Go to full page →

ఇప్పుడే దైవ ప్రేమను పొందుడి CChTel 359

నమ్మకమైన అబ్రాహాము మీదికి నా మనస్సు పోవుచున్నది. బెయేర్షెబాలో రాత్రి దర్శనమందు దేవుడిచ్చిన ఆజ్ఞానుసారముగా అతడు కుమారుని వెంటబెట్టుకొని ప్రయాణమయ్యెను. దేవుడు చూపించెదనని చెప్పిన పర్వతము తన ముందే యున్నది. ఆ పర్వతముపై నాతడు తన కుమారుని బలియియ్యవలసి యున్నాడు. CChTel 359.1

దేవుడానతిచ్చెను గనుక గడగడ వణుకుచున్న ప్రేమహస్తములతో ఇస్సాకును బంధించెను. కుమారుడు తండ్రి యధార్థతయందు నమ్మకమున్నది గనుక బలికి అంగీకరించెను. కాని అంతయు సిద్ధముగా నున్నప్పుడు, తండ్రి విశ్వాసము కుమారుని విధేయత పరిపూర్ణముగా పరీక్షించబడినప్పుడు, కుమారుని వధించుటకు ఎత్తబడిన చేతిని దూత అడ్డగించి యిది చాలునని చెప్పెను. “నీ కుమారుని నాకియ్య వెనుకతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని యిందు వలన నాకు కనబడుచున్నదనెను.” ఆది 22:12. CChTel 359.2

అబ్రహాము యొక్క యీ విశ్వాసకార్యము మనకు మేలు కలుగుటకు గాను లిఖించబడి యున్నది. దేవుని నిధులు ఎంత నిశితమైనవైనను వానియందు విశ్వాసము కలిగి యుండవలెనని యిది మనకు నేర్పుచున్నది. తల్లిదండ్రులకును దేవునికిని విధేయులై యుండవలెనని ఇది పిల్లలకు నేర్పించుచున్నది. దేవునికీయలేనంత ప్రశస్తమైనది మనకేమియు లేదని అబ్రాహాము చూపిన విధేయత వలన మనకు దోయతకమగుచున్నది. CChTel 359.3

అణుకువ, ఆత్మోపేక్ష, పేదరికము, శ్రమ, నిందతో కూడిన జీవితము జీవించి బాధసంకలితమయిన సిలువ మరణము పొందుటకు దేవుడు తన కుమారుని అనుగ్రహించెను. “ఇది చాలును నా ప్రియ కుమారా నీవు మరణించనక్కరలేదు” అను వార్త క్రీస్తుకు ఏ దూతయును అందించడాయె. ఇస్సాకు విషయమునందు వలె తుది ఘడియలో దేవుడు క్రీస్తుని సిగ్గుకరమయిన మరణమును వారించునేమోయని దూత గణములు విషాద వదనములతో వేచియుండిరి. కాని దేవుని ప్రియ కుమారుని కడకు దూతలట్టి వర్తమానమును కొని పోవుటకాయన అనుమతించడయ్యె. న్యాయస్థానమందును, కల్వరి మార్గమందును కలిగిన అవమానమును నివారించడయ్యె ఆయన అపహసించబడెను. గేలిచేయ బడెను. ఆయన ముఖముపై ఉమ్మి వేయబడెను. తన్ను ద్వేషించు వారి యకసక్కెములను, నిందలను భీషణ దూషణలను ఆయన సహించెను. మెట్టుకు సిలువపై తల వాలిచి ఆయన మరణించెను. ఇట్టి బాధననుభవించుటకు తన కుమారునిచ్చుటకన్న ఆయన ప్రేమను నిరూపించుటకు దేవుడు మరే యుత్తమ కార్యమునైనను చేయగలడా? మానవునికి దేవుడిచ్చినది ఉచిత వరము గనుక ఆయన ప్రేమ అపారమయినది. గనుక మన విశ్వాసము పైని, మన విధేయత పైని ఆయనకున్న హక్కులు కూడా అపారమయినవే. మానవుడీయగల సమస్తమును ఈయవలెనని ఆయన కోరుచున్నాడు. దైవ వరదానమునకు సమానముగా మన విధేయత యుండవలెను. మన మందరమును దేవునికి ఋణస్థులమే. మనలను మనము మనఃపూర్వకయాగము ద్వారా ఆయనకు అప్పగించుకొంటేనే తప్ప మనపై ఆయనకు గల హక్కులను నెరవేర్చలేము. ఆయన తక్షణమయిన, మనః పూర్వకమయిన విధేయతను కోరుచున్నాడు. ఇట్టి విధేయతనే ఆయన అంగీకరించును. దైవ ప్రేమాదరములను చూరలాడుటకు ఇప్పుడు మనకు అవకాశమున్నది. దీనిని పఠించు వారిలో కొందరికీ సంవత్సరము ఆఖరి సంవత్సరమేమో. పట్టుదలతో వెదకి ఆయన చిత్తమును సంతోషముతో నెరవేర్చు వారికి క్రీస్తనుగ్రహించు శాంతికి ప్రతిగా లోక భోగములను ఎన్నుకొనువారు ఈ విజ్ఞప్తిని పఠించు యవజనులలో నెవరైన ఉన్నారా? 63T 368-370; CChTel 359.4