహు కాలములో వివాహమాడుట న్యాయసమ్మతముగానే యుండెను. న్యాయమైనది పాపమగు నంతగా దుర్వినియోగము చేయబడక యున్నచో వివాహ మాడుట యిప్పుడు కూడా న్యాయసమ్మతమే. కాని నోవహు దినములలో ప్రజలు దేవుని సంప్రదించకుండ ఆయన ఉపదేశమును నడుపుదలను పాటించకుండా పెండ్లి చేసికొనిరి. CChTel 281.3

ఈ జీవితమందు మన సంబంధములు తాత్కాలికమైనవను విషయమును మన సమస్త క్రియలలోను, వాక్కులలోను మార్పు కలుగజేయవలెను. న్యాయసమ్మతమైన దానిని విపరీతముగా అపారముగా ప్రేమించుట వలన నోవహు దినములలో వివాహము ఒక పాపముగా పరిణమించినది. ఈ యుగమందనేకులు వివాహపు తలంపులలోను దాంపత్య క్రియ యందును నిమగ్నులైయున్న హేతువుచేత తమ ఆత్మలను పోగొట్టుకొనుచున్నారు. CChTel 281.4

వివాహ బాంధవ్యము పవిత్రమైనదే. గాని హీనస్థితిలో నున్న యీ యుగములో అది సమస్త దుర్ణీతితో నిండుకొని యున్నది. జలప్రళయమునకు ముందు జరిగిన వివాహములు ఆ దినములలో ఒక నేరముగా పరిణమించినవి. అట్లే నేడు వివాహము దుర్వినియోగ ము పరచబడి అంత్య దినములను చూపించు సూచనలలో నొకటిగా పరిణమించినది. వివాహము యొక్క పవిత్ర స్థితిని దాని హక్కులను గ్రహించినచో ఇప్పుడు కూడా దేవుడు దాని నంగీకరించుచున్నాడు. తత్పలిఫలితముగా ఇరు పక్షముల వారికి ఆనందము కలుగును. దేవునికి మహిమ కలుగును. CChTel 281.5