Go to full page →

దృఢ సంకల్పం ChSTel 268

దేవుని సేవలో ఉన్నవారు ఆత్మల రక్షణ కృషిలో చైతన్యాన్ని, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించాలి. దైవ ప్రతినిధులు వైఫల్యం చెందని, నిరుత్సాహపడని దృఢ చిత్తంతో పని చెయ్యకపోతే నశించిపోయే వారున్నారని జ్ఞాపకముంచుకోవాలి. టెస్టిమొనీస్, సం.6, పు. 418. ChSTel 268.6

ఆయన మనకు గొప్ప సేవ నిచ్చాడు. దాన్ని మనం నిర్దుష్టంగా కృతనిశ్చయంతో చేద్దాం. సత్యం మనకు చేసిన మేలుని మన జీవితాల్లో కనపర్చుదాం. టెస్టిమొనీస్, సం.6, పు. 418. ChSTel 268.7