Go to full page →

నగరాల్లోణ్ణి సేవ ChSTel 177

గొప్ప సేవ జరగాల్సిన కాలంలో మనం నివసిస్తున్నాం. దేశంలో శుద్దమైన సువార్తకు కరువు ఏర్పడింది. ఆకలిగా ఉన్న ఆత్మలకు జీవాహారం ఇవ్వాలి. ఈ సేవ చెయ్యటానికి అంకితభావం కల గ్రంథ విక్రయ సేవకుడికున్న తరుణం కన్నా మెరుగైన అవకాశం ఇంకెవరికీ లేదు. మన పెద్ద పెద్ద నగరాల్లోని గృహల్లో ఈ కాలానికి ఉద్దేశించిన సత్యంతో నిండిన వేల పుస్తకాల్ని ఇవ్వాల్సి ఉంది. సదర్న్ వాచ్ మేన్, నవ. 20, 1902. ChSTel 177.1

మన పత్రికల్లో ఆత్మల్ని రక్షించే శుభప్రద సత్యాలు ప్రచురమౌతాయి. మన పత్రికల్ని విక్రయించగల వారు అనేకులున్నారు. నశిస్తున్న ఆత్మల్ని రక్షించటానికి మనందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఎన్నికైన వారిని సయితం మోసగించటానికి సాతాను తీవ్రంగా కృషి చేస్తున్నాడు. మనం అప్రమత్తంగా ఉండి పనిచెయ్యాల్సిన సమయం ఇదే. మన పత్రికల్ని, పుస్తకాల్ని ప్రజల దృష్టికి తేవాలి. నేటి సత్యానికి సంబంధించిన సువార్తను జాప్యం లేకుండా నగరాల్లో ప్రకటించాలి. మనం మేల్కొని మన విధి నిర్వహణను చేపట్టవద్దా? టెస్టిమొనీస్, సం. 9, పు. 63. ChSTel 177.2