Go to full page →

మన యనుమతి లేకుండా సాతాను మనస్సులో ప్రవేశింప జాలాడు CChTel 329

మనము సహించగల దానికి మించి శోదించబడకుండనట్లు దేవుడు ఏర్పాట్లు కావించెను. ప్రతి శోధనతో పాటు తప్పించుకొను మార్గమును కూడ ఆయన ఏర్పాట్లు చేయును. మనము సంపూర్ణముగా దేవుని కొరకు జీవించినచో స్వార్ధపు టూహాలు చేయుటకు మనము మన మనస్సును పోనియము. CChTel 329.2

మనస్సులో ప్రవేశించుటకు మార్గమేదైనా ఉన్నచో సాతానుడు తన గురుగులను విట్టి సమృద్దిగా పంట పండు వరకు నవి పెరుగునట్లు చేయును. మనము ఐచ్చికముగా ద్వారము తెరిచి ప్రవేశించుమని అతనిని ఆహ్వానించితేనే తప్ప సాతనుడు మన తలంపులపైని మాటలపైని క్రియలపైని ఆధిపత్యము చేయజాలడు. ద్వారము తెరిచినచో అతడు లోనికి వచ్చి హృదయమందు విత్తబడిన మంచి విత్తనములను దొంగిలించి సత్యము ఫలించకుండ నట్లు చేయును. CChTel 329.3

సాతాను సలహాను అనుసరించుటద్వార కలుగు లాభములను పరిగణించుటకు వేచియుండుట మంకు క్షేమకరము కాదు. పాపలాలసులందరికి పాపము అగౌరవమును ,నష్టమును కలిగించును. అది అందత్వ కలిగించి మోసగించును. మనస్సును లాలన చేసి శోధన లోనికి దింపును. సాతానుకు వశమైనచో ఆతని శక్తి నుండి మనకు కాపుదల ఉండదు. మనము సాధ్యమయినంత వరకు శోధకుడు మనలో ప్రవేశించగల ప్రతి ద్వారమును మూయ వలెను. CChTel 329.4

ప్రతి క్రైస్తవుడు సర్వదా అప్రమత్తుడై సాతానుడు ప్రవేశించగల ప్రతి మనో ద్వారమును భద్రముగా కాపాడ వలెను. దైవ సహాయము కొరకు ఆతడు ప్రార్ధించు ప్రతి విధమైన పాపేచ్చను పట్టుదలతో ప్రతిఘటించ వలెను. ధైర్యము ,విశ్వాసము ,నిర్వరామ -కృషి వీని ద్వారా అతడు జయించ గలడు. కాని జయమును సాధించుటకు క్రీస్తు అతని యందును ,అతడు క్రీస్తు నందును నివశించవలెను. CChTel 330.1

లోకములో ప్రబలుచున్నపాపము ఎక్కువ కనబడని స్థలమున మనము మన బిడ్డలు నివశించుటకు చేయగలిగిన కృషి చేయ వలెను. ఈ దుస్సంగతులు మన మనస్సులలో ప్రవేసించకుండు నట్లు మనము మన కంటి దృష్టిని చెవులు వినికిడిని జాగ్రత్తగా కాపాడు కొనవలెను. అపాయమునకతి సమీపముగా జీవించ క్షేమముగా నుండ లేము. అపాయము కంట బడిన వెంటనే తోలిగిపోవుడి. ఆత్మ రక్షణ శక్తిని చులకన చేయరాదు. మీ శీలమే మీ ధనము. దానిని బంగారు నిధిగా పరిగణిoచుడి. ప్రవర్తనా పరిశుద్ధత ,ఆత్మ గౌరవము ,బలవత్తరమైన ప్రతిఘటనా శక్తి ని అలవరచుకొనవలెను. ఎన్నడును అజాగ్రత్తగా నుండరాదు. ఒక పాప పరిచితి ,ఒక అవివేకపు క్రియ శోధనకు ద్వారము తెరుచుటద్వారా ప్రతిఘటన శక్తిని బలహీనపరచి ఆత్మను అపాయమునకులోను చేయును. 1AH 401—404. CChTel 330.2