Go to full page →

ఈర్షాళువు`నేరారోపణ CChTel 342

సంఘ సభ్యులలో నిగ్రహములేని నాలుకలు కలవారున్నారని చెప్వలసినందుకు నాకు చాలా బాధగ నున్నది. తంటాలు పెట్టుటలో నానందించు నాలుకలు కలవు. గుసగుసలాడు వక్రబుద్ది గల నాలుకలు కలవు. వదరుబోతు మాటలు, అధిక ప్రసంగము, అనవసర జోక్యము, చమత్కారపు ప్రశ్నలు అధికరించుచున్నవి. కొండెములాడు వారిలో కొందరు ఈర్షాళువుచేత పెక్కండ్రు తమ్మును గద్దించుటకు దేవుడేర్పరచుకొన్న వారి యెడల ద్వేష భావము చేత నడిపింపబడు చున్నారు. విరోధ భావములగల ఈ శక్తులన్నియు పనిచేయుచున్నవి. కొందరు తమ మనోభావములను దాచుకొనగా మరికొందరు తమకు ఎలిసినదంతయు బట్టబయలుచేసి ఆపోహలను రేకెత్తించుటకు ఆత్రుతతగా నుందురు. CChTel 342.3

సత్యమును అసత్యముగాను, మంచిని చెడ్డగాను అమాయకత్వమును నేరముగాను మార్పు అసత్య స్వభావ మిప్పుడు చరుకుగా పనిచేయుచున్నట్లు నేను చూచితిని. దేవుని ప్రజలమని చెప్పుకొను వారి స్థితిని చూచి సాతానుడు సంతసించుచున్నాడు. అనేకులు తమ స్వకీయాత్మలను అలక్ష్యము చేసి ఇతరులను విమర్శించుటకు, ఖండన మండన చేయుటకు తరుణము కొరకు కనిపెట్టుకొని యుందురు. అందరికిని ప్రవర్తనా దోషములు కలవు. కీడు చేయవలెనని యుద్ధేశించు అసూయపరులను వ్యక్తులయందు ఏదో ఒక బలహీనత కనబడుట కష్టమయిన విషయము కాదు. ఈ న్యాయమూర్తులు “మాకు కొన్ని నిరూపణములు కలవు. మేము వారిపై నేరారోపణ చేసిన వారి నుండి వారు తప్పించుకొనజాలరు” అని చెప్పెదరు. సరియై న అవకాశము వచ్చు వరకు వారు ఆగి అప్పుడు వారు తమ ఆరోపణలను వెల్లడిరచెదరు. CChTel 343.1

స్వాభావికముగా బలమయిన ఊహ గలవారు తమ ఊహను కొనసాగించుటకు ప్రయత్నించుచు తద్వారా వారు తమ్మును తాము మోసగించుకొని యితరులను కూడా మోసగించెదరు. ఇతరులు అనాలోచితముగా పలికిన మాటలను వారు ప్రోగు చేసెదరు. మాటలు మాటలాడు వ్యక్తి నోటినుండి కొన్ని మాటలు యధాలాపముగా వచ్చుననియు అవి యతని ఉద్దేశ్యములను వ్యక్తము చేయునవి కావనియు వారు తలంచరు. అనాలోచితముగా పలికిన ఆ పలుకులు లెక్క చేయ దగనివైనను సాతాను యొక్క భూతద్దముతో పరిశీలించి వాని గూర్చి ఆలోచించి మెట్టుకు చెదల పుట్టను సహితము మహా పర్వతము కనబడునట్లు చేయును. CChTel 343.2

చెడ్డ వార్తలను పోగు చేయుట యితరుల ప్రవర్తన విషయము సందేహములు కలిగించు ఉదంతములను త్రవ్వి, పిమ్మట వారికి హాని చేయుటకు వానిని ఉపయోగించుటయందానందించుట క్రైస్తవ ధర్మమా? క్రీస్తు అనుచరుని గాయపర్చ గలిగినపుడు లేక అతనికి అపకీర్తి కలిగించినపుడు సాతానుడు ఆనందించును అతడు మన సహోదరుల మీద నేరము మోపువాడు. CChTel 343.3

సర్వమును పరిశీలించు దేవుని నేత్రము అందరి బలహీనతలను, శరీరాశలను గుర్తిం చును. అయినను ఆయన మన తప్పిదముల విషయము సహనము కలిగి మన బలహీనత విషయము జాలిపడుచున్నాడు. అట్టి మోసపు క్రియలు యోచిం చుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. ఆలాగు చేయుట వారి స్వాధీనములో నున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించు కొందురు, ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. క్రైస్తవునికి తప్పులు వెదుకుట, విమర్శించుట బాధాకరముగ నుండును. 65T 94—96; CChTel 343.4