Go to full page →

కొత్త వెలుగు అనబడునది అనేకులను మోసగించును CChTel 510

లోకముపైకి రానున్న నాశనమందు దేవుని శేషించిన ప్రజలను ముంచివేయవలెనని సాతానుని నిరీక్షణ. క్రీస్తు రాకడ సమీపించు కొలది వారికి నాశనము చేయుటకు అతడు కృత నిశ్చయుడై యున్నాడు. మాకు క్రొత్త వెలుగు లేక దర్శనము వచ్చినదని చెప్పుకొనుచు స్త్రీ, పురుషులు బయలుదేరెదరు. తాము మొదట అంగీకరించిన సిద్దాంతములయందు ప్రజల విశ్వాసము బలహీనము చేయుటయే వారి యుద్ధేశ్యము. వారి సిద్ధాంతాలు దైవ వాక్యానుసారముగ ఉండవు. అయినను అనేకులు వీని వలన మోసగించబడెదరు. CChTel 510.5

దుష్ప్రచారము సాగును. ఈ ఉచ్చులో నెవరో పడెదరు. ఈ వార్తలను వారు నమ్మెదరు. వారు తిరిగి ఆ చెడ్డ వార్తను ఇతరులకు చెప్పెదరు. ఇట్లు ప్రధాన వంచకునికిని వారికిని మధ్య సంబంధ మేర్పడును. దేవుడు పంపు వర్తమానములను బహిరంగముగా విసర్జించు ఈ స్వభావము ఎల్లప్పుడు ప్రదర్శించబడదు. కాని అనేక విధముల స్థిరమైన అపనమ్మకము వ్యక్తము చేయబడును. ప్రతి అసత్య భాషణము ఈ అవిశ్వాసమును బలపర్చును. ఈ సాధనము వలన అనేకాత్మలు తప్పు మార్గము పట్టును. CChTel 511.1

ప్రతి విధమైన తప్పిదమును గూర్చి మనము అతి జాగ్రత్తగా నుండవలెను. ఏలయనగా మానవులను సత్యము నుండీ దూరపరచుటకు సాతానుడు నిత్యము కృషి చేయుచున్నాడు. 85T 295, 296; CChTel 511.2