Go to full page →

నేరం ఒక అంటువ్యాధి ChSTel 57

మనం “నేరం అనే అంటువ్యాధి” నడి మధ్యన నివసిస్తున్నాం. అన్నిచోట్ల దేవునికి భయపడే మనుషుల్ని ఈ తలంపు దిగ్ర్భాంత పర్చుతుంది. విస్తరిస్తున్న దుర్నీతి మానవ కలం వర్ణించలేనిది. రాజకీయ సంఘర్షణల్ని గురించి, లంచగొండితనం గురించి, మోసాల గురించి రోజుకి రోజు తాజా వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ బాధపట్ల ఉదాసీనతను గూర్చి, క్రూర హత్యాకాండను గూర్చి కథనాలు ప్రతీదినం వస్తున్నాయి. ఉన్మాదం, హత్యలు, ఆత్మహత్యలు ప్రతీదినం దర్శనమిస్తున్నాయి. మనసును పక్కదారిపట్టించి, భ్రష్టపర్చటానికి, శరీరాన్ని అపవిత్రపర్చి నాశనం చెయ్యటానికి సాతాను ప్రతినిధులు మనుషుల మధ్య తీవ్రంగా కృషిచేస్తున్నారన్న విషయాన్ని ఎవరు శంకిస్తారు? ది మినిస్ట్రీ ఆఫ్ హీలింగ్, పులు. 142,143. ChSTel 57.2

అరాచకత్వ స్వభావం అన్ని జాతుల్లోను వ్యాపిస్తున్నది. అప్పుడప్పుడు హఠాత్తుగా లేచి లోకాన్ని భయందోళనలతో నింపే సంఘర్షణలు, లోపల బంధించబడ్డ ఉద్రేకాలు, న్యాయరాహిత్యతకు సూచికలు. ఒకసారి అదుపు తప్పినప్పుడు అవి ప్రపంచాన్ని దుఃఖంతోను నాశనంతోను నింపుతాయి. జలప్రళయానికి ముందు నివసించిన ప్రజల్ని గురించి లేఖనం ఇస్తున్న వర్ణన నవీన సమాజం ఏ పరిస్థితికి పరుగులు తీస్తున్నదో వాస్తవంగా సూచిస్తున్నది. ఇప్పుడు సయితం, ప్రస్తుత శతాబ్దంలో, క్రైస్తవదేశాలుగా పిలవబడే దేశాల్లో అనుదినం హేయమైన నేరాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ నేరలకే పాత ప్రపంచంలోని పాపులు నాశనమయ్యారు. ప్రజలు పశ్చాత్తాపం పొంది, రావలసిఉన్న నాశనాన్ని తప్పించుకునేందుకు ప్రపంచాన్ని హెచ్చరించేందుకు జలప్రళయానికి ముందు దేవుడు నోవహును పంపాడు. క్రీస్తు రెండోరాకకు సమయం దగ్గరయ్యే కొద్దీ, ఆ గొప్ప సంఘటనకు సిద్ధపడాలిందంటూ లోకాన్ని ChSTel 57.3

హెచ్చరించటానికి దేవుడు తన సేవకుల్ని పంపుతాడు. వేలాది ప్రజలు దైవదర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ నివసిస్తున్నారు. ఇప్పుడు వారిపట్ల కృపతో తన ధర్మశాస్త్ర విధుల్ని ఆచరించాల్సిందిగా వారికి ఆయన పిలుపునిస్తున్నాడు. దేవుని ఎదుట పశ్చాత్తాపపడి, క్రీస్తుపై విశ్వాసం కనపర్చేవారందరూ క్షమాపణ పొందుతారు. పేట్రియార్క్స్ అండ్ ప్రోఫెట్స్, పు. 102. ChSTel 58.1

అపాయకర సమయం మన మీదికి వచ్చిందని లోకంలోని పరిస్థితులు సూచిస్తున్నాయి. సమీప భవిష్యత్తులోని బయంకర సంఘర్షణను గూర్చి దినపత్రికలు సూచిస్తున్నాయి. దోపిడీలు అపహరణలు తరచుగా సంభవిస్తున్న ఘటనలు. సమ్మెలు సాధారణమైపోయాయి. దొంగతనాలు, హత్యలు ఎక్కడపడితే అక్కడ చోటు చేసుకుంటున్నాయి. దయ్యం పట్టిన మనుషులు పురుషులు, స్త్రీలు, పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. మనుషులు దుష్టత్వాన్ని దుర్నీతిని ప్రేమిస్తున్నారు. ప్రతివిధమైన పాపం ప్రబలతున్నది. టెస్టిమొనీస్, సం.9, పు.11. ChSTel 58.2