Go to full page →

క్రీస్తు ఆలశ్యముగా వచ్చునని తలంచుటయందు గల అపాయము CChTel 510

“నా యజమానుడు ఆలశ్యము చేయుచున్నాడ” ని తన మనస్సులో అనుకొనిన దుష్టుడైన ఆ దాసుడు (మత్తయి 24:48) క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టు చున్నట్లు చెప్పువారిని సూచించుచున్నాడు. అతడు పైకి దేవుని సేవయందు నిమగ్నుడైనట్లు అగపడి అంతరంగికముగా సాతాను వశం వదుడైన “దాసుడు”. CChTel 510.2

అపహాసకునివలె నతడు సత్యమును ఉపేక్షించడు. కాని ప్రభువు ఆలస్యము చేయునను ఉద్దేశ్యమును తన జీవితముద్వారా బయలుపరచును, ఊహాగానము ఆధ్యాత్మిక సంగతుల విషయము అతనికి అలక్ష్యము పుట్టించును. లోక సూక్తుల నతడంగీకరించి లోకాచారముల ననుసరించును. స్వార్థము, లౌకికాశలు అతని నేలును. తన స్నేహితులు తనకున్న ఉన్నత స్థితి యందుందురని భావించి వారి యత్నములను చులకనచేసి వారి ఆశయములను ఆక్షేపించ నారంభించును. ఇట్లు తన సహ సేవకులను అతడు హింసించును. CChTel 510.3

దైవ ప్రజలనుండి వేరై భక్తి హీనులతో నతడెక్కువ స్నేహించును. అతడు “త్రాగుబోతులతో” తినుచు త్రాగుచు లోకభోగాసక్తులతో కూడి వారి స్వభావమునందు పాలు పొందును. ఇట్లాతడు మందమతి, అలక్ష్యము, సోమరితనములకు దాసుడయి నిర్విచార సుఖస్థితిలో ముణిగిపోవును. 75T 101, 102; CChTel 510.4