Go to full page →

ఆరోగ్య సాహిత్యం ChSTel 177

గ్రంథ విక్రయ సేవకులు తాము సందర్శించేవారి దృష్టికి మన ఆరోగ్య ప్రచురణల్సి తేవాలి. రోగుల విషయంలో తీసుకోవలసిన శ్రద్ధ జాగ్రత్తల గురించి వ్యాధులకు చికిత్స గురించి ఈ పత్రికల్లో ఉన్న విలువైన ఉపదేశం గురించి వారికి చెప్పాలి. ఈ ఉపదేశాన్ని అధ్యయనం చేసి ఆచరణలో పెడితే తమ కుటుంబానికి మంచి ఆరోగ్యం లభిస్తుందని వారికి చెప్పండి. జీవితానికి సంబంధించిన విజ్ఞాన శాస్త్రాన్ని ప్రతీ కుటుంబం అవగాహన చేసుకోటం ఎంత ప్రాముఖ్యమో వారికి వివరించండి. శరీరాన్ని నిర్మించి, అద్బుతమైన దాని యంత్రాంగాన్ని చలనంలో ఉంచుతున్న ఆ ప్రభువు పైకి వారి గమనాన్ని తిప్పండి. మన శక్తుల్ని మన అవయవాల్ని జాగ్రత్తగా కాపాడుకోటంలో దేవునితో సహకరించటం తమవంతు బాధ్యతని చెప్పండి. ChSTel 177.3

శరీరాన్ని గూర్చిన శ్రద్ధ గొప్ప బాధ్యత. దాన్ని సరిగా నిర్వహించటానికి శరీర భాగాల్ని గూర్చిన జ్ఞానం అవసరం. ఆహార వాంఛల్ని శరీరేచ్చల్ని తృప్తి పర్చటానికి మనిషి శరీర యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నందువల్ల అవి తమ పనిని బలహీనంగాను అతికష్టంగాను చేస్తుంటే అతడు దేవున్ని అగౌరవపర్చుతున్నాడని వారికి చెప్పండి. అమ్మటానికి మా వద్ద ఉన్న పుస్తకాలు ఆరోగ్యం గురించి విలువైన ఉపదేశం అందిస్తాయని, ఈ ఉపదేశాన్ని ఆచరించటం వల్ల ఎంతో బాధ తప్పుతుందని, డాక్టర్ల బిల్లులకి అయ్యే ఖర్చు చాలా తుగ్గుతుందని వారికి చెప్పండి. ఈ పుస్తకాల్లో ఉన్న విలువైన సలహాలు సూచనల్ని తాము తమ వైద్యుణ్ని సందర్శించే స్వల్ప వ్యవధిలో పొందటం బహుశా సాధ్యంకాదని చెప్పండి. సదర్న్ వాచ్ మేన్, నవ. 20, 1902. ChSTel 178.1

సాటి మనుషుల్ని రక్షించాలన్న కోరిక కలిగి యువకులు గ్రంథ విక్రయ సేవను చేపట్టినప్పుడు మారుమనసు పొందిన వ్యక్తుల్ని చూస్తారు. వారి సేవ వలన ప్రభువుకి గొప్ప ఆత్మల పంట చేకూరుతుంది. అందుచేత వారు ఈనాటి సత్యాన్ని ప్రచురించటానికి మిషనెరీలుగా వెళ్లి, జీవితంలో అలసిన వారితో సమయోచితమైన మాటలు మాట్లాడగలిగేందుకు ఎక్కువ వెలుగు ఎక్కువ జ్ఞానం కోసం సర్వదా ప్రార్ధించాలి. దయగల ఒక్క పనిచెయ్యటానికి ప్రతీ తరుణాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. అలా చెయ్యటం ద్వారా తాము ప్రభువుకి చిన్నచిన్న పనులు చేసి పెడ్తున్నామని వారు గుర్తుంచుకోవాలి.... ఎల్లప్పుడు వారు తమ పనిలోకి కొన్ని ఆరోగ్య పుస్తకాన్ని తీసుకువెళ్లాలి. ఎందుకంటే వర్తమానానికి ఆరోగ్య సంస్కరణ కుడిభుజం వంటిది. సదర్న్ వాచ్ మేన్, జన. 15, 1903. ChSTel 178.2