Go to full page →

అధ్యాయము 35 - గృహముయొక్క ఆధ్యాత్మిక ప్రభావము CChTel 306

మనము దేవుని యొక్క రక్షణానుభవమును మన గృహములో కలిగి యుండవచ్చును. మనము నమ్మి దాని కొరకు జీవించి దేవుని యందు అవిచ్చిన్నమైన విశ్వాసమును కలిగియుండవలెను. మనమేలు కొరకేదైవ కాక్యము మనపై నిర్బంధములను విధించు చున్నది. మన కుటుంబముల ఆనందమును మన ఇరుగు పొరుగు వారి ఆనందమును అది వృద్ధి పరచును. మన అభిరుచిని సంస్కరించి మన వివేచనను పవిత్ర పరచి మాన శ్శాంతినిచ్చి తుదకు నిత్య జీవనమును ప్రసాదించును. మన గృహములలో పరిచర్యచేయు దేవదుతలుండేదరు. పరిశుద్ద జీవితమందు మనము సాధించిన అభ్యున్నతిని గుర్చిన వార్తను వారు పరలోకమునకు కొనిపోయెదరు. మనలను గూర్చి లేఖిక దూత ఉత్సాహము గొల్పు రీతిగ గ్రంధములందు దాఖలు చేయును. CChTel 306.1

గృహ జీవితమందు క్రీస్తు స్వభావము కాననగును. స్త్రీ పురుషులు సత్యము యొక్కయు ,ప్రేమయోక్కయు పరిసుద్దత ప్రభావమును పొందుటకు తమ హృదయములను తెరిచినచో ఈ సూత్రములు మరల ఎడారిలో సెలఎరువలె ప్రవహించి అందరికిని నూతన బలమోసగి యిప్పుడు నిస్సారము , వునచోట్ల సమృద్ధి అంకురింపజేయును. 1CG 484; CChTel 306.2

గృహమందు మాట విషయికమైన నిర్లక్ష్యము,అనగా పిల్లలకు శిక్షణ నిచ్చుటలో అలక్ష్యముచేయుట దేవునికి చాల అసంతృప్తి కలిగించును. మీ బిడ్డలో నొకడు నదిలో స్నానము చేయుచు కేరతములలో బడి కొట్టుకొనుచు మునిగిపోవుటకు సిద్ధమయినపుడు మీకెన్త ఆందోళన కలుగును. మీ నవజీవిత పరిరక్షణకు ఎన్ని ప్రయత్నములు చేయుదురు. ఎన్ని ప్రార్ధనలు చేయుదురు. వారు శిక్షించబడలేదు. బహుశః వారు కరకుగను అమర్యాద గను జీవించుచు ఎడ్వంటిస్టూ నామమును అపకీర్తి ఘంటించు చున్నారు. వారు నిరీక్షణయు దేవుడును లేక ప్రపంచమందు నాశానమగు చున్నారు. దీని విషయము మీరు నిర్లక్ష్య,ఉను అశ్రద్దయు కలిగి యున్నారు. CChTel 306.3

సాతాను ప్రజలకు దేవుని యొద్ద నుండి నడిపించుటకు శత విధముల కృషి సల్పు చున్నాడు. మత విషయిక జీవితము వ్యాపార చింతలతో నిండియున్నపుడు వ్యాపార విషయములలో వారితలంపులను నిలిపి బైబిలి పటించుటకు,రహస్యముగా ప్రార్ధించుటకు ఉదయ సాయంకాలములందున కుటుంబ ప్రార్ధనలయందును కృతజ్ఞతా స్తుతులు చేలించుటకు శ్రద్దతీసుకొనినపుడతడు జయమును సాధించును. ప్రధాన వంచకుని మోసములను గ్రహించ గలిగిన వారు చాల తక్కువ మంది. అతని మొసములను ఎరుగని వారెందరున్నారు ! 25T 424, 226; CChTel 307.1