తల్లికానున్న ప్రతి స్త్రీయును తానెట్టి పరిస్థితులలో నున్నను సర్వదా ఆనందదాయకమైన, ఉత్సాహపూర్ణమైన, సంతృప్తికరమైన చిత్త వృత్తిని పెంపు చేసికొనవలెను. ఈ విషయమై తాను చేయుచున్న ప్రయత్నం లన్నింటికి శారీరకముగాను, నైతికముగాను తన సంతానము యొక్క ప్రవర్తన యందు పది రెట్లు ప్రతిఫలము కలుగునని ఆమె గుర్తించవలెను. అంతేకాదు, ఆమె ఉత్సాహముగా తలంచుట అలవరచుకొని ఆనందకరమైన మన: ప్రవృత్తి కలిగి ఆనందకరమైన తన స్వభావమును తన కుటుంబము పైని, తన స్నేహిత బృందముపైని ప్రతి ఫలింపచేయవచ్చును. ఇట్లు చేసినచో తన శరీరారోగ్యము కూడా చాలవరకు మంచి స్థితియందుండును. శరీరము చైతన్యవంతమై ఆమె నిస్పృహచెంది విచారముగనున్నటివలె రక్తము మందముగా ప్రవహించదు. ఈ ఉత్సాహము వలన మానసిక ఆరోగ్యము నైతికారోగ్యము వృద్దియగును. మనోభావములను చిత్తశక్తి, ప్రతిఘటించగా కలుగును. ఇది నరములను శాంతిపరచును. తల్లిదండ్రుల యొద్ద నుండి పిత్రార్జితము పొందవలసిన యీ శక్తిని పొందలేకున్న పిల్లల విషయము తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ద చూపవలెను. తమ శరీరములకు సంబంధించిన చుట్టములను శ్రద్దగా గైకొనినచో విషయమలు మరింత చక్కబడును. CChTel 289.1
తల్లి కాదలచిన స్త్రీ తన ఆత్మను దైవ ప్రేమయందు నిలుపుకొనవలెను. ఆమెకు మనశ్శాంతి అవసరము. యేసు ప్రేమలో నామె విశ్రమించి క్రీస్తు మాట ప్రకారము ఆమె నడుచుకొనవలెను. తల్లి దేవునితో కలిసి పనిచేయు స్త్రీయని ఆమె జ్ఞాపకముంచుకొనవలెను. CChTel 289.2
భార్య భర్తలు సమైక్యతతో జీవించవలెను. తల్లులందరును దేవుని బలపీఠము నెదుట తమ్మునుతాము సమర్పించుకొని తమ సంతానమును జన్మపూర్వము జన్మాంతరము దేవునికి సమర్పించినచో మన ప్రపంచ పరిస్థితి యెంత బాగుండును! CChTel 290.1
చాలామంది తల్లిదండ్రులు, తల్లిదండ్రుల పలుకుబడి ఫలితము కొరగాని విషయముగా భావించుచున్నారు. కాని దేవుడట్లు భావించుట లేదు. దేవ దూతల ద్వారా పంపబడి చాలా గంభీరముగా రెండు మార్లు ఇయ్యబడిన వర్తమానము మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశమని చూపుచున్నది. CChTel 290.2
హెబ్రీ తల్లి (మనోహు భార్య)కి చెప్పబడిన మాటలలో సర్వయుగములలోని తల్లులతో దేవుడు మాటలాడుచున్నాడు. “జాగ్రత్తగా ఉండి నేను ఆమె కాజ్ఞాపించిన దంతయు ఆమె చేయవలెను” అని దేవదూత చెప్పెను. తల్లి అలవాటుమీద బిడ్డ క్షేమము ఆధారపడి యుండును. ఆమె అభిరుచులు శరీరాశలు నియమ బద్ధములై యుండవలెను. తనకు బిడ్డ నిచ్చుటలో దేవునికిగల ఏర్పాటును ఆమె నెరవేర్చ దలచినచో ఆమె విసర్జించవలసినది వ్యతిరేకించవలసినది కొంత ఉన్నది. CChTel 290.3
యువజనుల పాదములను బంధించుటకు ప్రపంచములో చాలా ఉచ్చులున్నవి. స్వార్థ పూరితమైన, ఇంద్రియ సుఖముతో నిండిన జీవితము అనేకులను ఆకర్షించుచున్నది. CChTel 290.4
తమకు ఆనంద దాయకముగా కనబడు మార్గములో పొంచియున్న అపాయములను ఆ మార్గము యొక్క భయంకరమైన అంతమును వారు గ్రహింజాలకున్నారు. శరీరాశలు అభిరుచులు తీర్చుకొనుట ద్వారా వారి శక్తి ఉడిగిపోవుచున్నది. ఈ లోకమునకును పరలోకమునకును పనికి రాకుండ అనేకులు నాశనము అగుచున్నారు. ఇట్టి శోధనలు తమ బిడ్డలకు వచ్చునని తల్లిదండ్రులు జ్ఞాపకముంచుకొనవలెను. బిడ్డ పుట్టకముందే ఆ బిడ్డ పాపముతో విజయవంతముగా పోరాడుటకు తనకు శక్తిని కూర్చు సిద్దబాటు ప్రారంభము కావలెను. CChTel 290.5
బిడ్డ పుట్టకముందు శరీర్ఛేచలకులోనై, స్వార్థ బుద్ది అసహనము, కాఠిన్యము కలిగి యున్నచో బిడ్డ యొక్క స్వభావమందు ఈ గుణములే ప్రతిబింబించును. ఇట్లు చాలా మంది బిడ్డలు దాదాపు జయింపరాని దుర్గుణమలును జన్మహక్కుగా పొందియున్నారు. CChTel 290.6
కాని తల్లి అచంచలముగా మంచి నియమములను పాటించి మితానుభవము, ఆత్మోపేక్ష కలిగి దయగను నిస్వార్థముగను ఉన్నచో ఈ ప్రశస్త గుణములను ఆమె తన బిడ్డలకు అందించగలదు. CChTel 290.7
పసిపాపల తల్లులకు అద్దమువంటి వారు. వారి యందు తల్లుల తమ సొంత అలవాటులను ,నడవడిన చూడగలరు. కనుక నేర్చుకొను ఈ చిన్నవారి యెదుట ఆమె తన భాషయందు ,ప్రవర్తనయందు ,జాగ్రత్తగా నుండవలెను. వారియందేట్టి గుణములుండవలెనని ఆమె కోరునో అట్టి గుణములను ముందు ఆమె అలవరచు కొనవలెను. CChTel 291.1