Go to full page →

మానవ నీతివాదులు ChSTel 46

క్రైస్తవులుగా చెప్పుకునే అనేకులు కేవలం మానవనీతివాదులే. క్రీస్తును లోకానికి సూచించటం ద్వారా ఆయన్ని ఘనపర్చటానికి సామర్థ్యాన్నిచ్చే వరాన్ని వారు నిరాకరిస్తారు. పరిశుద్ధాత్మ పరిచర్యవారికి ఆశ్చర్య కార్యంగా ఉంటుంది. వారు వాక్యాన్ని ఆచరించేవారు కారు. క్రీస్తుకు చెందిన వారిని లోకానికి చెందినవారిని గుర్తించేందుకుగల పరలోక నియమాలు దాదాపు గుర్తుపట్టలేనివవుతాయి. క్రీస్తు అనుచరులుగా చెప్పుకునేవారు ప్రత్యేక ప్రజలుగా దేవుని స్వకీయజనంగా ఇక ఉండరు. విభజన రేఖ స్పష్టంగా ఉంటుంది. ఆ ప్రజలు లోకానికి లోబడతారు. దాని అలవాట్లు ఆచారాలు స్వార్థమారాల్ని అనుసరిస్తారు. ధర్మశాస్త్రాచరణ విషయంలో లోకం సంఘం వద్దకు రావాల్సి ఉండగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటంలో సంఘం లోకం వద్దకు వెళ్తుంది. సంఘం రోజుకు రోజు లోకంలా మారుతూపోతుంది. క్రైస్ట్స్ ఆబ్జెక్ట్ లెసన్స్, పులు. 315, 316. ChSTel 46.1