Go to full page →

వైఫల్యం ఆలోచన ఉండకూడదు ChSTel 307

క్రీస్తు సేవకులు తమ సేవలో వైఫల్యం గురించి ఆలోచించ కూడదు, మాట్లాడకూడదు. అన్ని విషయాల్లోను మన సామర్థ్యం యేసు ప్రభువే. ఆయన ఆత్మ మనకు ఆవేశం. వెలుగు ప్రసరించటానికి సాధనాలుగా మనల్ని మనం ఆయన చేతులకి సమర్పించుకున్నప్పుడు మేలు చెయ్యటానికి ఆర్థిక వనరులు అంతం కావు. ఆయన సమృద్ధి నుంచి మనం పొందవచ్చు. పరిమితిలేని కృపను మనం పొందవచ్చు. గాసిపుల్ వర్కర్స్ పు. 19. ChSTel 307.3

మనని మనం దేవునికి పూర్తిగా సమర్పించుకుని మన సేవలో ఆయన ఆదేశాల్ని అనుసరిస్తే దాని నెరవేర్పుకి ఆయనే బాధ్యత వహిస్తాడు. మనం నమ్మకంగా చేసే పని సాఫల్యం గురించి మనం ఊహాగానాలు చెయ్యటం ఆయనకు ఇష్టముండదు. వైఫల్యం గురించి మనం ఒక్కసారి కూడా ఆలోచించకూడదు. వైఫల్యమెరుగని ఆయనతో మనం సహకరించాలి. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పు. 363. ChSTel 307.4

తన ప్రజలు తమను గురించి తక్కువ అంచనా వేసుకున్నప్పుడు ప్రభువు ఆశాభంగం చెందుతాడు. తన స్వార్థంగా తాను ఎంపిక చేసుకున్న ప్రజలు తమకోసం తాను చెల్లించిన మూల్యం ప్రకారం తమ విలువను గుర్తించాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు వారిని కావాలని కోరుకునాన్నాడు. లేదంటే వారిని విమోచించేందుకు తన కుమారుణ్ని అంత ప్రమాద భరితమైన కర్తవ్యం పై పంపేవాడుకాదడు. ఆయన వారిని వినియోగించుకుంటాడు. తన నామాన్ని మహిమ పర్చేనిమిత్తం తనను అత్యున్నతంగా డిమాండు చేస్తే ఆయన సంతోషపడ్డాడు. వారు ఆయన వాగ్దానాల్ని విశ్వసిస్తే వారు గొప్ప కార్యాలకోసం ఎదురుచూడవచ్చు. ChSTel 308.1