Go to full page →

అధికారిక ఆమోదం పొందాడు ChSTel 201

రాజుకి అతడు (నెహెమ్యా) చేసిన మనవి మంజూరు కావటంతో, తన ప్రణాళికల్ని విజయవంతంగా సాకారం చెయ్యటానికి ఏమేమి అవసరమౌతుందో అదంతా అడగటానికి ధైర్యం తెచ్చుకున్నాడు. తన కార్యానికి అధికారం ఇవ్వటానికి, ప్రయాణంలో తనకు భద్రత కూర్చటానికి సైనిక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేయించుకున్నాడు. యూఫ్రటీసు నది అవతల ఉన్న రాష్ట్రాలగుండా తాను యూదయకు ప్రయాణించాల్సి ఉన్న రాష్ట్రాల గవర్నలకు రాజు వద్ద నుంచి ఉత్తరాలు తీసుకున్నాడు. యెరూషలేములో కట్టనున్న కట్టడాలకు కలప ఇవ్వమని లెబానోను పర్వత ప్రాంతాల్లోని అడవుల అధికారిని ఆదేశిస్తూ రాజు వద్ద నుంచి ఓ లేఖ తీసుకున్నాడు. తన అధికారానికి మించి వ్యవహరిస్తున్నాడన్న పిర్యాదులికి తావులేకుండా నెహెమ్యా తన అధికారాలు, ఆధిక్యతలు స్పష్టంగా నిర్వచించబడేటట్లు జాగ్రత్తలు తీసుకున్నాడు. సదర్న్ వాచ్ మేన్, మార్చి 15, 1904. ChSTel 201.1

తన మార్గంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లకు రాజు రాసిన లేఖలు నెహెమ్యా కు గౌరవ ప్రదమైన స్వాగతాన్ని సత్వర సహాయాన్ని సమకూర్చాయి. పారసీక రాజు పరిరక్షణ కింద ఉన్న అధికారిని ఏ శత్రువు కన్నెత్తి చూడటానికి సాహసించలేదు. రాష్టపరిపాలకులు అతడి పట్ల ప్రత్యేక శ్రద్ద పరిగణన ప్రదర్శించారు. నెహెమ్యా ప్రయాణం సుఖంగా సాగింది. సదర్న్ వాచ్ మేన్, మార్చి 22, 1904. ChSTel 201.2