Go to full page →

పనికి ధైర్యం ప్రార్ధన ద్వారా వచ్చింది ChSTel 200

నెహెమ్యా, అర్తహషస్త ముఖాముఖి నిలబడ్డారు. ఒకడు ఓ దళిత జాతికి చెందిన సేవకుడు, ఇంకొకడు లోకంలో ఓ గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తి. అయితే అంతస్తు తేడాకన్నా ఎంతో ప్రధానమైనది వారిని వేరు చేసిన నైతికపరమైన దూరం. నెహెమ్యా “జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధానపడవలెను వారునాతో సమాధాన పడవలెను” అన్న రాజులకు రాజు ఆహ్వానాన్ని ఆచరించాడు. అతడు పరలోకానికి పంపిన మౌన ప్రార్థన తాను అనేక వారాలుగా చేస్తున్నదే. అదేమిటంటే దేవుడు తన మనవిని సఫలం చెయ్యాలన్న, ఇప్పుడు తన పక్షంగా పని చెయ్యటానికి తనకో సర్వజ్ఞుడు సర్వశక్తుడు అయిన మిత్రుడున్నాడన్న, ధైర్యంతో ఆ దేవుని మనిషి రాజు ఆ స్థానంలో తన కొలువు నుంచి కొంత కాలం సెలవు మంజూరు చేయ్యమని, యెరూషలేములో పాడైన స్థలాన్ని కట్టి దాన్ని మళ్లీ ప్రాకారాలు గల పట్టణం చెయ్యటానికి అధికారం ఇమ్మని రాజుకి మనవి చేశాడు. ఆ యూదు నగరానికి యూదు జాతికి ఎంతో ప్రాముఖ్యమైన ఫలితాలు ఈ మనవి పై ఆధారపడి ఉన్నాయి. నెహెమ్యా అంటున్నాడు, “నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవిని ఆలకించెను.” సదర్న్ వాచ్ మేన్, మార్చి 8, 1904. ChSTel 200.3