Go to full page →

పొగాకు నెమ్మదిగా పనిచేయు విషపదార్థము CChTel 439

పొగాకు నెమ్మదిగాను గూఢముగాను పనిచేయు విషపదార్థము. అది అపాయకరము. దాని నేవిధముగ నుపయోగించినను అది శరీరమునకు హాని కలిగించును. దీని ఫలితములు నెమ్మదిగా బయలుపడుననవి కనుక మరింత అపాయకరమైనవి. ముందు దీనిని గుర్తించుట కష్టము. పొగాకు నరములకు ఉద్రిక్తత కలిగించి ఆ మీదట వానిని దుర్భలము చేయును. అది మనస్సును బలహీనపరచి మందము చేయును. మత్తును కలిగించు మద్యముకనదిది నరములకెక్కువ హాని కలిగించును. ఇది చాలా మోసకరమయినది. శరీరము నుండి దీని ఫలితములను తీసివేయుట చాల కష్టము. దీని వాడకము ఘాటైన పానము కొరకు తృష్టను పుట్టించును. ఎక్కువ సందర్బములలోనిది సారాయి త్రాగుడుకు పునాది వేయును. CChTel 439.2

పొగాకు వాడకము అననుకూలత కలిగించునది, ఖర్చుతో కూడినది. అశుభమైనదిÑ దానిని వాడు వానిని అది అపవిత్రపరచును. అంతియుకాక, ఇతరులకది అసహ్యముగ నుండును. CChTel 439.3

పొగాకు వాడకము పిల్లలకు, యువజనులకు చెప్పనలవి కాని హాని చేయవచ్చును. బాలురు చాలా చిన్నతనమందే పొ గాకు వాడ నారంభించెదరు. శరీర మానసములు ఈ అలవాటును లొంగునప్పుడు ఏర్పడిన యీ అభ్యాసములు వారి శరీర బలమును క్షీణింపజేసి పెరుగుదలను అరికట్టి మనస్సును మొద్దుబారజేసి నీతిని హరించును`ఇవి దీని ఫలితములు. 12MH 327-329; CChTel 439.4

పారంపర్యముగా సంక్రమించితే తప్ప పొగాకు వాడకమునందలి యభిరుచి స్వభావ సిద్ధముగా వచ్చునది కాదు. CChTel 439.5