Go to full page →

శిక్షణ ఇవ్వగలవారిని ఆఫీసర్లుగ ఎంపిక చెయ్యాలి ChSTel 67

నూతన సంఘాలకి ఆఫీసర్లని ఎంపిక చెయ్యటంలో జాగ్రత్త తీసుకోవాలి. వారు పూర్తిగా మారిన పురుషులు స్త్రీలు అయిఉండాలి. ఉపదేవమివ్వటానికి సమర్థులు, మాట క్రియ రెండింటిలోను పరిచర్య చెయ్యటానికి సమర్థులు అయినవారిని ఎంపిక చేసుకోవాలి. ప్రతీ శాఖలోను పనికి గొప్ప అవసరం ఉన్నది. టెసిమొనీస్, సం. 6, పు. 85. ChSTel 67.3

పెద్దలు, సంఘంలో నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు పని నిర్వహణ నిమిత్తం తమ ప్రణాళికల పై ఎక్కువ శ్రద్ద పెట్టాలి. ప్రతీ సభ్యుడికి ఒక పాత్ర ఉండేటట్లు, ఎవరూ గురిలేకుండా నివసించకుండేటట్లు, కాని అందరూ తమ తమ సామర్థ్యం మేరకు కార్యసాధన చేసేటట్లు వారు సంఘ కార్యాల్ని ఏర్పాటు చెయ్యాలి.... సంఘ సభ్యులు నిస్వార్ధంగా మనస్పూర్తిగా, సమర్ధంగా దేవుని సేవను చేసేందుకు వారికి అట్టి శిక్షణ నివ్వటం అత్యవసరం. సంఘం ఫలరహితం మృతం కాకుండా చూసేందుకు అనుసరించాల్సిన మార్గం ఇదే... సంఘంలోని ప్రతీ సభ్యుడు క్రియాశీలక సేవకుడవ్వాలి - దేవుని మందిరంలో వెలుగు విరజిమ్మే సజీవమైన రాయి అవ్వాలి. రివ్యూ అండ్ హెరాల్డ్, సెప్టె. 2, 1890. ChSTel 67.4