Go to full page →

తల్లి బాధ్యతలు తగ్గవలసిన కాలము CChTel 291

ప్రసవమునకు ముందు తల్లి పనిపాటులలో ఏ మార్పునకు లేకుండుట యున్నది సాధారణముగా అందరును చేయుచున్న ఒక పొరపాటు ,ప్రాముఖ్యమైన యీ సమయములో తల్లి తక్కువపని చేయవలెను. ఆమె శరీరమందు గొప్ప మార్పులు కలుగుచున్నవి. ఆమెకు ఎక్కువ రక్తము అవసరము. రక్తపుష్టి కలుగుటకు బలవర్ధకమైన ఆహారములు ఆమెకు అవసరము. బలర్ధకాహరాముని భుజించిననే కాని ఆమె తన శరీరబలమును కాపాడు కొనజాలదు. తత్పర్యవసానముగా ఆమె సంతానమునకు శరీర దార్డ్యముండదు. CChTel 291.2

ఆమెకు తగిన దుస్తులుండవలెను. చలిగాలి తగలకుండ శరీరమును భద్రముగా కాపడుకోనవలెను. దుస్తులలేమిని తీర్చుటకు అనవసరముగా ఆమె తన శక్తిని ఉపయోగించరాదు. తల్లికి ఆరోగ్యదాయకమైన ,బలవర్ధకమైన ఆహరమియకున్నచో ఆమెకుతగినంత మంచి రక్త ముండదు. ఆహారమును మంచి రక్తముగా మార్చు శక్తి ఆమె సంతతిలో కోరవడవలెను. తల్లి ,బిడ్డల ఆరోగ్యము ఎక్కువ భాగము వేడిని పుట్టించు మంచి దుస్తుల మీదను బలవర్ధకాహారము మీదను ఆధారపడి యుండును. CChTel 291.3