Go to full page →

సారా మనుష్యుని బానిసగా చేయును. CChTel 438

దేవుని పోలికయందు సృజించబడిన మానవుడు సారాయి కలవడినపుడు తన్ను ఒక జంతువుయొక్క నడిపించునట్టి సారాయిని ఐచ్ఛికముగా త్రాగును. అతని విచక్షణ శక్తి సన్నగిల్లును. జ్ఞానము, మొద్దు బారును. మృగేచ్ఛలతనిలో చెలరేగును. పిదప అతి నీచమైన నేరములు సంధిల్లును. 83T 561; CChTel 438.2

మద్యమును సేవించకయున్నప్పుడు భీతిని పుట్టించు క్రియలను మధ్యముయొక్క ప్రభావములో చేయ సాహసింతురు. ఈ సారా విషము యొక్క ఆధీనమందున్నపుడు వీరు సాతాను అదుపాజ్ఞల క్రింద నుండెదరు. వారి పాలకుడు సాతానుడు. వారాతనితో సహకరించెదరు. 9Te 24; CChTel 438.3

మానవులు తమ ఆత్మను సారాయికి విక్రయించు నపుడు సాతానుడు ఇట్లు పని చేయును. శరీరాత్మ మానసముల నాతడు వశపరచుకొనును. అప్పుడు ప్రవర్తించువాడు సాతానుడు కాలి మానవుడు కాడు. జీవితాతము వరకు ప్రేమొంతునని వాగ్ధానము చేసిన తన ధర్మపత్నిని మోదుటకు త్రాగుబోతు చేతినెత్తునపుడు సాతానుని కౌర్యము ప్రస్ఫుట మగును. త్రాగుబోతు దౌర్జన్యమును బహిర్గత మొనర్చును. 10MM 114; CChTel 438.4

సారా ఉపయోగించు మనుష్యులు సాతానుకు దాసులగుదురు. రైలుబండ్లకు ఓడలకు, పడవలకు లేక విగ్రహాదాధన సంబంధమగు విసోదములకు, యుక్తముగాని యిచ్ఛలను తీర్చు కొనుచు దేవునిని ఆయన ధర్మశాస్త్రమును మరచిపోవు ప్రజలతో నిండిన కారులకు నాయకులైన వారిని వశపరచుకొనును. తామేమి చేయుచున్నారో వారెరుగరు. తప్పుడు సంజ్ఞలు చేసేదరు. తత్ఫలితముగా కారులోకదానతో నొకటి ఢీకొనును. ఆ మీదట భయము, అంగవైకల్యము మరణము సంభవించును. ఇట్టివి తరచుగా సంభవించును. CChTel 438.5

త్రాగుబోతు యొక్క నీచగుణములు తన సంతానమునకు అబ్బును. వారి ద్వారా తను భావి సంతతికవి ప్రాకును. 11Te 34, 38; CChTel 439.1